అన్వేషించండి

IAF Recruitment 2026: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' ఉద్యోగాలు, ఈ అర్హతలు అవసరం

Agnipath Scheme: 'అగ్నిపథ్' పథకంలో భాగంగా 'అగ్నివీర్ వాయు' 2026 నోటిషికేషన్‌ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి జనవరి 7 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Indian Air Force Agniveervayu Recruitment: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 'అగ్నిపథ్' స్కీంలో భాగంగా 'అగ్నివీర్ వాయు' నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ (01/ 2026) విడుదల చేసింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 7 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అభ్యర్థులకు మార్చి 22 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.33,000; మూడో ఏడాది రూ.36,000; నాలుగో ఏడాది రూ.40,000 చెల్లిస్తారు. నాలుగు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేవారికి 'సేవానిధి ప్యాకేజీ' కింద మొత్తంగా రూ.10.04 లక్షలు చెల్లిస్తారు.

వివరాలు..

* ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)- అగ్నిపథ్ స్కీం అగ్నివీర్ వాయు(01/ 2026) బ్యాచ్ 

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/  తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 07.01.2005 నుంచి 01.07.2008 మధ్య జన్మించి ఉండాలి.

పరీక్ష ఫీజు: అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.550 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

కనీస ఎత్తు: పురుషులు 152 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలవారికి, పర్వత ప్రాంతాల్లో నివసించేవారికి ఎత్తులో మినహాయింపులు వర్తిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలవారు 147 సెం.మీ, లక్ష్యద్వీప్‌కు చెందినవారు 150 సెం.మీ కనీస ఎత్తు ఉండాలి. 

రాతపరీక్ష విధానం: ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థుల విద్యార్హత ఆధారంగా పరీక్ష ఉంటుంది.  
➛ పరీక్షలో సైన్స్ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
➛ సైన్స్ ప్రమేయం లేని(ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. 
➛ సైన్స్‌తోపాటు సైన్స్ కాకుండా ఉన్న సబ్జెక్టుల నుంచి (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 85 నిమిషాలు
➛ ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
➛ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను పరీక్షకు రెండు లేదా మూడురోజులు ముందుగా విడుదల చేస్తారు.

జీతం: ఎంపికైన వారికి నెలకు మొదటి సంవత్సరం రూ.30,000; రెండో సంవత్సరం రూ.33,000; మూడో సంవత్సరం రూ.36,000; నాలుగో సంవత్సరం రూ.40,000 చెల్లిస్తారు. నాలుగు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేవారికి 'సేవానిధి ప్యాకేజీ' కింద మొత్తంగా రూ.10.04 లక్షలు చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 07.01.2025.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: 27.01.2025.

➥ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 22.03.2025.

➥ ఫలితాల వెల్లడి: 14.11.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget