APPSC AMVI Results: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే
Andhra Pradesh ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ మార్చి 20న విడుదల చేసింది.
APPSC AMVI Results: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి సంబంధించిన ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మార్చి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 17 పోస్టులకుగాను 16 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో జోన్-1 పరిధిలో నలుగురు, జోన్-2 పరిధిలో నలుగురు, జోన్-3 పరిధిలో ఐదుగురు, ఇక జోన్-4 పరిధిలో ముగ్గురు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో 17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022, సెప్టెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 2 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు 2023 అక్టోబరు 6న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 14న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. తాజాగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్టుల వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.
వివరాలు..
* అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (రవాణా శాఖ)
ఖాళీల సంఖ్య: 17 పోస్టులు (క్యారీడ్ ఫార్వర్డ్-02, కొత్తవి-15)
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్ ఇంజినీరింగ) లేదా డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్). మోటారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ఎండార్స్‌మెంట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-36 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-1, పేపర్-2), మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 150 మార్కులు, పేపర్-2 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు.
దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డుదారులు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
జీత భత్యాలు: నెలకు రూ.31,460-రూ.84,970.
ALSO READ:
APPSC: 'గ్రూప్-2' అభ్యర్థులకు అలర్ట్, ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్! రిజల్ట్ ఎప్పుడంటే?
ఏపీలో గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష (Prelims) ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు వారం రోజుల్లో వెలువడనున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్ ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 1:100 నిష్పత్తి ప్రకారం మెయిన్ పరీక్షకు (Group2 Mains) ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమ్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87.17 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో మొత్తం 897 గ్రూప్-2 పోస్టులకుగాను 4,83,535 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,63,517 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 4,04,037 (87.17%) మంది పరీక్షకు హాజరయ్యారు. జూన్ లేదా జులైలో మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1327 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..