అన్వేషించండి

APMSRB: ఏపీ వైద్యారోగ్య శాఖలో 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు, అర్హతలివే

AP News: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(APMSRB) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల (CASS Posts) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

A.P Directorate of Secondary Health Recruitment: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(APMSRB) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల (CASS Posts) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని ఆసుపత్రుల్లో రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. అభ్యర్థులకు డిసెంబరు 11, 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

వివరాలు..

* సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 150. 

స్పెషాలిటీలవారీగా ఖాళీలు..

➥ గైనకాలజీ: 12

➥ అనస్థీషియా: 15

➥ పీడియాట్రిక్స్: 11 

➥ జనరల్ మెడిసిన్: 37

➥ జనరల్ సర్జరీ: 03

➥ ఆర్థోపెడిక్స్: 01

➥ ఆప్తాల్మాలజీ: 10 

➥ రేడియాలజీ: 38

➥ పాథాలజీ: 02

➥ ఈఎన్‌టీ: 07

➥ డెర్మటాలజీ: 11

➥ సైకియాట్రీ: 01

➥ ఫోరెన్సిక్ మెడిసిన్: 02 

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, స్పెషల్ డాక్టర్లకు 70 సంవత్సరాలలోపు ఉండాలి.

ఎంపిక విధానం: పీజీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

పే స్కేల్: నెలకు రెగ్యులర్ పోస్టులకు రూ.61,960 నుంచి రూ.1,51,37. కాంట్రాక్ట్ పోస్టులకు- గిరిజన ప్రాంతమైతే రూ.2,50,000; గ్రామీణ ప్రాంతమైతే రూ.2,00,000; పట్టణ ప్రాంతమైతే రూ.1,30,000 వేతనం ఇస్తారు.

కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది. అవసరాన్ని బట్టి సర్వీసును పొడిగిస్తారు.

వాక్‌ఇన్ షెడ్యూలు..

➥ 11.12.2023 (సోమవారం)
సమయం: 10:00 AM to 01:00 PM
సబ్జెక్టులు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్

➥ 13.12.2023 (బుధవారం)
సమయం: 10:00 AM to 01:00 PM
సబ్జెక్టులు: గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ.

➥ 15.12.2023 (శుక్రవారం)
సమయం: 10:00 AM to 01:00 PM
సబ్జెక్టులు: పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, రేడియోలజీ, సైకియాట్రీ.

వాక్‌ఇన్ వేదిక: 
O/o. Directorate of Secondary Health (formerly APVVP ),
H.No.77-2/G, Lakshmi Elite Building,
Prathur Road, Tadepalli-522501,
Guntur District, Andhra Pradesh. 

ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు..

➥ పదోతరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్ (పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం)

➥ పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/డీఎన్‌బీ అన్ని సంవత్సరాల సర్టిఫికేట్లు

➥ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్

➥ రిటైర్డ్ అయిన స్పెషలిస్ట్ డాక్టర్లు, 01.07.2023 నాటికి 70 సంవత్సరాలు పూర్తికానివారు రిటైర్‌మెంట్ ఆర్డర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ తీసుకురావాలి.

➥ 4 నుంచి 10వ తరగతుల వరకు స్టడీ సర్టిఫికేట్లు.

➥ SC/ST/BC/EWS అభ్యర్థులైతే సోషల్ స్టడీస్ సర్టిఫికేట్ ఉండాలి.

➥ SADAREM డిజెబిలిటీ (ఆర్థోపెడికల్టీ డిజెబుల్డ్ సర్టిఫికేట్)

➥ ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ (అవసరమైతే)

➥ స్పోర్ట్స్ సర్టిఫికేట్ (SAAP స్పోర్ట్స్ కోటా)

➥ కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్ (DM &HO/DCHS/GGH సూపరింటెండెంట్/ప్రిన్సిపల్ జారీచేసిన).

➥ ఎన్‌వోసీ సర్టిఫికేట్

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Embed widget