అన్వేషించండి

Amla Seeds: వ్యర్థం నుండి అమూల్యం వరకు.. ఉసిరి గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!

Patanjali: ఒకప్పుడు పనికిరానివిగా పారేసిన ఉసిరి గింజలు ఇప్పుడు ఎంతో విలువైనవిగా మారాయి. ఎస్.సి.ఎఫ్.ఇ పద్ధతి ద్వారా తీసిన ఉసిరి గింజల నూనె హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుందని పతంజలి వెల్లడించింది.

Amla Seeds:
రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మం, జుట్టు, జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. ఆయుర్వేదంలో దీనిని అమృతఫలం అని పిలుస్తారు. ఉసిరి కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి గ్రంథాలు కూడా వివరిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు పనికిరానివిగా భావించి పారేస్తున్న ఉసిరి గింజల వెనుక దాగి ఉన్న విలువను ఎప్పుడైనా గమనించారా?

స్వామి రామ్ దేవ్ జీ, ఆచార్య బాలకృష్ణ జీ మార్గదర్శకత్వంలో పతంజలి రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఉసిరి గింజలకు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని నిరూపించారు. ఈ పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఉసిరి గింజల నుండి సేకరించిన నూనె వ్యాధులతో పోరాడగలదని ఈ అధ్యయనం ద్వారా తేలింది. ఇందుకోసం సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ ఎక్స్‌ట్రాక్షన్ అనే సరికొత్త సాంకేతికతను వాడారు.

 పర్యావరణ హితమైన సేకరణ పద్ధతి 

ఇది ఎటువంటి హానికరమైన రసాయన ద్రవాలను వాడని పర్యావరణ అనుకూల సాంకేతికత. సాధారణంగా నూనె తీసే పద్ధతుల్లో వాడే రసాయనాలు నూనె నాణ్యతను తగ్గిస్తాయి. కానీ ఈ కొత్త పద్ధతిలో కార్బన్ డయాక్సైడ్ (CO₂) వాడతారు. ఆ వాయువును మళ్లీ వెలికితీసి తిరిగి వినియోగించుకోవచ్చు. దీనివల్ల నూనెలోని సహజ పోషకాలు దెబ్బతినకుండా పూర్తి స్వచ్ఛంగా ఉంటాయి.

ఈ నూనెపై చేసిన పరిశోధనల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. వాంతులు, విరేచనాలు కలిగించే ఈ-కోలి  , న్యుమోనియాకు కారణమయ్యే కె.న్యుమోనియా అనే బ్యాక్టీరియాలపై ఈ నూనె సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాలు తమ చుట్టూ బయోఫిల్మ్ అనే జిగట పొరను ఏర్పరచుకుని రక్షణ పొందుతాయి.

యాంటీబయోటిక్స్ కూడా లొంగని చోట.. 

ఈ రక్షణ పొర ఎంత బలంగా ఉంటుందంటే సాధారణ యాంటీబయోటిక్ మందులు కూడా దీనిని ఛేదించలేవు. కానీ ఉసిరి గింజల నూనె ఈ పొరను విచ్ఛిన్నం చేసి బ్యాక్టీరియా రక్షణ కవచాన్ని దెబ్బతీస్తుందని పరిశోధనలో తేలింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నూనె మానవ శరీరానికి పూర్తి సురక్షితం.

అమెస్ అస్సే  పరీక్ష ద్వారా ఈ నూనె జన్యువులకు ఎటువంటి హాని చేయదని, విషరహితమైనదని ధృవీకరించారు. కళ్లు, చెవులు, చర్మ వ్యాధులకు కారణమయ్యే పి.ఎరుగినోసా అనే బ్యాక్టీరియాపై కూడా ఈ నూనె అద్భుతంగా పనిచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బ్యాక్టీరియాను యాంటీబయోటిక్ మందులకు లొంగనిదిగా ప్రకటించింది. అయితే ఉసిరి నూనెలోని లినోలెనిక్ యాసిడ్ ఈ బ్యాక్టీరియా కమ్యూనికేషన్ వ్యవస్థను  దెబ్బతీసి దాని బలాన్ని తగ్గించింది.

సి.ఎలిగాన్స్ అనే జీవులపై చేసిన ప్రయోగాల్లో కూడా సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ నూనె వాడిన తర్వాత ఆ జీవుల ఆయుష్షు పెరగడమే కాకుండా అవి మరింత ఆరోగ్యంగా, చురుగ్గా మారాయి. పతంజలి చేసిన ఈ రెండు పరిశోధనలు ఎల్సెవియర్ ప్రచురించే అప్లైడ్ ఫుడ్ రీసెర్చ్ అనే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఒకే సంచికలో రెండు పరిశోధన పత్రాలు ప్రచురితం కావడం పతంజలితో పాటు భారతదేశానికి గర్వకారణం.

 యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ముప్పుకు పరిష్కారం 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాంటీబయోటిక్ మందులు పని చేయని పరిస్థితి  పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఉసిరి గింజల నూనె వంటి సహజ సిద్ధమైన పరిష్కారం ఎంతో కీలకం. బయోఫిల్మ్‌ను తొలగించే సామర్థ్యం దీనికి ఉండటం వల్ల ఇది సమర్థవంతమైన ఔషధంగా నిలుస్తోంది.

భవిష్యత్తులో ఈ నూనె ద్వారా చర్మ వ్యాధులు, జుట్టు రాలడం, మొటిమల చికిత్సకు కొత్త మందులు లేదా క్రీమ్ లు తయారు చేసే అవకాశం ఉంది. హెర్బల్ శానిటైజర్లు, సబ్బుల్లో కూడా దీనిని వాడవచ్చు. ఉసిరి గింజలపై జరిగిన ఈ పరిశోధన కేవలం శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, మన ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు. రసాయన మందుల వెనుక పరుగులు తీస్తున్న ప్రపంచానికి ప్రకృతిలోనే గొప్ప పరిష్కారాలు ఉన్నాయని పతంజలి నిరూపించింది.

ఒకప్పుడు పనికిరాని వ్యర్థాలుగా భావించిన ఉసిరి గింజలు ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టిలో ఎంతో విలువైనవిగా మారాయి. సంప్రదాయం, విజ్ఞానం కలిసి నడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఈ పరిశోధన చాటిచెప్పింది. ప్రకృతి ఒక గొప్ప ప్రయోగశాల అని, ప్రతి మొక్క ఒక ఔషధమని ఇది మరోసారి నిరూపించింది. అందుకే ఇకపై ఉసిరి కాయ తిన్నప్పుడు దాని గింజలను తక్కువగా చూడకండి.
   
 Disclaimer: This is a sponsored article. ABP Network Pvt. Ltd. and/or ABP Live do not endorse/subscribe to its contents and/or views expressed herein. All information is provided on an as-is basis. The information does not constitute a medical advice or an offer to buy. Consult an expert advisor/health professional before any such purchase. Reader discretion is advised.  

టాప్ హెడ్ లైన్స్

Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Embed widget