News
News
X

ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల.. 10,143 ఉద్యోగాల భర్తీ..

AP Job Calender: ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర మొదలైంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌‌ను సీఎం జగన్ విడుదల చేశారు.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు అందించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ క్యాలెండర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2022 మార్చి వరకు భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి పైరవీలకు తావు లేదని స్పష్టం చేశారు. రాత పరీక్షలో పొందిన మెరిట్ ప్రాతిపదికన మాత్రమే అర్హులను ఎంపిక చేస్తామని, ఇంటర్వ్యూ ఉండదని జగన్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఈ భర్తీ చేపట్టినట్లు సీఎం వివరించారు.

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. నిరుద్యోగుల కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు జగన్ వెల్లడించారు. వీటిలో 1,84,164 పర్మినెంట్ ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. మిగతా వాటిలో 3,99,791 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, మరో 19, 701 కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేశామని తెలిపారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు.  

రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు
ఏ నెలలో ఏ ఉద్యోగ ప్రకటన వెలువడుతుందనే విషయాలు ఈ జాబ్ క్యాలెండర్‌లో ఉన్నాయి. దీని ప్రకారం 2021 జూలై నెల నుంచి 2022 మార్చి వరకు మొత్తం 10,143 పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతిని ఇస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. భర్తీ ప్రక్రియ చేపట్టాల్సిందిగా ఏపీపీఎస్సీ (APPSC) , పోలీసు నియామక బోర్డులకు అనుమతి ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు.  ఈ ఖాళీలను రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు వివరించారు. 

పోస్టుల వివరాలు.. 
భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు : 10,143
జూలై 2021 : ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్ లాగ్ పోస్టులు - 1,238
ఆగస్టు 2021 : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మరియు గ్రూప్‌ 2 - 36
సెప్టెంబర్‌ 2021 : పోలీస్‌ శాఖ ఉద్యోగాలు - 450
అక్టోబర్‌ 2021 : వైద్య శాఖలో డాక్టర్లు & అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు - 451
నవంబర్‌ 2021 : వైద్య శాఖలోని పారామెడికల్‌, ఫార్మసిస్టులు మరియు ల్యాబ్ టెక్నీషియన్లు - 5,251
డిసెంబర్‌ 2021 : వైద్య శాఖలో నర్సులు - 441
జనవరి 2022 : విద్యా శాఖ - డిగ్రీ కాలేజీల లెక్చరర్లు - 240
ఫిబ్రవరి 2022 : విద్యా శాఖ - యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు - 2,000
మార్చి 2022 : ఇతర శాఖల పోస్టులు - 36 

Published at : 25 Jun 2021 02:28 PM (IST) Tags: Job Calendar Job Notification AP Jobs Jobs Notification APPPSC Job Vacancies YS Jagan Govt Jobs AP Job Calendar AP Job Calendar 2021 AP Job 2021 updates AP Job Calendar notifications

సంబంధిత కథనాలు

IBPS Clerk 2022 Mains Exam: రేపే ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష, అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

IBPS Clerk 2022 Mains Exam: రేపే ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష, అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

IBPS PO Admit Card: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు వచ్చేస్తోంది, పరీక్ష తేదీలివే?

IBPS PO Admit Card: ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు వచ్చేస్తోంది, పరీక్ష తేదీలివే?

CIL Recruitment: కోల్‌ ఇండియా కొలువులకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా!

CIL Recruitment: కోల్‌ ఇండియా కొలువులకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా!

APPSC:మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు షురూ! ఇలా అప్లయ్ చేసుకోండి!

APPSC:మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు షురూ! ఇలా అప్లయ్ చేసుకోండి!

Amazon Recruitment: అమెజాన్‌లో సిస్టమ్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు,వివరాలు ఇలా!

Amazon Recruitment: అమెజాన్‌లో సిస్టమ్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు,వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

భగవంతుని ఆగ్రహానికి గురి కావద్దు- టీటీడీకి విజయ శంకర స్వామి వార్నింగ్

భగవంతుని ఆగ్రహానికి గురి కావద్దు- టీటీడీకి విజయ శంకర స్వామి వార్నింగ్

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?