అన్వేషించండి

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

ప్రస్తుత ఖాళీలకు మరిన్ని పోస్టులు మంజూరు చేస్తూ మార్చి 28న ప్రకటన విడుదల చేసింది. 3,432 పోస్టులకు అదనంగా 118 పోస్టులును జతచేసింది. అదేవిధంగా 4 ఖాళీలను తగ్గించింది. మొత్తం ఖాళీలు 3,546కి చేరాయి.

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో 3,432 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులకు డిసెంబర్ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. జనవరి 4న కీని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఖాళీలకు మరిన్ని పోస్టులను మంజూరు చేస్తూ మార్చి 28న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 3,432 పోస్టులకు అదనంగా 118 పోస్టులును జతచేసింది. అదేవిధంగా 4 ఖాళీలను తగ్గించింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 3,546 కి చేరింది.

త్వరలో ఫలితాలు..
ఏపీలోని జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రశ్నపత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి ఏప్రిల్‌లో ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు నియామకాలకు సంబంధించి 241 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. జిల్లా కోర్టు ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి.

నియామకాలపై సీజేకు సందేశాలు పంపొద్దు..
గతేడాది అక్టోబరు 21న జారీచేసిన ఉద్యోగ ప్రకటనల ప్రకారం ఏపీలోని జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్) కమలాకరరెడ్డి మార్చి 28న తెలిపారు. కొత్త కోర్టుల ఏర్పాటు నేపథ్యంలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య పెరిగిందని మార్చి 27న ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితాల వెల్లడి వ్యవహారమై కొంతమంది అభ్యర్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రకు నేరుగా సందేశాలు, ఈ-మెయిళ్లు పంపుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్య అభ్యంతరకరమని అన్నారు. సందేశాలు పంపిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని తెలిపారు.

Also Read:

ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 63 ఖాళీలు, అర్హతలివే!
మహేంద్రగిరిలోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా మొత్తం 63 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్/10వ తరగతి/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ/డిప్లొమా/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు, వివరాలు ఇలా!
ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్‌ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 106 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, నెట్/ జేఆర్‌ఎఫ్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 5000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 106 ఖాళీలు, ఏపీలో 141 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

IBPS PO MT Recruitment: ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
ఐబీపీఎస్ బ్యాంకింగ్ ఉద్యోగాల జాతర.. 6,715 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
Google Summer Internship 2027 India: గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2027 - టెక్ విద్యార్థులకు సువర్ణావకాశం.. దరఖాస్తుకు జూన్ 28 ఆఖరి తేదీ! - పూర్తి వివరాలు
గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2027 - టెక్ విద్యార్థులకు సువర్ణావకాశం.. దరఖాస్తుకు జూన్ 28 ఆఖరి తేదీ! - పూర్తి వివరాలు
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త! 8th Pay Commission నివేదిక ఎప్పుడు వస్తుంది? జీతాల పెంపుపై అప్డేట్
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త! 8th Pay Commission నివేదిక ఎప్పుడు వస్తుంది? జీతాల పెంపుపై అప్డేట్
Job Interview Tips : జాబ్ రావాలంటే ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఈ తప్పులు చేయకండి.. సక్సెస్ కావచ్చు
జాబ్ రావాలంటే ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఈ తప్పులు చేయకండి.. సక్సెస్ కావచ్చు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget