అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Andhra Pradesh News: జీవో 76ను తప్పుపట్టిన హైకోర్టు ధర్మాసనం, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని జైలుకు పంపాలంటూ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రూపొందించిన జీవో 76 ను హైకోర్టు తప్పుపట్టింది.

Promotions to Non-Teachong Staff: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రూపొందించిన జీవో 76 ను హైకోర్టు తప్పుపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నాన్-టీచింగ్ ఫ్యాకల్టీలైన ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లను ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించడంపై తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసే ఇలాంటి చర్యలు.. ఆత్మహత్యా సదృశమేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. బోధన సామర్థ్యంలేని వారిని విద్యాసంస్థలకు అధిపతులుగా నియమిస్తే వాటి తలరాత ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ..? ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021 డిసెంబరు 8న జీవో 76 జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శిని జైలుకు పంపాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై ఏప్రిల్ 1న పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

సిలబస్ గురించి వారికేం తెలుసు..?
బోధనేతర సిబ్బందిగా పనిచేస్తున్న లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లను కశాశాల ప్రిన్సిపల్స్‌గా నియమిస్తే.. సిలబస్ గురించి వారికేం అవగాహన ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఏ లెక్చరర్ ఏ సబ్జెక్టు చెబుతున్నారో వారికెలా తెలుస్తుందని నిలదీసింది. విద్యా ప్రమాణాలను దెబ్బతీసేలా ఉన్న ఈ జీవో వెనుక, మరే ఇతర కారణాలతోనో ఇచ్చినట్లు ఉందని కోర్టు ఆక్షేపించింది. 

సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెండ్..
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు.. ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్య కమిషనర్ మార్చి 15న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి మార్చి 18న ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.నరేందర్, జస్టిస్ ఎన్ హరినాథ్‌తో కూడిన ధర్మాసనం మార్చి 28న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

అసలేం జరిగింది..? 
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 197 మంది లెక్చరర్లకు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్య కమిషనర్ మార్చి 15న ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రిన్సిపల్ పోస్టుల పదోన్నతిలో జూనియర్ లెక్చరర్ల (లైబ్రరీ సైన్స్‌)ను పరిగణనలోకి తీసుకోకపోవడం 2021లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 76కి విరుద్ధమంటూ.. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్(లైబ్రరీ సైన్స్) అసోసియేషన్ అధ్యక్షుడు కె.సంజీవరావు, మరికొందరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ప్రిన్సిపల్స్ పదోన్నతిపై కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేశారు. దీన్ని సవాలు చేస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె.శ్యామ్ కుమార్ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. బోధనేతర సిబ్బంది తరఫు న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదనలు వినిపిస్తూ.. ప్రిన్సిపల్ విద్యాసంస్థ పరిపాలన వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షిస్తారన్నారు. అందువల్ల బోధనేతర సిబ్బందిని ప్రిన్సిపల్స్‌గా నియమించవచ్చన్నారు.

ధర్మాసనం విస్మయం..
గురువారం జరిగిన విచారణలో నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ప్రిన్సిపల్స్‌గా పదోన్నతి కల్పించే వ్యవహారం, అందుకు సంబంధించిన జీవో 76పై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఏ రకంగా చూసినా ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల వంటి బోధనేతర సిబ్బందిని టీచర్లుగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. ఇలాంటి జీవోను ఇప్పటి వరకు ఎందుకు సవాలు చేయలేదని అప్పీలుదారు తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తిని ప్రశ్నించింది. ఎవరిని పడితే వారిని కళాశాల ప్రిన్సిపల్‌గా నియమిస్తే విద్యావ్యవస్థకు నష్టం జరగదా, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతికూల పరిణామాలను పట్టించుకోరా అని ప్రభుత్వ న్యాయవాదిని నిలదీసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget