అన్వేషించండి

NPCIL Jobs: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

NPCIL: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో స్టైపెండరీ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. సెప్టెంబర్‌ 11లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.

NPCIL Stipendiary Trainee Recruitment: రాజస్థాన్‌లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 279 స్టైపెండరీ ట్రైనీ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 11లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైపెండ్ ఇస్తారు. ఆ తర్వాత నెలకు రూ.32,550 జీతంగా చెల్లిస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 279.

1) స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-II  (ఆపరేటర్): 153 పోస్టులు

2) స్టైపెండరీ కేటగిరీ-II (ట్రైనీ మెయింటైనర్): 126 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్-28, ఫిట్టర్-54, ఎలక్ట్రానిక్స్-14, ఇన్‌స్ట్రుమెంటేషన్-26, మెషినిస్ట్/టర్నర్-02, వెల్డర్-02.

అర్హత: పోస్టులను అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి(సైన్స్‌ సబ్జెక్టుల్లో), సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 11.09.2024 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; 1984 అల్లర్ల బాధిత కుటుంబీకులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

రాతపరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-60 మార్కులు, సైన్స్ 20 ప్రశ్నలు-60 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 10 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి ఒకమార్కు కోత విధిస్తారు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్ కేటగిరీకి 40 శాతంగా, ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ-దివ్యాంగులు-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 శాతంగా నిర్ణయించారు.

అడ్వాన్స్‌డ్ టెస్ట్ విధానం: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో అడ్వాన్స్‌డ్ టెస్ట్ నిర్వహిస్తారు. 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 50 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతిప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. ప్రతి  పరీక్ష సమయం 2 గంటలు. ఆపరేటర్ పోస్టులకు పదోతరగతి లేదా తత్సమాన స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు. మెయింటెయినర్ పోస్టులకు అభ్యర్థికి సంబంధించిన విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. అలాగే ప్రతి తప్పు సమాధానానికి ఒకమార్కు కోత విధిస్తారు. పరీక్షలో అర్హత మార్కులను జనరల్ కేటగిరీకి 30 శాతంగా, ఎస్సీ-ఎస్టీ-ఓబీసీ-దివ్యాంగులు-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 20 శాతంగా నిర్ణయించారు. 

జీతం: ఎంపికైనవారికి స్టైపెండ్ కింద మొదటి సంవత్సరం నెలకు రూ.20,000; రెండో సంవత్సరం నెలకు రూ.22,000 ఇస్తారు. ఈ సమయంలో బుక్ అలవెన్స్ కింద అదనంగా ఒకేసారి రూ.3000 ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి టెక్నీషియన్-బి హోదాలో నెలకు రూ.32,550 జీతంగా చెల్లిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విధిగా సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది కనిష్టంగా 2 సంవత్సరాల నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల వరకు ఉంటుంది. బాండ్ ఉల్లంఘించిన సందర్భంలో రూ.5,07,000 తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మొత్తం స్టైపెండ్ ప్లస్ బుక్ అలవెన్స్‌కు సమానంగా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.08.2024.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.09.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget