అన్వేషించండి

DCIL: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నంలో ఉద్యోగాలు- ఈ అర్హతలుండాలి

DCIL Vacancies: విశాఖపట్నం డీసీఐఎల్ పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్య్వూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

DCIL Recruitment: విశాఖపట్నంలోని సీతమ్మధారలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DCIL) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులను పోస్టుని అనుసరించి పాట్నా/కోల్‌కతా/గువహటీ, వెస్ట్ బెంగాల్/ అస్సాం, హెడ్ ఆఫీస్, విశాఖపట్నం, హెడ్ ఆఫీస్/రీజినల్ ఆఫీస్/ ప్రాజెక్ట్ ఆఫీస్, రిజిస్టర్డ్ ఆఫీస్, న్యూఢిల్లీ లేదా మరే ఇతర ప్రదేశంలోనైనా నియమిస్తారు. అయితే, కంపెనీ అవసరాలకు అనుగుణంగా వారిని ఏ ప్రదేశానికైనా బదిలీ చేయవచ్చు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 22

⏩ కన్సల్టెంట్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్: 04
అర్హత: సీవోసీ మాస్టర్ (FG) / ఎంఏటీఈ / డ్రెడ్జ్ మాస్టర్ (గ్రేడ్ I & II) / ఎంఈవో సీఐ-I & II / డ్రెడ్జ్ ఇంజినీర్ GR- I & II / మాస్టర్ NCV / డిగ్రీలో
సివిల్/మెకానికల్/ మెరైన్/డ్రెడ్జింగ్ మరియు హార్బర్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 01.02.2025 నాటికి 40 - 65 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: నెలకు రూ.1,50,000 - రూ.2,00,000.
పోస్టింగ్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: పాట్నా/కోల్‌కతా/గువహటీ.

⏩ ప్రాజెక్టు మేనేజర్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్ వర్స్క్‌: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్, సర్వే ఇంజినీరింగ్) / తత్సమాన అర్హత లేదా బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి:  01.02.2025 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000-రూ.65,000. 
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: వెస్ట్ బెంగాల్/ అస్సాం.

⏩ హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌: 12
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్, సర్వే ఇంజినీరింగ్) / బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్ /తత్సమాన అర్హత)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి:  01.02.2025 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000-రూ.40,000.
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: ఎంపికైన ఎనిమిది(8) మంది అభ్యర్థులను వెస్ట్ బెంగాల్/అస్సాంలో నియమిస్తారు. మిగిలిన పన్నెండు (12) మంది అభ్యర్థులను HO, వివిధ ప్రాజెక్ట్ కార్యాలయాలు మరియు కంపెనీ ప్రాంతీయ కార్యాలయాలలో నియమిస్తారు.

⏩ ప్రాజెక్టు కన్సల్టెంట్ (ఓ/పీ): 02
అర్హత: మాస్టర్ (FG) సీవోసీ లేదా డ్రెడ్జ్ మాస్టర్ Gr.I సీవోసీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 01.02.2025 నాటికి 50 సంవత్సరాల వరకు ఉండాలి.
జీతం: నెలకు రూ.1,00,000 - రూ.1,25,000.
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: ఎంపికైన అభ్యర్థులకు కార్పొరేషన్ అవసరాలకు అనుగుణంగా హెడ్ ఆఫీస్/రీజినల్ ఆఫీస్/ ప్రాజెక్ట్ ఆఫీస్ లేదా మరే ఇతర ప్రదేశంలోనైనా పోస్టింగ్ ఇస్తారు.

⏩ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కన్సల్టెంట్: 01
అర్హత: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా ఎంసీఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 01.02.2025 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.1,00,000 - రూ.1,25,000.
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: హెడ్ ఆఫీస్, విశాఖపట్నం.

⏩ లీగల్‌ కన్సల్టెంట్: 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి:  01.02.2025 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000- రూ.70,000.
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: హెడ్ ఆఫీస్, విశాఖపట్నం.

⏩ రెసిడెంట్ మేనేజర్‌: 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ క్లాస్‌లో ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 01.02.2025 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000-రూ.65,000.
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: రిజిస్టర్డ్ ఆఫీస్, న్యూఢిల్లీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్య్వూ, మెడికల్ టెస్ట్ , తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.02.2025.

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25.02.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karedu Farmers Protests: నెల్లూరు జిల్లా కరేడులో ఏం జరుగుతోంది? రైతుల ఆందోళనలు ఎందుకు బయటకు రావడంలేదు?
నెల్లూరు జిల్లా కరేడులో ఏం జరుగుతోంది? రైతుల ఆందోళనలు ఎందుకు బయటకు రావడంలేదు?
Telangana Politics:  తెలంగాణలో సవాల్ పాలిటిక్స్ - ప్రాజెక్టులపై చర్చ అసెంబ్లీలోనా ? ప్రెస్ క్లబ్‌లోనా ?
తెలంగాణలో సవాల్ పాలిటిక్స్ - ప్రాజెక్టులపై చర్చ అసెంబ్లీలోనా ? ప్రెస్ క్లబ్‌లోనా ?
Crime News: మేడ్చల్‌లో మర్డర్ - స్వగ్రామంలో గుట్టు రట్టు - భర్తను అనుమానం రాకుండా హత్య చేసింది కానీ ..
మేడ్చల్‌లో మర్డర్ - స్వగ్రామంలో గుట్టు రట్టు - భర్తను అనుమానం రాకుండా హత్య చేసింది కానీ ..
Telangana Employees: తెలంగాణలో ప్రైవేటు ఉద్యోగుల పని వేళల పరిమితుల్లో మార్పులు - ఎక్కువ సమయం పని చేస్తే ఓటీ వేతనం
తెలంగాణలో ప్రైవేటు ఉద్యోగుల పని వేళల పరిమితుల్లో మార్పులు - ఎక్కువ సమయం పని చేస్తే ఓటీ వేతనం
Advertisement

వీడియోలు

Mohammed Siraj 6 Wickets | Eng vs Ind Second test లో సిరాజ్ వీర విజృంభణ | ABP Desam
Eng vs Ind Second test Bowlers Dominance | సిరాజ్, ఆకాశ్ దీప్ రప్పా రప్పాకు కుప్పకూలిన ఇంగ్లండ్ | ABP Desam
Eng vs Ind Second test Day 3 Highlights | రెండో టెస్టుపై పట్టు బిగించిన టీమిండియా | ABP Desam
Nithiin Thammudu Movie Review | తమ్ముడు..హాల్ కి వచ్చిన వాళ్లతో లెట్స్ డూ కుమ్ముడూ | ABP Desam
Minister Ramanaidu Pattiseema Lift Irrigation | పట్టిసీమ ఎత్తిపోతల పథకం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karedu Farmers Protests: నెల్లూరు జిల్లా కరేడులో ఏం జరుగుతోంది? రైతుల ఆందోళనలు ఎందుకు బయటకు రావడంలేదు?
నెల్లూరు జిల్లా కరేడులో ఏం జరుగుతోంది? రైతుల ఆందోళనలు ఎందుకు బయటకు రావడంలేదు?
Telangana Politics:  తెలంగాణలో సవాల్ పాలిటిక్స్ - ప్రాజెక్టులపై చర్చ అసెంబ్లీలోనా ? ప్రెస్ క్లబ్‌లోనా ?
తెలంగాణలో సవాల్ పాలిటిక్స్ - ప్రాజెక్టులపై చర్చ అసెంబ్లీలోనా ? ప్రెస్ క్లబ్‌లోనా ?
Crime News: మేడ్చల్‌లో మర్డర్ - స్వగ్రామంలో గుట్టు రట్టు - భర్తను అనుమానం రాకుండా హత్య చేసింది కానీ ..
మేడ్చల్‌లో మర్డర్ - స్వగ్రామంలో గుట్టు రట్టు - భర్తను అనుమానం రాకుండా హత్య చేసింది కానీ ..
Telangana Employees: తెలంగాణలో ప్రైవేటు ఉద్యోగుల పని వేళల పరిమితుల్లో మార్పులు - ఎక్కువ సమయం పని చేస్తే ఓటీ వేతనం
తెలంగాణలో ప్రైవేటు ఉద్యోగుల పని వేళల పరిమితుల్లో మార్పులు - ఎక్కువ సమయం పని చేస్తే ఓటీ వేతనం
KTR Challenge : ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే... ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే..  రేవంత్ రెడ్డికి KTR ఛాలెంజ్
ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా.. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే.. రేవంత్ రెడ్డికి KTR ఛాలెంజ్
Kaikaloor Police: దొంగలెత్తుకెళ్లిన బంగారం తిరిగి వస్తే ఎంత ఆనందమో ? - కైకలూరు పోలీసులకు వృద్ధుల కృతజ్ఞతలు
దొంగలెత్తుకెళ్లిన బంగారం తిరిగి వస్తే ఎంత ఆనందమో ? - కైకలూరు పోలీసులకు వృద్ధుల కృతజ్ఞతలు
Ghaati: అనుష్క 'ఘాటి' రిలీజ్ వాయిదా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... అసలు రీజన్ ఏంటంటే?
అనుష్క 'ఘాటి' రిలీజ్ వాయిదా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... అసలు రీజన్ ఏంటంటే?
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌కు రూ.15వేల కోట్ల నష్టం - ఆ ఆస్తులన్నీ కేంద్రానివే- అసలేం జరిగిందంటే?
సైఫ్ అలీ ఖాన్‌కు రూ.15వేల కోట్ల నష్టం - ఆ ఆస్తులన్నీ కేంద్రానివే- అసలేం జరిగిందంటే?
Embed widget