అన్వేషించండి

IBPS SO Mains Admitcard: ఐబీపీఎస్‌ ఎస్‌వో మెయిన్స్‌ కాల్‌ లెటర్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

IBPS: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష అడ్మిట్ కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ జనవరి 18న విడుదల చేసింది.

IBPS SO Mains Admitcard: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRP SPL-XIII) ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష అడ్మిట్ కార్డు(కాల్‌ లెటర్)లను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) జనవరి 18న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో కాల్ లెటర్లను అందుబాటులో ఉంచింది. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా రూల్ నెంబరు, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి కాల్‌ లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 28న ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1,402 ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్‌/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్ష కాల్‌ లెటర్ల కోసం క్లిక్ చేయండి..

మెయిన్ పరీక్ష ఇలా..

IBPS SO Mains Admitcard: ఐబీపీఎస్‌ ఎస్‌వో మెయిన్స్‌ కాల్‌ లెటర్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐబీపీఎస్‌ పరీక్షల​​​ క్యాలెండర్​ విడుదల..
ఈ ఏడాది వివిధ బ్యాంకుల్లో క్లర్క్, పీవో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్షలకు సంబంధించిన 2023-24 పరీక్షల క్యాలెండర్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తాజాగా విడుదల చేసింది. దీనిప్రకారం ఐబీపీఎస్ ఈ ఏడాది గ్రామీణ బ్యాంకుల్లో(RRB) ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పోస్టులను; అదేవిధంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయంది.

ప్రకటించిన ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం..

➥ గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్(స్కేల్-1), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష; ఆఫీసర్ స్కేల్-1 మెయిన్ పరీక్ష సెప్టెంబరు 29న, ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ పరీక్షలను అక్టోబరు 6న ఐబీపీఎస్ నిర్వహించనుంది. అదేవిధంగా ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్-2, 3 సింగిల్ పరీక్షను సెప్టెంబరు 29న నిర్వహించనుంది. 

➥ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఆగస్టు 24, 25;, 31 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 13న మెయిన్ పరీక్ష ఉండనుంది.

➥ ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అక్టోబరు 19, 20 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 30న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

➥ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నంబరు 9న ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబరు 14న మెయిన్ పరీక్షలను ఐబీపీఎస్  నిర్వహించనుంది. 

పరీక్ష పేరు  తేదీలు
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ 03.08.2024, 04.08.2024, 10.08.2024, 17.08.2024 & 18.08.2024
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్ 29.09.2024 
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్ 29.09.2024
 ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ 06.10.2024
 ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 24.08.2024, 25.08.2024, 31.08.2024
 ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ 13.10.2024
 ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ 19.10.2024, 20.10.2024
 ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ 30.11.2024
 ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ 09.11.2024
 ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ 14.12.2024

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget