అన్వేషించండి

TTD Recruitment: తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలల్లో 78 డిగ్రీ లెక్చరర్, జూనియర్‌ లెక్చరర్ పోస్టులు

TTD News: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TTD Colleges Faculty Posts: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు (Degree Lecturer), తితిదే జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలి. కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 7 నుంచి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష(కంప్యూటర్ ఆధారిత పరీక్ష), సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు..

➤ డిగ్రీ/ జూనియర్‌ లెక్చరర్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 78

➥ డిగ్రీ లెక్చరర్: 49 పోస్టులు

➥ జూనియర్ లెక్చరర్: 29 పోస్టులు

డిగ్రీ లెక్చరర్ పోస్టుల వివరాలు:

సబ్జెక్టుల వారీ ఖాళీలు..

➥ బోటనీ: 03 పోస్టులు 

➥ కెమిస్ట్రీ: 02 పోస్టులు

➥ కామర్స్: 09 పోస్టులు 

➥ డెయిరీ సైన్స్: 01 పోస్టు 

➥ ఎలక్ట్రానిక్స్: 01 పోస్టు

➥ ఇంగ్లిష్: 08 పోస్టులు

➥ హిందీ: 02 పోస్టులు 

➥ హిస్టరీ: 01 పోస్టు 

➥ హోమ్ సైన్స్: 04 పోస్టులు

➥ ఫిజికల్ ఎడ్యుకేషన్: 02 పోస్టులు 

➥ ఫిజిక్స్: 02 పోస్టులు 

➥ పాపులేషన్ స్టడీస్: 01 పోస్టు

➥ సంస్కృతం: 01 పోస్టు

➥ సంస్కృత వ్యాకరణం: 01 పోస్టు

➥ స్టాటిస్టిక్స్: 04 పోస్టులు 

➥ తెలుగు: 03 పోస్టులు 

➥ జువాలజీ: 04 పోస్టులు

అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించి ఉండాలి.

జూనియర్ లెక్చరర్ పోస్టుల వివరాలు:

సబ్జెక్టుల వారీ ఖాళీలు..

➥ బోటనీ: 04 పోస్టులు 

➥ కెమిస్ట్రీ: 04 పోస్టులు 

➥ సివిక్స్‌: 04 పోస్టులు 

➥ కామర్స్‌: 02 పోస్టులు 

➥ ఇంగ్లిష్: 01 పోస్టు

➥ హిందీ: 01 పోస్టు 

➥ హిస్టరీ: 04 పోస్టులు 

➥ మ్యాథమెటిక్స్‌: 02 పోస్టులు 

➥ ఫిజిక్స్: 02 పోస్టులు

➥ తెలుగు: 03 పోస్టులు 

➥ జువాలజీ: 02 పోస్టులు

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 1.07.2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ/తి.తి.దే. ఉద్యోగులకు నిబంధనల మేరకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.370. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష(కంప్యూటర్ ఆధారిత పరీక్ష), సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2: అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు -150 ప్రశ్నలు-300 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి. పేపర్-1లో ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు, పేపర్-2లో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంత మార్కులు కోత విధిస్తారు.

జీత భత్యాలు: నెలకు డిగ్రీ లెక్చరర్‌కు రూ.61,960- రూ.1,51,370. జూనియర్ లెక్చరర్‌కు రూ.57,100- రూ.1,47,760.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.03.2024

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ:27.03.2024 

Notification

Website

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget