EMRS Exam Dates: ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉద్యోగాల పరీక్ష తేదీలు వెల్లడి, షెడ్యూలు ఇలా
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల (EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష (Recruitment Exams) తేదీలను అధికారులు విడుదల చేశారు.
![EMRS Exam Dates: ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉద్యోగాల పరీక్ష తేదీలు వెల్లడి, షెడ్యూలు ఇలా ESSE 2023 recruitment examination is scheduled to take place on 16th, 17th, 23rd, and 24th of December 2023 EMRS Exam Dates: ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉద్యోగాల పరీక్ష తేదీలు వెల్లడి, షెడ్యూలు ఇలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/936ca9ce13bf5a43804bb41d014cc80c1697648008510522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Eklavya Model Residential Schools Exams: దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల (EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్ష (Recruitment Exams) తేదీలను అధికారులు విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. డిసెంబర్ 16, 17, 23, 24 తేదీల్లో ఈఎంఆర్‌ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ పరీక్షల ద్వారా ప్రిన్సిపల్, పీజీటీ, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులను భర్తీచేయనున్నారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈఎంఆర్‌ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 10,391
I. ఖాళీలు: 4062
పోస్టుల వారీగా ఖాళీలు..
1) ప్రిన్సిపల్: 303 పోస్టులు
అర్హత: బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: రూ.78,800-రూ.2,09,200.
2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 2266 పోస్టులు
అర్హత: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత.
వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: రూ.47,600-రూ.1,51,100.
3) అకౌంటెంట్: 361 పోస్టులు
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: రూ.35,400-రూ.1,12,400.
4) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JNA): 759
అర్హత: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: రూ.19900-రూ.63200
5) ల్యాబ్ అటెండెంట్: 373
అర్హత: పదోతరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
II. మొత్తం ఖాళీలు: 6,329
➥ ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు
➥ హిందీ: 606 పోస్టులు
➥ ఇంగ్లిష్: 671 పోస్టులు
➥ మ్యాథ్స్: 686 పోస్టులు
➥ సోషల్ స్టడీస్: 670 పోస్టులు
➥ సైన్స్: 678 పోస్టులు
➥ బెంగాలీ: 10 పోస్టులు
➥ గుజరాతీ: 44 పోస్టులు
➥ కన్నడ: 24 పోస్టులు
➥ మలయాళం: 02 పోస్టులు
➥ మణిపురి: 06 పోస్టులు
➥ మరాఠీ: 52 పోస్టులు
➥ ఒడియా: 25 పోస్టులు
➥ తెలుగు: 102 పోస్టులు
➥ ఉర్దూ: 06 పోస్టులు
➥ మిజో: 02 పోస్టులు
➥ సంస్కృతం: 358 పోస్టులు
➥ సంతాలి: 21 పోస్టులు
➥ మ్యూజిక్: 320 పోస్టులు
➥ ఆర్ట్: 342 పోస్టులు
➥ పీఈటీ (మెన్): 321 పోస్టులు
➥ పీఈటీ (ఉమెన్): 345 పోస్టులు
➥ లైబ్రేరియన్: 369 పోస్టులు
➥ హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు
➥ హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు
అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18.8.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)