DMHO: నారాయణపేట జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు, దరఖాస్తుచేసుకోండి!
నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం జిల్లా పరిధిలోని పీహెచ్‌సీ/ డీహెచ్‌లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం జిల్లా పరిధిలోని పీహెచ్‌సీ/ డీహెచ్‌లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ నర్సింగ్/ జీఎన్‌ఎంతో పాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 29 వరకు దరఖాస్తులు సమర్పించాలి.
వివరాలు..
* స్టాఫ్ నర్స్(మెటర్నల్ హెల్త్): 09
* స్టాఫ్ నర్స్(ఎన్‌బీఎస్‌యూ): 03
మొత్తం ఖాళీలు:12 పోస్టులు
అర్హత: బీఎస్సీ నర్సింగ్/ జీఎన్‌ఎం. టీఎస్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి.
వయోపరిమితి: 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీఅభ్యర్థులకు రూ.150, బీసీ అభ్యర్థులకు రూ.250, ఓసీ అభ్యర్థులకు రూ.350.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, సింగారం ఎక్స్-రోడ్, నారాయణపేట చిరునామాకు పంపించాలి.
ఎంపిక విధానం: బీఎస్సీ నర్సింగ్/ జీఎన్‌ఎంలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు రూ.29,900.
దరఖాస్తుకు చివరి తేదీ: 29.03.2023.
Also Read:
ఆర్మీ 'అగ్నివీర్' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఇండియన్ ఆర్మీలో 'అగ్నివీరుల' నియామకానికి సంబంధించిన దరఖాస్తు గడువును ఆర్మీ పొడిగించింది. అగ్నివీరుల దరఖాస్తు గుడువు ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. మార్చి 15తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. మార్చి 20 వరకు పొడిగిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ ఏడాది ఆర్మీ అగ్నిపథ్ స్కీమ్ -2023 కింద దాదాపు 25 వేల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇండియన్ ఆర్మీ ఇందుకోసం పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది.
అగ్నివీరుల దరఖాస్తు, వివరాల కోసం క్లిక్ చేయండి..
REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!
ఆర్ఈసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ బీటెక్/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1284 కానిస్టేబుల్ పోస్టులు, వివరాలు ఇలా!
భారత కేంద్రహోం మంత్రిత్వశాఖ పరిధిలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 27 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..