అన్వేషించండి

Mango Shake: మ్యాంగో షేక్‌లో షుగర్ యాడ్ చేస్తున్నారా? ఐతేే త్వరగా మీరు ముసలివాళ్లు అయిపోతారు!

Sugar In Mango Shake:మ్యాంగో షేక్‌లో చక్కెర దండిగా వేసుకొని తాగేస్తున్నారా... ఆ క్షణానికి హాయిగా, ఎండ నుంచి రిలీఫ్‌గానే ఉంటుంది. కానీ ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Sugar In Mango Shake: బయట ఎండలు మండిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగుతున్నా దాహం తీరడం లేదని చాలా మంది అంటున్నారు. ఎనర్జీ డ్రై అయిపోతుందని కొందరు డ్రింగ్స్‌ గటగటా తాగేస్తున్నారు. మిల్క్ షేక్‌లు, ఇతర ఫ్రూట్ షేక్‌లు లాగించేస్తున్నారు. మరికొందరు సీజనల్ ఫ్రూట్ అయిన మ్యాంగో షేక్‌లపై పడుతున్నారు. ఇలా మ్యాంగో షేక్‌లు తాగే క్రమంలో అందులో నిండుగా షుగర్ దట్టించి మరీ తాగుతున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో వాళ్లకు తెలియడం లేదు. 
ఎండ వేడికి అల్లాడిపోతున్న టైంలో నిండుగా మంచిగా పండిన మ్యాంగో, మిల్క్, షుగర్, ఐస్ క్యూబ్స్‌తో సిద్ధం చేసిన షేక్ తాగితే దెబ్బకు ఎండ వేడి ఎగిరిపోతుంది. కానీ అలా చేయడం ఎంత ప్రమాదకరమో మీరు ఊహించలేరు.  రుచిని పెంచడానికి అదనంగా చక్కెర వేసినప్పుడు, ఈ రుచికరమైన పానీయం మీకు విషం అవుతుంది. 

డబుల్ షుగర్ లోడ్

మామిడి ఒక సహజంగా తీపి పండు, ఇందులో అల్రెడీ ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి చక్కెర పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. మీరు దీనికి అదనంగా శుభ్రంగాా పాలీస్‌ చేసిన చక్కెర కలుపుతున్నారు.  ఫలితంగా అందులో ఉండే గ్లైసెమిక్ లోడ్ చాలా పెరుగుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు చాలా ప్రమాదకరం. దీని వల్ల చక్కెర భారీగా స్పైక్ అయ్యే ప్రమాదం ఉంది. 

బరువు వేగంగా పెరుగుతుంది

మామిడి షేక్‌లో మామిడి స్లైస్‌లు, పాలు, చక్కెర కలుపుతారు, ఈ మూడింటిలోనూ కేలరీలు అధికంగా ఉంటాయి. చక్కెర కలపడం వల్ల ఈ పానీయం హై-కేలరీ లు కలిగిన డ్రింక్  అవుతుంది. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల మీరు ఊహించని విధంగా  బరువు పెరుగుతారు. ఊబకాయం వస్తుంది. దీని వల్ల హార్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్‌ , థైరాయిడ్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్సీ పవర్ తగ్గిపోతుంది. ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది. 

గుండెకు నష్టం కలిగిస్తుంది

అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్లు భారీగా వేగంగా పెరుగుతాయి, ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటి అవుతుంది. మీరు గుండె జబ్బుల నుంచి బయటపడాలనుకుంటే మామిడి షేక్‌లో చక్కెర కలిపి తాగేే అలవాటు ఉంటే వెంటనే మానేయండి.

దంతాలు, చర్మంపై ప్రభావం

చక్కెర కారణంగా దంతాల మధ్య కావిటీస్ పెరుగుతాయి. అలాగే దీని వల్ల చర్మంలో గ్లైకేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది, ఇది చర్మంపై  వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. మీరు ఎంత యంగ్‌గా ఉన్నా వృద్ధులుగా కనిపించే ఛాన్స్ ఉంది. దీన్ని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల ముఖంపై మచ్చలు ,, ముడతలు త్వరగా రావడం ప్రారంభమవుతాయి. కాబట్టి సాధారణ మామిడి షేక్‌ తయారు చేసి తాగడానికి ప్రయత్నించండి. షుగర్ మాత్రం వేసుకోవద్దు

జీర్ణక్రియలో డిస్టర్బెన్స్‌ 

చక్కెర, పాల కలయిక కొంతమందిలో గ్యాస్‌ ఫామ్‌ అవుతుంది. అజీర్ణ సమస్య రావచ్చు. కడుపు ఉబ్బరంగా మారుతుంది. ముఖ్యంగా ఇది మామిడి వంటి పండ్లతో తీసుకున్నప్పుడు. ఎక్కువగా ఉంటుంది. 

గమనికి: వార్తలో ఇచ్చిన సమాచారం వివిద మీడియా నివేదికల ఆధారంగా చెప్పింది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాప్ హెడ్ లైన్స్

Blood Tests : రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?
రొటీన్​కు భిన్నంగా వైద్యులు సూచిస్తోన్న 5 రక్త పరీక్షలు.. వీటితో వ్యాధులు ముందుగానే గుర్తించవచ్చా?
Blood in Urine : మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు
మూత్రంలో రక్తం కనిపిస్తుందా? కిడ్నీ క్యాన్సర్‌(Kidney Cancer)కు సంకేతం కావచ్చు.. నిర్లక్ష్యం చేయొద్దంటోన్న నిపుణులు
No Sugar for 30 Days : నో షుగర్స్ అంటే తినకూడని ఫుడ్స్ ఇవే.. 30 రోజులు స్వీట్స్ మానేస్తే కలిగే ప్రయోజనాలివే
నో షుగర్స్ అంటే తినకూడని ఫుడ్స్ ఇవే.. 30 రోజులు స్వీట్స్ మానేస్తే కలిగే ప్రయోజనాలివే
Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Pawan Kalyan Home Minister Portfolio: పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
పవన్ కల్యాణ్ ఆఫీసులో సోషల్ మీడియా కేసులపై స్పెషల్ టాస్క్ ఫోర్స్.. హోంశాఖ బాధ్యతలకు ఇది సంకేతమా?
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Sanju Samson Under Pressure: సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
సంజూ శాంసన్ కు పెరిగిపోతున్న కౌంట్‌డౌన్..  టెక్నికల్ లోపాలతో స‌త‌మ‌తం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి లైన్ క్లియర్!
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Embed widget