అన్వేషించండి

ఇలా చేస్తే? మీ వయస్సు 8 ఏళ్లు వెనక్కి, లేదంటే త్వరగా ముసలోళ్లు అయిపోతారు!

ఈ రోజుల్లో చాలామంది నిద్రపోవడం లేదు. రీల్స్, ఓటీటీలతో రాత్రిళ్లు జాగారం చేస్తున్నారు. దీంతో వారి వయస్సు పదేళ్లు ఎక్కువ అవుతుందట. అంటే.. 30 ఏళ్ల వయస్సు వ్యక్తిలో 40 ఏళ్ల లక్షణాలు కనిపిస్తాయట.

నిద్ర చాలని రోజున హుషారు తగ్గుతుంది. పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. మధ్యాహ్నం నీరసంగా అనిపిస్తుంది. తలనొప్పి రావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఒక్కరోజు నిద్ర చాలకపోతేనే ఇలాంటి పరిణామాలు కనిపిస్తే ఇక దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడే వారి గురించి ఏమని చెప్పగలం.

నిద్ర లేమి దీర్ఘకాలంలో చాలా రకాల అనారోగ్యాలకు కారణం కావచ్చని రకరకాల అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్ర లేమి వల్ల బీపీ పెరుగుతుంది, గుండె సమస్యలు కూడా రావచ్చు. డయాబెటిస్ తో బాధ పడుతున్న వారిలో ఆ సమస్య కూడా తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. కేవలం శారీరక అనారోగ్యాలు మాత్రమే కాదు. మెదడు పనితీరు మందగించడం వల్ల పనిసామర్థ్యం తగ్గిపోతుంది. ఒక్కోసారి ఆందోళన, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక స్థితులకు కూడా కారణం అవుతాయి.

ఆహారం, వ్యాయామంతో పాటు అత్యవసరమైంది విశ్రాంతి. శరీరానికి, మెదడుకు, మనసుకు పూర్తిస్థాయిలో విశ్రాంతిని ఇచ్చేది నిద్ర. పరిస్థితులతో సంబంధం లేకుండా నిద్ర పోగలగడాన్ని ఒక భోగంగా అభివర్ణిస్తారు. అంత అపురూపమైంది నిద్రంటే. చాలినంత నిద్ర కలిగిన వారు ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది తగినంత నిద్రలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా వారు త్వరగా ముసలోళ్లు అయిపోతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

ఒక అధ్యయనం కోసం 429 మందికి వారి వయసును అంచనా వేసేందుకు గాను ఒక సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ చేశారు. వారు ఇచ్చిన రిపోర్టులతో వారి నిద్ర ప్యాటర్న్ ను పోల్చి చూసినపుడు రాత్రి మంచి నిద్ర పొయ్యే వారు వారి అసలు వయసు కంటే 5-8 సంవత్సరాలు తక్కువ వయసును నమోదు చేసుకున్నారట. ఈ అధ్యయనం ప్రకారం ప్రతి నిద్రలేని రాత్రి మూడు నెలల వయసు పెంచుతుందని అంటున్నారు. తరచుగా నిద్రలేని రాత్రులు గడిపే వారు అత్యంత అలసి పోయిన భావనతో పదేళ్ల వయసు పెరిగిపోతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్వీడన్ లోని స్టాక్ హోమ్ కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ కు చెందిన నిపుణులు ఈ అధ్యయనం నిర్వహించారు. నిద్ర అలవాట్లు మానసిక శారీరక వయసును నిర్ణయిస్తాయని వీరు చెబుతున్నారు. నిద్ర లేమి డీఎన్ఏను దెబ్బ తీస్తుంది. అందువల్ల వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుందని ఇక్కడి అధ్యయనకారులు వివరిస్తున్నారు.

మంచి నిద్రకు కొన్ని చిట్కాలు

  • తగినంత వ్యాయామం లేకపోతే నిద్ర సరిగా పట్టకపోవచ్చు. కనుక క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి
  • స్క్రీన్ టైం ప్రభావం నిద్ర మీద నేరుగా ఉంటుంది. కనుక అవసరానికి మించి స్క్రీన్ వాడకూడదు.
  • రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
  • నిద్రలేమితో బాధ పడే వారు సాయంత్రం పూట కాఫీ వంటి కెఫిన్ కలిగిన పదార్థాలు తీసుకోవద్దు.
  • పొగతాగే అలవాటుకు దూరంగా ఉండాలి.
  • నిద్రకు ఉపక్రమించే ముందు ఏదైనా పుస్తకం చదవడం లేదా లేదా మంద్ర స్థాయిలో సంగీతం వినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
  • అన్నింటికంటే ముందు ఒత్తిడి తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉండేందుకు యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చెయ్యడం మంచిది.

Aslo read : అద్భుతం - పంది కిడ్నీతో రోగికి ప్రాణం పోసిన వైద్యులు - ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైమ్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget