TBRL: డీఆర్డీవో- టీబీఆర్‌ఎల్, చండీగఢ్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
DRDO -TBRL Recruitment: చండీగఢ్ సెక్టార్ 30లోని డీఆర్డీవో- టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ తాత్కాలిక జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది.
DRDO -TBRL Recruitment: చండీగఢ్ సెక్టార్ 30లోని డీఆర్డీవో- టెర్మినల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ తాత్కాలిక జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్‌తో పాటు నెట్/ గేట్ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 30, ఫిభ్రవరి 2, 6, 7, 8 తేదీలలో వాక్-ఇన్-ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 07
* జూనియర్ రిసెర్చ్ ఫెలో
విభాగాల వారీగా ఖాళీలు..
⏩ మెకానికల్ ఇంజినీరింగ్- 01
⏩ ఫిజిక్స్- 01
⏩ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 03
⏩ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 01
⏩ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్- 01
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్‌తో పాటు నెట్/ గేట్ అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
స్టైఫండ్: నెలకు రూ.37000.
పదవీకాలం: ప్రారంభంలో రెండు సంవత్సరాలు. అయితే, జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్‌ల పదవీకాలం మొత్తం 5 సంవత్సరాలకు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: 30.01.2024, 02.02.2024, 06.02.2024, 07.02.2024, 08.02.2024.
ఇంటర్వ్యూ వేదిక: Terminal Ballistics Research Lab (TBRL), Sector 30 Chandigarh.
పని ప్రదేశం: టీబీఆర్‌ఎల్ రేంజ్, రామ్‌ఘర్
వాక్-ఇన్-ఇంటర్వ్యూ సమయంలో..
➥ ఫుల్ బయోడేటా మరియు మార్క్స్ షీట్‌లు/సర్టిఫికెట్‌లు(10వ తరగతి నుంచి), కాస్ట్ సర్టిఫికెట్ మరియు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి. ప్రభుత్వ/పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్/అటానమస్ బాడీలలో పనిచేస్తున్న అభ్యర్థులు సరైన ఛానెల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
➥ అభ్యర్థులు ఇంటర్వ్యూ సమయంలో వాలిడ్ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ తీసుకురావాలని సూచించారు.
➥ వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన అభ్యర్థులు సంబంధిత తేదీలో 09.00 గంటలకు టీబీఆర్‌ఎల్, సెక్టార్-30, చండీగఢ్‌లో రిపోర్ట్ చేయాలి. మొదట్లో అభ్యర్థులు అర్హత ప్రమాణాలు మొదలైనవాటికి సంబంధించి పరీక్షించబడతారు. స్క్రీన్ చేయబడిన అభ్యర్థులు మాత్రమే అదే తేదీన ఇంటర్వ్యూకు హాజరవుతారు.
➥ ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు అన్ని సర్టిఫికేట్‌ల టెస్టిమోనియల్‌లను ఒరిజినల్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
➥ ఇంటర్వ్యూకు హాజరైనందుకు ఎటువంటి TA'DA చెల్లించబడదు.
➥ అభ్యర్థులకు ఈ ఫెలోషిప్ పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన పరిగణించబడుతుంది. ఫెలోషిప్ ఆఫర్ DRDOలో చేరడానికి ఉపయోగపడదు.
➥ ప్రయోగశాల అవసరాలను బట్టి సూచించిన విధంగా ఫెలోషిప్ సంఖ్య మారవచ్చు.
ALSO READ:
డీఆర్‌డీవో- డీఆర్‌డీఎల్, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
DRDL Recruitment: హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో- డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్) 1 సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ కొరకు నోటిపికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తులు సంబంధిత చిరునామాకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి. షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..