అన్వేషించండి

SI Halltickets: ఎస్ఐ తుది పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 14, 15 తేదీల్లో నిర్వహించనున్న తుది పరీక్షల హాల్‌టికెట్లను పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది.

ఏపీలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 14, 15 తేదీల్లో తుది పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అక్టోబరు 6న పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అక్టోబరు 12 వరకు అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏమైనా సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ నెంబరు 9441450639, 9100203323 లేదా ఈమెయిల్ mail-slprb@ap.gov.in ద్వారా సంప్రదించవచ్చు.

హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్  చేసుకోండి..

➥ ఎస్‌ఐ పరీక్షల హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://slprb.ap.gov.in/
➥ అక్కడ హోంపేజీలో కనిపించే 'Download of SCT SI/RSI Final Written Examination Hall Tickets New' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ లింక్ మీద క్లిక్ చేయగానే వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'Download' బటన్‌పై క్లిక్ చేయాలి.
➥ బటన్‌పై క్లిక్ చేయగానే అభ్యర్థుల హాల్‌టికెట్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
➥ పరీక్ష హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని. ప్రింట్ తీసుకోవాలి. 

ఎస్‌ఐ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..

➥ అక్టోబరు 14న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.

➥ అక్టోబరు 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-3 పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష నిర్వహిస్తారు.

🔰 మెయిన్ పరీక్ష విధానం: 

➨ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

➨  సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.

➨  ఏపీఎస్‌పీ ఎస్‌ఐ పోస్టులకు 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 మార్కులు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌కు కేటాయిస్తారు.

➨ ఇంగ్లిష్, తెలుగు, ఉర్డూ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

➨ ఎస్‌ఐ తుది పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1 ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్), పేపర్-2 తెలుగు/ఉర్దూ (డిస్క్రిప్టివ్), పేపర్-2 అరిథ్‌మెటిక్ & రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్), పేపర్-4 జనరల్ స్టడీస్(ఆబ్జెక్టివ్) ఉంటాయి. వీటిలో పేపర్-1, పేపర్-2 కేవలం అర్హత పరీక్షలు మాత్రమే.
                                             

ఏ కేంద్రంలో ఎంత మంది?

ఫిజికల్ ఈవెంట్లలో మొత్తం 31,193 మంది అభ్యర్థులు సాధించారు. వీరిలో పురుషులు-27,590 మంది, స్త్రీలు-3603 మంది పరీక్షకు హాజరుకానున్నారు. వీరికి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 

➥ విశాఖపట్నం కేంద్రంలో మొత్తం 11,365 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-9913, స్త్రీలు-1452 మంది పరీక్షలు రాయనున్నారు.

➥ ఏలూరు కేంద్రంలో మొత్తం 4162 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-3649, స్త్రీలు-513 మంది పరీక్షలు రాయనున్నారు.

➥ గుంటూరు కేంద్రంలో మొత్తం 7145 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-6384, స్త్రీలు-761 మంది పరీక్షలు రాయనున్నారు.

➥ కర్నూలు కేంద్రంలో మొత్తం 8521 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పురుషులు-7644, స్త్రీలు-877 మంది పరీక్షలు రాయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 57,923 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన 31,193 మంది అభ్యర్థులకు మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎస్‌ఐ పోస్టుల నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

తెలంగాణ జెన్‌కో‌లో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 94 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 245 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ జెన్‌కో‌లో 60 కెమిస్ట్ పోస్టులు, ఎంపికైతే నెలకు రూ.1.31 లక్ష వరకు జీతం
తెలంగాణ రాష్ట్ర పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌(TSGENCO)‌లో కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రథమ శ్రేణిలో ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 29న మధ్యాహ్నం 1 గంటలోపు ఫీజు చెల్లించి, రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget