అన్వేషించండి

Group 1 Application: గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

AP Group1 Application 2023: ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

APPSC Group1 Application 2023: ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 81 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 21 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17న గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి స్క్రీనింగ్ (ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించనున్నారు. 

వివరాలు..

* గ్రూప్-1 పోస్టులు

ఖాళీల సంఖ్య: 81

1) డిప్యూటీ కలెక్టర్: 09 పోస్టులు
విభాగం: ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్).
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-1,51,370/-

2) అసిస్టెంట్ కమిషనర్: 18 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ట్యాక్స్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-1,51,370/-

3) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-డీఎస్పీ (సివిల్) క్యాట్-2: 26 పోస్టులు
విభాగం: ఏపీ పోలీస్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-1,51,370/-

4) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్-(మెన్): 01 పోస్టు 
విభాగం: ఏపీ జైళ్ల శాఖ.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

5) డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ (ఫైర్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 21 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

6)  రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్: 06 పోస్టులు
విభాగం: ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

7) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 01 పోస్టు
విభాగం: ఏపీ బీసీ వెల్ఫేర్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

8) డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగం: ఏపీ సోషల్ వెల్ఫేర్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

9) డిప్యూటీ రిజిస్ట్రార్: 05 పోస్టులు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-1,47,760/-

10) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-2): 01 పోస్టు
విభాగం: ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

11) అసిస్టెంట్ ప్రొహిభిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్: 01 పోస్టు
విభాగం: ఏపీ ఎక్సైజ్ సర్వీసెస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

12)  అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 03 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీ/అకౌంట్స్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

3) డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్: 04 పోస్టులు
విభాగం: ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

14) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060-1,40,540/-

వయోపరిమితి సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గత 6 నెలల నుంచి పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.   

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థుల, తెల్లరేషన్ కార్డు ఉన్న అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ పరీక్ష(ప్రిలిమ్స్), మెయిన్స్ పరీక్షల ఆధారంగా.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం:

మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇందులో పేపర్-1లో 120 ప్రశ్నలు-120 మార్కులు, పేపర్-2లో 120 ప్రశ్నలు-120 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపరుకు 2 గంటల సమయం కేటాయించారు. పేపర్-1లో హిస్టరీ అండ్ కల్చర్ (పార్ట్-ఎ); కాన్‌స్టిట్యూషన్ పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (;పార్ట్-బి), ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ & ప్లానింగ్ (పార్ట్-సి), జియోగ్రఫీ (పార్ట్-డి) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

Group 1 Application: గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

మెయిన్స్ పరీక్ష విధానం..

మెయిన్స్ పరీక్షలో మొత్తం 5 ప్రధాన పేపర్లు ఉంటాయి. వీటితోపాటు తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు కూడా ఉంటాయి. అయితే ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. మొత్తం 5 పేపర్లలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహించి మొత్తం 825 మార్కులకు అభ్యర్థుల ఎంపికను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో పేపరుకు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 

Group 1 Application: గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

ముఖ్యమైన తేదీలు...

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.01.2024.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.01.2024. (11:59 PM)

* స్క్రీనింగ్ పరీక్ష(ప్రిలిమ్స్) తేది: 17.03.2024. (11:59 PM)

Notification

Online Application

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget