అన్వేషించండి

CTET Answer Key: సీటెట్‌-2024 ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం!

CTET 2024 Answer Key: సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జనవరి-2024 ఆన్సర్ కీని సీబీఎస్‌ఈ ఫిబ్రవరి 7న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది.

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జనవరి-2024 ఆన్సర్ కీని సీబీఎస్‌ఈ ఫిబ్రవరి 7న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. సీటెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 10న రాత్రి 11.59 గంటల వరకు అభ్యంతరాలు నమోదుచేయవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే ప్రశ్నకు రూ.1000 రుసుము చొప్పున ఫిబ్రవరి 17లోగా నిర్ణీత నమూనా ప్రకారం తెలియజేయాల్సి ఉంటుంది.

ఆన్సర్ కీ ఇలా చెక్ చేసుకోండి..

స్టెప్-1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. - https://ctet.nic.in/

స్టెప్-2: అక్కడ హోంపేజీలో ఆక్టివిటీ అనే ఆప్షన్‌లో లాగిన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్-3:  అక్కడ కనిపించే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.

స్టెప్-4:  తర్వాత సైన్ ఇన్ పై క్లిక్ చేసి.. ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

స్టెప్-5:  మెయిన్ వెబ్‌సైట్‌లో స్క్రీన్ పై కనిపిస్తున్న ప్రాథమిక కీ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

స్టెప్-6:  ఆన్సర్ కీలో ఏమైనా అభ్యంతరాలుంటే.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లింక్ ద్వారా తెలియజేయాలి. 

ఆన్సర్ కీ, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, అభ్యంతరాల నమోదుకు క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా జనవరి 21న పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 20 భాషల్లో సీటెట్ పరీక్షను నిర్వహించారు. సీటెట్​ పరీక్ష ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1​ ఒకటి 5వ తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, పేపర్​-2 ఆరు నుంచి 9వ తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్) - 2022' నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 20న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీక్షను ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. సీటెట్‌ స్కోరుకు లైఫ్‌ లాంగ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. అభ్యర్థులు ఎన్నిసార్లయినా పరీక్షకు హాజరుకావొచ్చు.

సీటెట్‌ స్కోరు ఉన్న వారు ఆయా రాష్ట్రాలు నిర్వహించే టెట్‌(టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)ను విధిగా రాయాల్సిన అవసరం లేదు. సీటెట్‌ స్కోరుతో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, కేంద్ర స్థాయి విద్యా సంస్థల్లో అంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లు మొదలైన వాటిల్లో ఉపాధ్యాయుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget