AAICLAS: AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 906 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు, దరఖాస్తుకు అర్హతలివే!
AAICLAS Jobs: న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
AAICLAS Security Screener Posts: న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ (Contract Jobs) ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ (Security Screener) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 906 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి కనీసం జనరల్ అభ్యర్థులకు 60 శాతం, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ మార్కులు, కంటి పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.750; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు..
* సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టులు
మొత్తం ఖాళీలు: 906
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి కనీసం జనరల్ అభ్యర్థులకు 60శాతం, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: డిగ్రీ మార్కులు, ఐ/కలర్ బ్లైండ్‌నెస్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పోస్టింగ్ స్థలం: చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికోడ్ (కాలికట్), వారణాసి, శ్రీనగర్, వడోదర, మధురై, తిరుపతి, రాయ్‌పుర్, వైజాగ్, ఇండోర్, అమృత్‌సర్, భువనేశ్వర్, అగర్తల, పోర్ట్ బ్లెయిర్, తిరుచ్చి, డెహ్రాడూన్, పుణె, సూరత్, లేహ్ శ్రీనగర్, పాట్నా.
జీతభత్యాలు: ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మొదట స్టైపెండ్‌గా రూ.15,000 చెల్లిస్తారు. వీరికి ట్రైనింగ్ ఎగ్జామ్ తర్వాత మొదటి సంవత్సరం నెలకు రూ.30,000; రెండో సంవత్సరం రూ.32,000; మూడో సంవత్సరం రూ.34,000 జీతంగా ఇస్తారు.
దరఖాస్తు సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్లు..
➥ పదోతరతి/హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్
➥ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్/ డిగ్రీ మార్కుల మెమో లేదా డిగ్రీ ప్రొవిజిన్ సర్టిఫికేట్
➥ క్యాస్ట్/కేటగిరీ సర్టిఫికేట్
➥ ఆధార్ కార్డ్ కాపీ
➥ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటో
➥ స్కానింగ్ చేసిన అభ్యర్థి సంతకం(20 KB లోపు ఉండాలి)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.12.2023.
ALSO READ:
➥ ఎస్‌బీఐలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా
➥ ఎస్‌బీఐ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల, డిగ్రీ అర్హతతో 8773 పోస్టుల భర్తీ
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply