అన్వేషించండి

APPSC: ఏపీ అటవీ శాఖలో 691 ఉద్యోగాలు! అర్హతలు, దరఖాస్తు విధానం, జీతం.. పూర్తి వివరాలు!

APPSC Forest Beat Officer Notification 2025: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అటవీశాఖలో ఉద్యోగుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. 

APPSC Forest Beat Officer Notification 2025: అటవీ శాఖలో 691 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలను https://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ నెల 16 నుంచి దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించింది. ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 

ఖాళీలు ఎన్ని ఉన్నాయి
ఫారెస్టు బీట్ ఆఫీసర్‌ ఉద్యోగాలు-256 
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు- 435 

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హతలు ఏంటీ?

  • ముందు విద్యార్హతను నోటిఫికేషన్‌లో తెలియజేయనున్నారు. ఈ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కచ్చితంగా 163 సెంటీమీటర్లకు తగ్గకుండా ఎత్తు ఉండాలి. చాతీ 84 Cms ఉండాలి గాలి పీల్చినప్పుడు 5 Cms పెరగాలి.  
  • మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు. 150 Cms ఎత్తు, 79 Cms తగ్గకుండా చాతీ చుట్టుకొలత ఉండాలి. గాలి పీలిస్తే ఐదు సెంటీమీటర్లు పెరగాలి. 
  • గూర్ఖాలు, నేపాలీలు, అస్సామీలు, NAFA, నాగా, మణిపురీ, గౌహతీ, కుమ్మాని, సిక్కిం, భూటానీలు, ఎస్టీలకు ఎత్తులో ఐదు సెంటీమీటర్లు తగ్గిస్తారు. ఒక వేళ ఈ హైట్‌లో ఎస్టీలు దొరక్కుంటే హైట్‌ను 158 Cms చాతీ 78.8 Cms కు తగ్గిస్తారు. 
  • అభ్యర్థులకు దృష్టి లోపం ఉండకూడదు. కంటి చూపు నార్మల్‌గా ఉండాలి. 
  • మెయిన్స్‌ పరీక్షలు అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే వాళ్లకు తర్వాత పరీక్ష పెడతారు. మెయిన్స్‌లో విజయం సాధించిన పురుష అభ్యర్థులు 25 కిలోమీటర్లను నాలుగు గంటల్లో నడవాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు నాలుగు గంటల్లో 16 కిలోమీటర్లు నడవాలి. ఇది కేవలం క్యాలిఫైయింగ్‌ పరీక్ష మాత్రమే. దీనికి ఎలాంటి మార్కులు ఉండవు. 
  • ఎన్సీసీలో పని చేసిన క్యాడేట్‌కు బెనిఫిట్స్ ఉంటాయి. NCC-“C” సర్టిఫికెట్ ఉంటే 5 బోనస్ మార్కులు కలుస్తాయి. NCC-“B” సర్టిఫికెట్ ఉంటే 3 బోనస్ మార్కులు, NCC-“A” సర్టిపికెట్ ఉంటే 1 బోనస్ మార్క్ కలుస్తుంది.  
  • ఇలా మెయిన్స్ తర్వాత జరిపిన వాకింగ్, మెడికల్ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను మాత్రమే రోస్టర్ పాయింట్లు, ఇతర మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

వయో పరిమితి ఎంత 

1 జులై 2025 నాటికి 18 ఏళ్లు నిండిన వాళ్లు 30 ఏళ్లకు మించని వాళ్లు దరఖాస్తు చేసుకోవాలి. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, EWSలకు ఐదేళ్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, EWSలకు పదేళ్లు సడలింపు ఉంటుంది. 

ఫీజు ఎంత ?

ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలు ఫీజును ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారానే మీ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత చెల్లించాలి. మిగతా కేటగిరి అభ్యర్థులు 80 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.  

క్రీడాకారులకు ప్రత్యేక అవకాశం 
క్రీడాకారులకు ఈ పోస్టుల్లో 3 శాతం కేటాయిస్తున్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ(శాప్) ఎండీ కానీ, ఛైర్మన్ పేరు మీద ప్రముఖ దినపత్రిల్లో నోటిపికేషన్ వేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న క్రీడాకారుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తారు. అలాంటి వాళ్లలో మెరిట్ ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు. క్రీడాకారులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా స్టేట్‌ లెవల్ కమిటీ సిఫార్సుల మేరకు ఏపీపీఎస్సీకి లిస్ట్ పంపిస్తారు. వారిని ఫైనల్ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాలో ఏపీపీఎస్సీ యాడ్ చేస్తుంది. 

అర్హత ఉన్న వారు ఎలా అప్లై చేయాలి?
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివిన తర్వాత అర్హత ఉన్న వాళ్లు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌కు వెళ్లాలి

  • స్టెప్‌-1 ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://portal-psc.ap.gov.in వెళ్లాలి.
  • స్టెప్‌2- వెబ్‌సైట్‌లో కుడి చేతివైపు One Time Profile Registration (OTPR) రిజిస్ట్రేషన్ ఉంటుంది.
  • స్టెప్-3 ఏపీపీఎస్సీలో ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే వాళ్లంతా కచ్చితంగా తమ వివరాలను ఈ OTPRలో నమోదు చేయాల్సింది.  
  • స్టెప్‌-4 మీ ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ ఇస్తే ఐడీ పాస్‌వర్డ్‌ను మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీకి పంపిస్తారు.  
  • స్టెప్‌ - 5 యూజర్ఐడీ, పాస్‌ వర్డ్‌ను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. భవిష్యత్‌లో ఏ ఉద్యోగానికి అప్లై చేయాలనుకున్నా ఇదే ప్రక్రియ ఉంటుంది. మళ్లీ మళ్లీ ఐడీ క్రియేట్ చేయడనికి ఉండదు. ఒక ఫోన్ నెంబర్, ఒక మెయిల్ ఐడీతో ఒకసారి మాత్రమే ఐడీ క్రియేట్ చేయగలరు.  
  • స్టెప్‌ - 6 ముందే మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే నేరుగా One Time Profile Registration (OTPR) క్లిక్ చేసి మీ వివరాలు ఇచ్చి లాగిన్ కావచ్చు. 
  • స్టెప్‌ - 7. పాస్ వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్‌వర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. 

పరీక్ష విధానం

2019లో జారీ చేసిన G.O.Ms.No.39 ప్రకారం 200 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే కచ్చితంగా స్క్రీనింగ్ టెస్టు ఉంటుంది. అందులో మంచి మార్కులు వచ్చిన వారిని పోస్టుల ఆధారంగా మెయిన్స్ ఎగ్జామ్‌కు పిలుస్తారు. 

స్క్రీనింగ్, మెయిన్స్ పరీక్షలు రెండూ కూడా ఆబ్జెక్టివ్ టైప్‌లోనే ఉంటాయి. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలను దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఏపీపీఎస్సీ ప్రకటిస్తుంంది. 

ఉద్యోగం వస్తే జీతం ఎంత వస్తుంది

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ ఉద్యోగాల్లో క్యారీ ఫార్వర్డ్ ద్వారా 81 ఉద్యోగాలు వస్తే 175 ఫ్రెష్‌గా ఉద్యోగాలు మొత్తంగా 256 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి 25,220 నుంచి 80,910 వరకు డ్రా చేయవచ్చు. 

అసిస్టెంట్‌ బీట్ ఆఫీసర్‌ ఉద్యోగాల్లో 60 క్యారీ ఫార్వార్డ్ ద్వారా వస్తే 375 తాజాగా ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 435 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్‌లో ఫిల్ చేయబోతున్నారు. ఈ ఉద్యోగం వచ్చిన వ్యక్తికి 23,120 నుంచి 74,770 వరకు జీతం వస్తుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Embed widget