అన్వేషించండి

Railway Vacancies: ఇండియన్ రైల్వేలో లక్షల్లో ఖాళీలు, మొత్తం ఎన్ని పోస్టులంటే?

రైల్వేశాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కలిపి ఏకంగా 2.50 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

రైల్వేశాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కలిపి ఏకంగా 2.50 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిలో ఒక్క సేఫ్టీ కేటగిరీలోనే 53,178 పోస్టులు పెండింగ్‌లో ఉన్నట్టు రైల్వే శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు రైల్వేశాఖ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో పేర్కొంది. 

దేశంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ విభాగంగా మొదటిస్థానంలో నిలిచిన రైల్వేశాఖ.. దేశంలో అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్న విభాగంగాను గుర్తింపు పొందింది. ఇక కీలకమైన ఆపరేషనల్‌ సేఫ్టీ విభాగంలో 53,178 పోస్టులు పెండింగులో ఉండటం గమనార్హం. దేశంలో అన్ని రైల్వేజోన్ల పరిధిలో కలిపి మొత్తం 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. వాటిలో అత్యధికంగా గ్రూప్‌–సి ఉద్యాగాలే 2.48 లక్షలు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్‌–ఏ ఉద్యోగాలు 1,965, గ్రూప్‌–బి ఉద్యోగాలు 105 ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నార్తర్న్‌ రైల్వేలో 32,636 పోస్టులు ఖాళీగా ఉండగా, అత్యల్పంగా దక్షిణ పశ్చిమ రైల్వే జోన్‌లో 4,897 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

రైల్వేశాఖలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 2.74 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ రెండు నెలల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. వీటిలో ఒక్క సేఫ్టీ కేటగిరీలోనే 1.7లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టు తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ రైల్వేల్లో ఖాళీలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. రైల్వేశాఖలో గ్రూప్-సీ కేటగిరీ (లెవెల్-1 లేదా ఎంట్రీ లెవెల్ స్టాఫ్)లోనే 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. వీటిలో ఒక్క భద్రతకు సంబంధించిన కేటగిరీలోనే 1,77,924 ఖాళీలు ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది జూన్ 1 నాటికి సేఫ్టీ కేటగిరీలో 9,82,037 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. 8,04,113 ఉద్యోగాలను భర్తీ చేసినట్టు సమాధానంలో పేర్కొంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, త్వరితగతిన పదోన్నతులు కల్పించడం, శిక్షణ తర్వాత కోర్ ఉద్యోగాలకు నాన్-కోర్ సిబ్బందిని తరలించడం వంటి చర్యల ద్వారా సమస్యను పరిష్కరిస్తున్నట్టు రైల్వేశాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.

రైల్వేశాఖలో మొత్తంగా 3.12లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2022 డిసెంబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ ఏడాది అక్టోబర్ నాటికి 1.52లక్షల ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 1.38లక్షల అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని.. వీరిలో 90వేల మంది చేరినట్టు తెలిపారు. వీటిలో 90శాతం పోస్టులు సేఫ్టీ కేటగిరీకి చెందినవేనన్నారు.

ALSO READ:

ఆగస్టు 29, 30 తేదీల్లో ఆ పాఠ‌శాలల‌కు సెల‌వులు, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 ప‌రీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే గ్రూప్-2 ప‌రీక్షల‌ు నిర్వహించనున్న పాఠ‌శాల‌ల‌కు ఆగస్టు 29, 30 తేదీల్లో సెల‌వులు ప్రక‌టిస్తూ పాఠ‌శాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చ‌ర్యలు తీసుకోవాల‌ని జిల్లా విద్యాధికారుల‌కు స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్టర్ శ్రీ దేవ‌సేన‌ ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2 ప‌రీక్షల నిర్వహ‌ణ‌పై ఇప్పటికే జిల్లాల క‌లెక్టర్లు, ఎస్‌పీలు, ఇత‌ర అధికారుల‌తో టీఎస్‌పీఎస్సీ అధికారులు ప‌లుమార్లు స‌మావేశాలు నిర్వహించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

షెడ్యూలు ప్రకారమే 'గ్రూప్‌-2' పరీక్ష నిర్వహణ, స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా గురించి వస్తున్న పుకార్లకు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష జరుగుతుందని ఆదివారం (జులై 6) అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన  ప్రకటనతో స్పష్టత వచ్చినట్లయింది. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది టీఎస్‌పీఎస్సీని ఆశ్రయించారు. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్ష నిర్వహించాలని మరికొందరు కమిషన్‌ను కోరారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్‌ ప్రకారమే 'గ్రూప్‌-2' పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్‌) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన (షార్ట్ నోటిఫికేషన్)ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు 585 పోస్టులు, మహిళలకు 65 పోస్టులు కేటాయించారు. ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
2025 Upcoming Hybrid Cars: 2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
2025లో లాంచ్ కానున్న హైబ్రిడ్ కార్లు- తక్కువ రేటు, బెస్ట్ మైలేజీ!
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
BSNL Broadband Plan: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
బీఎస్ఎన్ఎల్ బెస్ట్ వైఫై ప్లాన్ - రోజుకు 200 జీబీ హైస్పీడ్ డేటా!
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Embed widget