అన్వేషించండి

APPSC: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' పరీక్ష వాయిదా! కొత్త తేది ఇదే!

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న గ్రూప్-1 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పాలనాపరమైన కారణాల చేత పరీక్షను వాయిదావేస్తున్న ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష వాయిదాపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న గ్రూప్-1 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పాలనాపరమైన కారణాల చేత పరీక్షను వాయిదావేస్తున్న ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 8న గ్రూప్-1 నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 30న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 92 గ్రూప్-1 పోస్టులను భర్తీచేయనుంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 10 నుంచి నవంబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది.

వాస్తవానికి నవంబరు 2తో ముగియాల్సిన దరఖాస్తు గడువును నవంబరు 5 వరకు పొడిగించింది. అయితే 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న 'గ్రూప్-1' స్క్రీనింగ్ పరీక్షను, వచ్చే ఏడాది మార్చి రెండో వారంలో 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. అయితే తాజాగా ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 8న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.

APPSC: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' పరీక్ష వాయిదా! కొత్త తేది ఇదే!

పరీక్ష విధానం..

➥ ప్రిలిమినరీ పరీక్ష: 
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 120 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.   ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 మార్కులు కేటాయించారు. అదేవిధంగా 120 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 60 మార్కులు కేటాయించారు. 

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.

➥ మెయిన్ పరీక్ష:
మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి. 
* పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు
* పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-3 (పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు 
* పేపర్-4 (ఎకానమీ & డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు 
* తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే.

మెయిన్ పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.

పోస్టులు, పరీక్ష సిలబస్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ఏపీలో 3673 కోర్టు ఉద్యోగాలు - నోటిఫికేషన్లు, పోస్టుల పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో హైకోర్టు పరిధిలో 241 పోస్టులు ఉండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో 3432 ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్లు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Embed widget