AWES Exam: ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ నియామక పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?
Is AWES Exam Date Postponed For 2023: దేశంలోని కంటోన్మెంట్లు, ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ విడుదల చేసింది.
AWES Exam Admit Card: దేశంలోని కంటోన్మెంట్లు, ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష హాల్‌టికెట్లను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నవంబరు 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులను పొందవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ స్కూళ్లల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబరు 25, 26 తేదీల్లో రాతపరీక్షలు (ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఆ తర్వాత టీచింగ్ స్కిల్స్ మూల్యాంకనం, కంప్యూటర్ ప్రావీణ్యం ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమలు చేస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. పరీక్షలో రెండు భాగాలు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. పార్ట్-ఎలో జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ స్కిల్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక పార్ట్-బిలో అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో సైకాలజీ, హోంసైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, కామర్స్, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిందీ, బయాలజీ, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్ ఇన్‌ఫర్మాటిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు.
పరీక్షలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-ఎలో 80 ప్రశ్నలు, పార్ట్-బిలో 120 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-బిలో పీజీటీ, టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులకు చెందిన వేర్వేరు ప్రశ్నలు ఇస్తారు. పార్ట్-ఎ కాలవ్యవధి గంటన్నర, పార్ట్-బి కాలవ్యవధి రెండు గంటలు. అర్హత సాధించాలంటే.. అభ్యర్థులు ప్రతి పార్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
పార్ట్-ఎ:
సెక్షన్ | ప్రశ్నల సంఖ్య | వెయిటేజీ |
సెక్షన్-ఎ (బేసిక్ జీకే) | 28 | 35% |
సెక్షన్-బి (కరెంట్ అఫైర్స్) | 28 | 35% |
సెక్షన్-సి (ప్రొఫెషనల్ నాలెడ్జ్) | 24 | 30% |
మొత్తం: | 80 ప్రశ్నలు | - |
పార్ట్-బి (టీజీటీ):
సెక్షన్ | ప్రశ్నల సంఖ్య | వెయిటేజీ |
సెక్షన్-ఎ | 42 | 35% |
సెక్షన్-బి | 42 | 35% |
సెక్షన్-సి | 12 | 10% |
సెక్షన్-డి | 24 | 20% |
మొత్తం | 120 ప్రశ్నలు | - |
పార్ట్-బి (పీజీటీ):
సెక్షన్ | ప్రశ్నల సంఖ్య | వెయిటేజీ |
సెక్షన్-ఎ (బేసిక్ జీకే) | 42 | 35% |
సెక్షన్-బి (కరెంట్ అఫైర్స్) | 42 | 35% |
సెక్షన్-సి (ప్రొఫెషనల్ నాలెడ్జ్) | 36 | 30% |
మొత్తం: | 120 ప్రశ్నలు | - |
ALSO READ:
➥ ఐటీబీపీలో 248 కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎంపికైతే నెలకు రూ.69,100 వరకు జీతం
➥ టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో 'కేంద్ర' కొలువులు - 1899 'పోస్టల్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
➥ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,832 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి