అన్వేషించండి

మైండ్‌కు పాస్‌వర్డ్ పెట్టండి- హ్యాకర్లను బ్లాక్ చేసి, సంతోషాన్ని లాక్ చేయండి!

CBT Telugu:మీ బ్యాంక్ అకౌంట్‌కి, మీ ఫోన్‌కి పాస్‌వర్డ్ లేకపోతే ఏమవుతుందో అందరికీ తెలిసిందే. కానీ అంతకంటే ముఖ్యమైన మీ మైండ్‌కి కూడా పాస్‌వర్డ్ ఉండాలి. లేకంటే మీ మానసిక ప్రశాంతత, సంతోషం హ్యాక్ అవుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మనస్సుకి పాస్‌వర్డ్‌ లేకపోతే, నెగటివ్ ఆలోచనలు, ఒత్తిడి హ్యాక్ చేస్తాయి.
  • మానసిక రక్షణ వ్యవస్థ ‘మెంటల్ బౌండరీస్’ ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • మానసిక ఆరోగ్యానికి ‘మెంటల్ బౌండరీస్’ సెల్ఫ్-కేర్‌, బర్నౌట్‌ను తగ్గిస్తాయి.
  • మైండ్‌కు పాస్‌వర్డ్‌ కోసం ధ్యానం, ఆలోచనల ఫిల్టరింగ్ అవసరం.

CBT Telugu: మీ మొబైల్ ఫోన్‌ను ఒక నిమిషం పాటు లాక్ లేకుండా ఉంచండి. మీ డేటా, ప్రైవసీ, బ్యాంకు వివరాలు క్షణాల్లో వేరేవాళ్లకు చేరిపోతాయి. అందుకే మనం అలాంటి ముఖ్యమైన గాడ్జెట్స్‌కు లాక్‌ చేస్తాం. మరి మీ మైండ్ సంగతి ఏంటి? ఇది మీ జ్ఞాపకాలు, కలలు, భావోద్వేగాలు, రహస్యాలు – అన్నీ స్టోర్ చేసే అతి పెద్ద ‘క్లౌడ్ స్టోరేజ్’కి ‘పాస్‌వర్డ్’ పెట్టుకోకపోతే ఎలా? 

తాజాగా సైకాలజీ ప్రపంచంలో పెరుగుతున్న హెచ్చరిక ఏమిటంటే నెగటివ్ ఆలోచనలు, బాహ్య ఒత్తిడి లాంటి ‘హ్యాకర్లు’ లోపలికి చొరబడి మీ సంతోషాన్ని హ్యాక్ చేస్తున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని క్రాష్ చేస్తున్నాయి. మేయో క్లినిక్ రీసెంట్ స్టడీ ప్రకారం, ‘మైండ్ పాస్‌వర్డ్’ లేనివారు 40% ఎక్కువ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మంది మానసిక సమస్యలతో పోరాడుతున్నారంటే, అందులో చాలా మందికి మైండ్ ప్రొటెక్షన్ లేకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు.

మైండ్‌కు పాస్‌వర్డ్ అంటే డిజిటల్ కోడ్ కాదు. ఇది మన మానసిక రక్షణ వ్యవస్థ – ‘మెంటల్ బౌండరీస్’. ఈ బౌండరీలను అర్థం చేసుకోవడం, సెట్ చేయడం ద్వారా, మనం ఉద్యోగంలో బర్నౌట్‌ను తగ్గించుకోవచ్చు, సంబంధాలను ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు, మన జీవితాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.  

సైకలాజికల్ ఫైర్‌వాల్: ఏంటీ ఈ ‘మెంటల్ బౌండరీస్’?

మనస్సుకి పాస్‌వర్డ్ అనేది ఒక రహస్య కోడ్ కాదు; అది ‘మెంటల్ బౌండరీస్’. ఈ హద్దులు మన అవసరాలను ప్రయారిటైజ్ చేసి, ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడానికి సహాయపడతాయి. మేయో క్లినిక్ హెల్త్ సిస్టమ్ ప్రకారం, ఇవి అనవసరమైన కనెక్షన్‌లను నివారించి, మన సంబంధాలను ఆరోగ్యకరంగా మారుస్తాయి.

ఈ భావన వెనుక ఉన్న బలమైన సైన్స్ ‘కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ’. సీబీటీ సిద్ధాంతం ప్రకారం, నెగటివ్ ఆలోచనలు ‘వైరస్‌’లు వంటివి, వాటిని బ్లాక్ చేయడానికి ఈ బౌండరీస్ ‘ఫైర్‌వాల్’లా పనిచేయాలి. డా.ఎలిజబెత్ ఎలియట్, హార్వర్డ్ సైకాలజిస్ట్, మన మైండ్‌ను ఒక బ్యాంక్‌తో పోల్చారు: "పాస్‌వర్డ్ లేకపోతే, ఎవరైనా లోపలికి వచ్చి మన ఆస్తులను దోచుకుంటారు". ఇందులో కూడా అలానే జరుగుతుందని చెబుతారు. 

ఉదాహరణకు: మీరు ఏదైనా అనుకున్నప్పుడు పక్కన ఉండే వాళ్లు అది అవ్వదమ్మా అంటే  

• పాస్‌వర్డ్ ఉంటే: మీరు "ఇది అతని వ్యూ, నా రియాలిటీ కాదు" అని ఆలోచిస్తారు. ఆ నెగటివిటీ మీ ఆత్మవిశ్వాసాన్ని క్రాష్ చేయకుండా బ్లాక్ చేస్తారు.

• పాస్‌వర్డ్ లేకపోతే: ఆ మాటలు నేరుగా మీ మైండ్‌లోకి చేరి, "నేను ఫెయిల్యూర్" అనే ఆలోచనను సృష్టించి, మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ (APA) స్టడీ ప్రకారం, ఈ మెంటల్ బౌండరీస్ సెల్ఫ్-కేర్‌లో భాగమని, ఇవి వర్క్‌ప్లేస్ బర్నౌట్‌ను 30% వరకు తగ్గిస్తాయి.

పాస్‌వర్డ్ లేని మైండ్: విధ్వంసకర నష్టాలు

మైండ్‌కు పాస్‌వర్డ్ లేకపోతే, అది ‘ఓపెన్ బుక్’లా మారిపోతుంది. దీని వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా భారీ నష్టాలు జరుగుతాయి. బౌండరీస్ లేకపోతే స్ట్రెస్, బర్నౌట్, రిలేషన్‌షిప్ సమస్యలు తప్పవు.

1. తీవ్రమైన మానసిక ఒత్తిడి: నెగటివ్ కామెంట్లు, విమర్శలు నేరుగా లోపలికి చేరడం వల్ల రోజూ టెన్షన్ పెరుగుతుంది. పాస్‌వర్డ్-లేని మైండ్‌లు 30% ఎక్కువ ఆంక్షైటీకి గురవుతాయని స్టడీలు చెబుతున్నాయి.

2. డిప్రెషన్, లో సెల్ఫ్-ఎస్టీమ్: 'కంపారిజన్ వైరస్' వల్ల మైండ్ డార్క్ అవుతుంది, మెంటల్ హెల్త్ ఇష్యూస్ రెండింతలు పెరుగుతాయని మెడ్‌సర్కిల్ రిపోర్ట్ చేసింది.

3. ఫిజికల్ హెల్త్ డ్యామేజ్: అధిక స్ట్రెస్ వల్ల స్లీప్‌లెస్‌నెస్, హై బ్లడ్ ప్రెషర్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. WHO ప్రకారం, 70% మానసిక సమస్యలు చివరికి ఫిజికల్ డిసీజ్‌లకు దారితీస్తాయి.

4. ఆర్థిక -వృత్తిపరమైన నష్టం: ప్రొడక్టివిటీ తగ్గి, జాబ్ మారాల్సి వస్తుంది. అమెరికాలో మానసిక ఒత్తిడి వల్ల సంవత్సరానికి $300 బిలియన్‌లు నష్టం వస్తుండగా, భారతదేశంలో 2024లో 15% ఉద్యోగులు స్ట్రెస్ కారణంగా జాబ్‌లు మారుతున్నారు.

5. రిలేషన్‌షిప్ డ్రామా: బౌండరీస్ లేకపోతే మానిప్యులేటివ్ వ్యక్తుల వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. అలాగే, మన వ్యక్తిగత భావాలు సులభంగా బయటకు వచ్చే ముప్పు, సున్నితంగా మారడం, ఇన్‌సెక్యూరిటీలు పెరుగుతుంది.

మైండ్‌కు పాస్‌వర్డ్ సెటప్: 5 సూపర్‌-సింపుల్ స్టెప్స్

మీ మైండ్‌కు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవడానికి, ఈ ఐదు సులభ దశలు పాటించండి:

1.మైండ్ లాక్: రోజూ కనీసం 10 నిమిషాలు కళ్లు మూసుకుని, మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మైండ్‌ను 'లాక్ మోడ్'లోకి పంపి, స్ట్రెస్‌ను 40% తగ్గిస్తుంది. మైండ్‌ఫుల్ హెల్త్ సొల్యూషన్స్ చెబుతోంది. ట్రై చేయండి: ఉదయం కాఫీ తాగుతూ, "నేను స్ట్రాంగ్, పాజిటివ్!" అని మీ మనసులో అనుకోండి.

2. ఆలోచనల ఫిల్టర్: నెగటివ్ థాట్ రాగానే, వెంటనే "హోల్డ్ ఆన్!" లేదా "స్టాప్!" అని చెప్పి, ఆ ఆలోచన నిజామా కాదా అని ఎవిడెన్స్‌తో చాలెంజ్ చేయండి. హెల్త్‌లైన్ ప్రకారం, ఈ కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ నెగటివ్ ప్యాటర్న్స్‌ను బ్రేక్ చేస్తుంది. ఉదాహరణ: "నేను ఏమీ చేయలేను" అనుకుంటే, "గతంలో నేను ఆ ప్రాజెక్ట్ సక్సెస్ చేశాను" అని పాజిటివ్‌తో రీప్లేస్ చేయండి.

3. బౌండరీ బిల్డర్ : బయట నుంచి వచ్చే వాటి ప్రభావాన్ని తగ్గించండి. సోషల్ మీడియా వాడకాన్ని రోజుకు 30 నిమిషాలు లేదా 1 గంటకు మాత్రమే పరిమితం చేయండి. నెగటివ్ గ్రూప్‌లు లేదా వ్యక్తులను మ్యూట్ చేయడం ద్వారా మీ మైండ్‌ను క్లీన్ స్పేస్‌గా ఉంచుకోవాలి. మీరు "ఇంతవరకే బయటకి" అని 'సైకలాజికల్ బౌండరీ' గీయాలి.

4. ఎమోషనల్ ఎడిటింగ్: మీ వ్యక్తిగత బాధలు, గోల్స్ లేదా సీక్రెట్‌లను ఎవరికైనా చెప్పే ముందు మూడుసార్లు ఆలోచించండి: వారు నమ్మదగినవారేనా ?. ఆ విషయం బయటకు వెళితే మీ కుటుంబానికి లేదా కెరీర్‌కు హాని చేస్తుందా అని ‘మెంటల్ గేట్‌వే’లో చెక్ చేయండి.

5. ప్రో హెల్ప్: రోజూ 5 నిమిషాలు డైరీలో రాసుకోండి: "ఈ రోజు నెగటివ్ ఏమిటి? పాజిటివ్ రీప్లేస్ ఏమిటి?". ఈ సెల్ఫ్-రిఫ్లెక్షన్ టెక్నిక్ నెగటివ్ ఆలోచనలను గుర్తించి, వైరస్‌లను డిలీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అవసరమైతే, హెడ్‌స్పేస్, కాల్మ్ వంటి మెడిటేషన్ యాప్‌లు లేదా CBT థెరపీ ద్వారా నిపుణుల సహాయం తీసుకోండి.

మీ మైండే మీ అతి పెద్ద ఆస్తి

కరోనా తర్వాత మానసిక సమస్యలు 25% పెరిగాయి. ఈ వేగవంతమైన ప్రపంచంలో, మీ మైండ్‌ను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇక లగ్జరీ కాదు, అది అత్యవసరం. "మైండ్ మీకున్న అతి పెద్ద ఆస్తి. దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే, మీ జీవితం హ్యాక్ అవుతుంది". మీ మైండ్ సురక్షితంగా ఉంటేనే, మీ జీవితంలో నిజమైన శాంతి సాధ్యమవుతుంది..

Frequently Asked Questions

మనస్సుకి పాస్‌వర్డ్ అంటే ఏమిటి?

మనస్సుకి పాస్‌వర్డ్ అనేది డిజిటల్ కోడ్ కాదు. ఇది మన మానసిక రక్షణ వ్యవస్థ, దీనిని 'మెంటల్ బౌండరీస్' అంటారు. ఇవి మన అవసరాలను ప్రాధాన్యతనిచ్చి, ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడానికి సహాయపడతాయి.

మెంటల్ బౌండరీస్ లేకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

మెంటల్ బౌండరీస్ లేకపోతే తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, శారీరక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, మరియు సంబంధాలలో సమస్యలు ఏర్పడతాయి.

మనస్సుకి పాస్‌వర్డ్ సెటప్ చేయడానికి సులభమైన మార్గాలు ఏమిటి?

మనస్సుకి పాస్‌వర్డ్ సెటప్ చేయడానికి రోజూ ధ్యానం చేయడం, నెగటివ్ ఆలోచనలను ఫిల్టర్ చేయడం, సోషల్ మీడియా వాడకాన్ని పరిమితం చేయడం, వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఆలోచించడం, మరియు అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం వంటివి చేయవచ్చు.

మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ఆలోచనల ప్రభావం ఏమిటి?

ప్రతికూల ఆలోచనలు 'హ్యాకర్లు' లాగా మన సంతోషాన్ని, మానసిక ఆరోగ్యాన్ని హ్యాక్ చేస్తాయి. ఇవి ఆందోళన, ఒత్తిడి, మరియు డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
AP Health Survey: ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు
ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు
Milk Purity Checks at Home : పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి
పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Akvan Cyclone: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం.. సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష!
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
DNK Collections : మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
మౌళి DNK ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాకు మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?
Bhimavaram Municipal Elections: భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
భీమవరం మున్సిపల్ పోరు.. నన్ను కాదు, బీజేపీని అవమానించారు! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Electric Aircraft: ఇంధనం అవసరం లేని ఎలక్ట్రిక్‌ విమానం రెడీ.. 60 కి.మీ. ప్రయాణించిన COMAC CE-25A ప్రత్యేకతలివే!
ఇప్పుడు ఎలక్ట్రిక్‌ విమానం వంతు.. 16 నిమిషాల్లో సక్సెస్‌ఫుల్‌గా 60 కి.మీ. ప్రయాణం
India Myanmar Naval Exercise: విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
విశాఖపట్నంలో ఆకట్టుకున్న 8వ ఎడిషన్ భారత్- మయన్మార్ నావికాదళ విన్యాసాలు
Embed widget