అన్వేషించండి

అతిగా దాహం వేస్తోందా? వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి, సమస్య ముదిరితే కష్టమే!

షుగర్ ను సైలెంట్ కిల్లర్ అంటుంటారు. సమస్య మొదలైన కొత్తలో పెద్దగా లక్షణాలు కనిపించవు. అందువల్ల గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఈ జాప్యం వల్ల చికిత్స ప్రారంభించడం కూడా ఆలస్యం అవుతోంది.

ఎన్ని సార్లు నీళ్లు తాగినా తనివి తీరడం లేదా? ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదా? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. ఎందుకంటి.. అతిగా దాహం వేయడం డయాబెటిస్‌కు సంకేతం కావచ్చు. 

డయాబెటిస్‌తో బాధితుల్లో సాధారణంగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇది ఈ పాండమిక్ రోజుల్లో చాలా ప్రమాదకరం కావచ్చు. అంతేకాదు అదుపులో లేని బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు.

టైప్ 2 డయాబెటిస్ బారిన పడిన తర్వాత కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా 10 సంవత్సరాల వరకు సాధారణ జీవితం గడపడం సాధ్యమే. పాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ తయారు చెయ్యలేకపోయినా లేదా తయారైన ఇన్సులిన్ క్రీయాశీలంగా లేకపోయినా ఆ స్థితిని టైప్ 2 డయాబెటిస్ అంటారు. ఇలా ఇన్సులిన్ తగినంత లేకపోయినా లేదా ఇన్సులిన్ సరిగా పనిచెయ్యక పోయినా రక్తంలోని గ్లూకోజ్ శక్తిగా మారదు. ఫలితంగా శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతాయి. ఇది శరీరంలోని ముఖ్యమైన అన్ని అవయవాలకు ప్రమాదకరంగా మారుతుంది. 

గమనించాల్సిన ముఖ్య లక్షణాలు

  • ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి రావడం, ముఖ్యంగా రాత్రిపూట
  • త్వరగా అలసిపోవడం
  • ఎలాంటి ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం
  • జననేంద్రియాల దగ్గర దురద గా ఉండడం 
  • చిన్న గాయాలైనా త్వరగా మానకపోవడం
  • కంటి చూపులో స్పష్టత లోపించడం

ఇవి కూడా ఉండొచ్చు

  • డార్క్ స్కిన్ ప్యాచెస్
  • త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడడం
  • చర్మం మీద అకారణంగా దురదలు
  • నోరు తరచుగా ఎండి పోవడం
  • చికాకుగా ఉండడం
  • శ్వాస ఒకరకమైన తీపి వాసన రావడం
  • నోటి దుర్వాసన
  • వంటి లక్షణాలు కూడా కొందరిలో అరుదుగా కనిపిస్తాయి.

పెరుగుతున్న డయాబెటిస్ రోగులు

ఇది వరకటి రోజుల్లో మధ్య వయస్కుల్లోనే డయాబెటిస్ రోగులు కనిపించేవారు. కానీ ఇప్పుడు యువకుల్లో సైతం ఈ సమస్య ఎక్కువగానే కనిపిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. 1990 నుంచి 2019 వరకు జరిపిన గణాంకాలలో 1990ల్లో ప్రతి లక్ష మంది డయాబెటిక్ రోగుల్లో 117 మంది 30 సంవత్సరాల లోపు వారు ఉన్నారు. కానీ ఈ సంఖ్య 2019 నాటికి 183 కి చేరింది. అంటే దాదాపు 56.4 శాతం పెరుగుదల ఉందని అర్థం. ఈ స్థితి సమాజానికి అంత మంచిది కాదు. యువకుల్లో పెరుగుతున్న డయాబెటిక్ రోగుల వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇది సమాజం మీద భారంగా పరిణమిస్తోందని గుర్తించాలి. ఇందకు కారణం తీసుకుంటున్న ఆహారం, పనివేళలు, పనిచేసే తీరు, పెరగిన ఒత్తిడి, సెడంటరీ లైఫ్ స్టయిల్ ఇలా రకరకాల కారణాలు ఉంటున్నప్పటికి నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు త్వరగా గుర్తించే అవగాహన కూడా అవసరమని కొత్త గణాంకాలు తేల్చి చెబుతున్నాయి.

Also Read: ఈ టైమ్‌లో నిద్రపోయారంటే గుండెకి ఏ ఢోకా ఉండదు

టాప్ హెడ్ లైన్స్

Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
HIV And Health Risks : HIV ఉన్నవారికి వయసు పెరిగే కొద్దీ ఈ ఐదు ఆరోగ్య సమస్యల ముప్పు తప్పదంటోన్న వైద్యులు.. జాగ్రత్త
HIV ఉన్నవారికి వయసు పెరిగే కొద్దీ ఈ ఐదు ఆరోగ్య సమస్యల ముప్పు తప్పదంటోన్న వైద్యులు.. జాగ్రత్త
Dengue Diet : డెంగ్యూ వచ్చినప్పుడు భోజనం చేయకూడదా? ఎలాంటి ఫుడ్ తినాలి.. ఏవి తినకూడదు? WHO సూచనలు ఇవే
డెంగ్యూ వచ్చినప్పుడు భోజనం చేయకూడదా? ఎలాంటి ఫుడ్ తినాలి.. ఏవి తినకూడదు? WHO సూచనలు ఇవే
Winter Diet for Diabetics : మీకు షుగర్ ఉందా? చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు?
మీకు షుగర్ ఉందా? చలికాలంలో డయాబెటిస్ ఉన్నవారు ఏమి తినాలి.. ఏమి తినకూడదు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
Embed widget