PET Candidates: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు పీఈటీ అభ్యర్థుల ఆందోళన, 2017 పీఈటీ ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ... ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి 2017 గురుకుల పీఈటీ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పీఈటీ అభ్యర్థుల సంఘం హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. వివిధ జిల్లాల నుంచి పిల్లలతో సహా తరలి వచ్చిన అభ్యర్థులు నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమిషన్ చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని సంఘం అధ్యక్షుడు సదానంద్ గౌడ్ మండిపడ్డారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ... ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. లితాలు వెల్లడించక పోవడంతో మనస్తాపానికి గురై, ఎనిమిది మంది పీఈటీ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా టీఎస్‌పీఎస్సీ జాప్యం చేస్తుందని మండిపడ్డారు. గత ఆరేళ్లుగా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
2017 సెప్టెంబర్లో గురుకుల పోస్టుల పీఈటీ పరీక్షలు రాసినప్పటికీ ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదన్నారు. గురుకుల పీఈటీ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌తో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వారికి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వారందరికీ అవకాశం కల్పించి ఒకే పరీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. 616 పోస్టులకుగానూ 1232 మంది అభ్యర్థులు గతంలో సెలక్ట్ అయ్యారని తెలిపారు. అభ్యర్థులకు రోజురోజుకూ కుటుంబ పోషణ భారం అవుతోందని... ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఫలితాలు ప్రకటించాలని కోరారు. లేని పక్షంలో అభ్యర్థులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
Also Read:
నిరుద్యోగులకు అలర్ట్, హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి జనవరి 11న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21న ప్రారంభమైంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1904 ఖాళీలు - పోస్టులు, అర్హతల పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్‌లోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి 6 ప్రకటనలు జారీ చేసింది. వీటిద్వారా మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల్లో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275, ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11న ప్రారంభమైంది. జనవరి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి...