(Source: ECI/ABP News/ABP Majha)
KCR Health: ‘యాంజియోగ్రామ్’ టెస్ట్ ఎందుకు చేస్తారు? కేసీఆర్‌కు చేసిన ఈ పరీక్ష నొప్పి కలిగిస్తుందా?
KCR Health | ‘యాంజియోగ్రామ్’ టెస్ట్‌ను ఎందుకు చేస్తారు? సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏమిటీ? ఈ పరీక్షలు నొప్పి కలిగిస్తాయా?
Angiogram Test to KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి (Yashoda Hospital)కు తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు కేసీఆర్‌కు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. ఇంతకీ కేసీఆర్‌కు వచ్చిన సమస్య ఏమిటీ? యాంజియోగ్రామ్ పరీక్ష దేనికి చేస్తారు?
యాంజియోగ్రామ్ పరీక్షనే కరోనరీ యాంజియోగ్రామ్ అని కూడా అంటారు. గుండె రక్త నాళాలను ‘కరోనరి ఆర్టరీస్’ అని అంటారు. వాటిని ఎక్స్‌రే ఇమేజింగ్ అనే సాంకేతిక విధానంలో పరీక్షించడమే ‘యాంజియోగ్రామ్’(Angiogram) లేదా ‘యాజియోగ్రఫీ’(Angiography) అని అంటారు. రక్త నాళాల ద్వారా గుండెకు చేరే రక్త ప్రవాహంలో ఎక్కడైనా అవరోధం ఏర్పడితే.. ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. గుండె, రక్తనాళాల పరిస్థితిని కార్డియాక్ క్యాథటరైజేషన్ ప్రక్రియ నిర్ధారిస్తుంది. కేసీఆర్ ఛాతి వైపు ఎడమ చేయి, కాలు లాగుతున్న నేపథ్యంలో గుండె సమస్యలను తెలుసుకొనేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. అయితే, ఈ పరీక్ష అంత సులభమైనది కాదు. నొప్పితో కూడుకున్నదే.
కరోనరీ యాంజియోగ్రామ్ ఎలా చేస్తారు?: ఆసుపత్రిలోని క్యాథటరైజేషన్ లేదా క్యాథ్ ల్యాబ్‌లో యాంజియోగ్రామ్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షకు ముందుగా మీకు గతంలో గుండె సమస్యలు ఉన్నాయా? డయాబెటీస్ ఇతరాత్ర వ్యాధులతో బాధపడుతున్నారా? తదితర వివరాలను వైద్యులు తెలుసుకుంటారు. యాంజియోగ్రామ్ పరీక్ష కాస్త నొప్పితో కూడుకున్నదే. కరోనరీ యాంజియోగ్రామ్ ప్రక్రియలో భాగంగా గుండెకు వెళ్లే రక్త నాళంలోకి ఒక రకమైన వర్ణ పదార్థాన్ని పంపిస్తారు. ఇది X-Ray మెషీన్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పదార్థం ఎక్కడైనా నెమ్మదించినా, ఆగినా.. అక్కడ సమస్య ఉన్నట్లే. ఈ సమస్యను పరిష్కరించేందుకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేస్తారు. ఛాతి నొప్పి, కరోనరీ ఆర్డరీ వ్యాధి ఉన్నవారికి మాత్రమే ఈ పరీక్షలు చేస్తారు.
ఈ విధంగా పరీక్షిస్తారు: ఈ ప్రక్రియలో భాగంగా రోగిని టేబుల్ ఎక్స్‌రే టేబుల్ మీద వెల్లకిలా పడుకోబెడతారు. చేతి సిరలోకి ఒక సూదిని చొప్పిస్తారు. నొప్పి తెలియకుండా ఉండేందుకు వైద్యులు నొప్పి నివారిణ మందులు లేదా అనస్థీషియా ఇస్తారు. ఆ తర్వాత వేలుకు, ఛాతికి మానిటరింగ్ పరికరాలను అమర్చుతారు. ముక్కులోకి చిన్న గొట్టాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తారు. అనస్థీషియాతో ధమనిపై ఉండే చర్మం, కణాజాలం మొద్దుబారేలా చేస్తారు. ఆ తర్వాత ఒక సన్ని సూది సాయంతో వైర్‌ను దూర్చుతారు. ఆ తర్వాత క్యాథేటర్ అనే ప్లాస్టిక్ గొట్టాన్ని వైర్ పైన, ధమనిలో అమర్చుతారు. క్యాథేటర్ అమర్చిన తర్వాత ఆ వైరును తొలగిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక వర్ణ పదార్థాన్ని క్యాథేటర్ ద్వారా ధమనిలోకి పంపుతారు. అది రక్త నాళాల గుండా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహాన్ని ఎక్స్‌రే చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. రక్త నాళంలో అవరోధాలు లేదా ఇరుకు సందులు కనిపిస్తే వైద్యులు సమస్యను గుర్తించి చికిత్స అందిస్తారు. ఇది సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. ఇది రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది కాలు భాగంలో పెద్ద ధమిని ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇది పూర్తి కావడానికి సుమారు గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత క్యాథేటర్ తొలగించి, రక్త స్రావం కాకుండా అక్కడి రంథ్రాన్ని మూసేస్తారు. ఈ పరీక్ష తర్వాత బాధితులు విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. మొత్తం రిపోర్టును రోగుల హెల్త్ రికార్డుల్లో పొందుపరుచుతారు. ఈ పరీక్ష ద్వారా రక్త నాళాల్లో కొవ్వు పేరుకున్నా, ఇరుకుగా ఉన్న తెలుసుకోవచ్చు. రక్త నాళాలల్లో రక్తం ఎంత వరకు నిరోధించబడిందో కూడా తెలుసుకోవచ్చు. యాంజియోగ్రామ్ పరీక్షకు ముందు ఏదీ తినకూడదు లేదా త్రాగకూడదు. అందుకే షెడ్యూల్ చేసిన పరీక్షలన్నీ తెల్లవారుజామునే చేస్తుంటారు. కొందరికి ఆహారం తీసుకున్న 8 గంటల గ్యాప్‌లో చేస్తారు.
Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?
ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ పరీక్షను సూచిస్తారు?
❤ గుండె నొప్పి లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధి సమస్యలు ఉంటే.
❤ గుండె వైపు ఉండే ఎడమ చెయ్యి, కాలు బాగా లాగిన, నొప్పిగా ఉన్నా.
❤ ఛాతి, మెడ, దవడ నొప్పి.
❤ ఛాతి ఉప్పినట్లుగా అనిపించినప్పుడు.
❤ నాన్-ఇన్వాసివ్ కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్‌లో అసాధారణ ఫలితాలు కనిపించినప్పుడు.
❤ పుట్టకతో గుండె సమస్యలు ఉన్నవారికి.
❤ హార్ట్ వాల్వ్ సమస్యలుంటే.
❤ ఛాతికి రక్తాన్ని అందించే నాళాల్లో సమస్య ఉన్నప్పుడు ఈ పరీక్ష చేస్తారు.
Also Read: జపాన్‌లో ముక్కలైన వెయ్యేళ్ల ‘కిల్లింగ్ స్టోన్’, 9 తోకల నక్క విడుదల! రష్యా-ఉక్రేయిన్ పోరుతో లింకేంటీ?