అన్వేషించండి

AIIMS NORCET: ఎయిమ్స్‌- నర్సింగ్ ఆఫీసర్ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్-6)-2024 పరీక్ష ఫలితాలను ఎయిమ్స్-న్యూఢిల్లీ ఏప్రిల్ 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను  అందుబాటులో ఉంచింది.

AIIMS NORCET-6 Results: నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్-6)-2024 పరీక్ష ఫలితాలను ఎయిమ్స్-న్యూఢిల్లీ ఏప్రిల్ 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను  అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను ఎయిమ్స్ విడుదల చేసింది. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఫలితాలను అందుబాటులో ఉంచారు. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం మొత్తం 82,659 మంది దరఖాస్తు చేసుకోగా.. 75,505 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారలో మొత్తం 42,511 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరి నుంచి తర్వాతి దశకు 8041 మంందిని ఎంపికచేస్తారు. 

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 26న నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ((NORCET)-6 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరైన అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 26 నుంచి మార్చి 17 వరకు దరఖాస్తులు స్వీకరించారు.

ప్రిలిమినరీ పరీక్షను ఏప్రిల్‌ 14న నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 5న మెయిన్ (స్టేజ్-2) పరీక్ష నిర్వహించనున్నారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.9300- రూ.34800 జీతంతో పాటు రూ.4600 గ్రేడ్ పే ఇస్తారు. 

నర్సింగ్ ఆఫీసర్ (NORCET-6) ప్రిలిమ్స్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి..

కటాఫ్ మార్కులు ఇలా..

AIIMS NORCET: ఎయిమ్స్‌- నర్సింగ్ ఆఫీసర్ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

వివరాలు..

* నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

ఎయిమ్స్‌ సంస్థలు.. 

➥ ఎయిమ్స్‌ భటిండా

➥ ఎయిమ్స్‌ భువనేశ్వర్

➥ ఎయిమ్స్‌ బిలాస్‌పూర్

➥ ఎయిమ్స్‌ దేవ్‌ఘర్

➥ ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్

➥ ఎయిమ్స్‌ గువాహటి

➥ ఎయిమ్స్‌ కల్యాణి

➥ ఎయిమ్స్‌ మంగళగిరి

➥ ఎయిమ్స్‌ నాగ్‌పుర్

➥ ఎయిమ్స్‌ రాయ్ బరేలీ

➥ ఎయిమ్స్‌ న్యూఢిల్లీ

➥ ఎయిమ్స్‌ పాట్నా

➥ ఎయిమ్స్‌ రాయ్‌పూర్

➥ ఎయిమ్స్‌ విజయ్‌పూర్

అర్హత: డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.  స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.

వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. 

పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 3 గంటలు. ఆబ్జెక్టివ్‌ విధానంలో 200 ప్రశ్నలు, 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. సబ్జెక్టుకు సంబంధించి 180 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు.

జీత భత్యాలు: రూ.9300- రూ.34800తో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget