అన్వేషించండి

AP DSC - 2024 ఫీజు చెల్లించడానికి నేటితో ఆఖరు, దరఖాస్తుల సమర్పణకు రేపటి వరకు అవకాశం

ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21తో ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది.

AP DSC 2024 Application: ఏపీలో 6100 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 21తో ఫీజు చెల్లింపు గడువు ముగియనుంది. అయితే ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ ఉదయం విడత 9.30 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసి ఏప్రిల్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తదనంతరం ఏప్రిల్ 8న ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసి, ఏప్రిల్ 15న ఫలితాలు వెల్లడించనున్నారు.

ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో  ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్‌ 31 వరకు రాబోయే ఖాళీలనూ పరిగణనలోకి తీసుకొని, ఈ పోస్టులను ప్రకటించారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌ 8న పోస్టింగులు ఇవ్వనున్నారు. వీటిలో జిల్లా పరిషత్/మండల పరిషత్ /మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు.

నిరుద్యోగులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాల్లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కేటాయించారు. ఆన్‌లైన్‌ పరీక్షలను రోజుకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. 

ఏపీ గురుకులాల్లో 1534 ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులు - దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

ఏపీలో 4566 టీచర్ పోస్టులు - దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..

వివరాలు..

* ఏపీ డీఎస్సీ-2024 నోటిఫికేషన్

➥ ఎస్టీజీ: 2280 పోస్టులు

➥ స్కూల్ అసిస్టెంట్: 2299 పోస్టులు

➥ టీజీటీ: 1264 పోస్టులు

➥ పీజీటీ: 215 పోస్టులు

➥ ప్రిన్సిపల్: 42 పోస్టులు

ఏపీ డీఎస్సీ షెడ్యూలు ఇలా..

➥ ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్: 12.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.02.2024.

➥ ఫీజుచెల్లింపు తేదీలు: 12.02.2024 - 21.02.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.02.2024.

➥ ఆన్‌లైన్ మాక్‌టెస్టు అందుబాటులో: 24.02.2024.

➥ పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 05.03.2024 నుంచి.

➥ ఏపీడీఎస్సీ-2024 పరీక్ష తేదీలు: 15.03.2024 నుంచి 30.03.2024 వరకు.

పరీక్ష సమయం: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (మొదటి సెషన్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (రెండో సెషన్) పరీక్షలు నిర్వహిస్తారు.

➥ ఆన్సర్ కీ వెల్లడి: 31.03.2024.

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 31.03.2024 నుంచి 03.04.2024 వరకు.

➥ ఫైనల్ కీ వెల్లడి: 08.04.2024.

➥ డీఎస్సీ-2024 ఫలితాల వెల్లడి: 15.04.2024 

Website

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
iPhone 17 Slim: అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SIT Investigates Pulivarti Nani Incident | Tirupati | పులివర్తి నానిని విచారించిన సి‌ట్ అధికారులుAbhishek Sharma Batting In IPL 2024 | దూకే ధైర్యమా జాగ్రత్త... అభిషేక్ శర్మ ముంగిట నువ్వెంతSRH vs RCB Final | 2016 IPL Final Repeat |SRHకు పాత బాకీలు తీరుస్తామంటున్న RCB| ABP DesamKKR vs SRH Qualifier IPL 2024 | RRకు దెబ్బెసిన అదే వర్షం..SRH ను కాపాడింది| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
Ebrahim Raisi Dies: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి మృతి, ధ్రువీకరించిన స్థానిక మీడియా
MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?
iPhone 17 Slim: అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
అత్యంత ఖరీదైన ఐఫోన్ 17 స్లిమ్! - లాంచ్ ఎప్పుడో తెలుసా?
Lok Sabha Elections 2024: ఐదో దశ పోలింగ్ ప్రారంభం, ఈ విడతలో ఓటేసిన ప్రముఖులు వీరే
ఐదో దశ పోలింగ్ ప్రారంభం, ఈ విడతలో ఓటేసిన ప్రముఖులు వీరే
Top 5 Hatchback Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు - 2024 స్విఫ్ట్ నుంచి టియాగో దాకా!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌లు - 2024 స్విఫ్ట్ నుంచి టియాగో దాకా!
Jr NTR Birthday Special: ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్
ఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగ్‌కు విమర్శకులూ సైలెంట్
Weather Latest Update: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ గుడ్‌న్యూస్! వాటి ప్రస్తుత గమనం ఇదే
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ గుడ్‌న్యూస్! వాటి ప్రస్తుత గమనం ఇదే
Embed widget