Navy Apprenticeship: వైజాగ్ నావల్ డాక్‌యార్డులో 275 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి
విశాఖపట్నంలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ (2024-25 బ్యాచ్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Naval Apprenticeship Training: విశాఖపట్నంలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ (Naval Dockyard Apprentices School) వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ (2024-25 బ్యాచ్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు అర్హులు. సరైన అర్హతలున్నవారు జనవరి 1, 2024 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులకు ఎంపికచేస్తారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో మార్కులు, గ్రేడ్ పాయింట్లు, పాస్ పర్సంటేజీ ఇవేవీ లేకుండా ఉత్తీర్ణులైవారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు..
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 281
పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్) - 143, ఓబీసీ - 74, ఎస్సీ - 39, ఎస్టీ - 19. వీటిలోనే దివ్యాంగులకు 8, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 8 పోస్టులు కేటాయించారు.
శిక్షణ వ్యవధి: ఏడాది.
ట్రేడులు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఆర్ అండ్ ఎ/సి మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 14 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.05.2010 కంటే ముందు జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు హార్డ్‌కాపీలను నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
రాతపరీక్ష విధానం: ఓఎంఆర్ విధానంలో మొత్తం 75 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నలకు ఒకటిన్నర(1.5) మార్కులు కేటాయించారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ సైన్స్ నుంచి 20 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 10 ప్రశ్నలు-15 మార్కులు కేటాయించారు. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ క్యాంపస్‌లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. అయితే కోవిడ్ 19 మహమ్మారి సమయంలో మార్కులు, గ్రేడ్ పాయింట్లు, పాస్ పర్సంటేజీ ఇవేవీ లేకుండా ఉత్తీర్ణులైవారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ విధానం: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఓరల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
స్టైపెండ్: ఏడాదిపాటు నెలకు రూ.7,700 చెల్లిస్తారు. ఒకవేళ శిక్షణ రెండేళ్లు ఉంటే రూ.8,050 చెల్లిస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Officer-in-Charge (for Apprenticeship),
Naval Dockyard Apprentices School,
VM Naval Base S.O., P.O., Visakhapatnam,
Andhra Pradesh - 530 014.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.01.2024.
➥ రాతపరీక్ష తేది: 28.02.2024
➥ రాతపరీక్ష ఫలితాల వెల్లడి: 02.03.2024.
➥ ఇంటర్వ్యూ తేదీలు: 05 నుంచి 08.03.2024 వరకు.
➥ ఇంటర్వ్యూ ఫలితాల వెల్లడి: 14.03.2024.
➥ మెడికల్ టెస్ట్ ప్రారంభ తేది: 16.03.2024.
➥ శిక్షణ ప్రారంభం: 02.05.2024.