అన్వేషించండి

Covid-19 R Factor: భారత్‌లో కరోనా R- ఫ్యాక్టర్‌పై ఆందోళన.. కేరళతోనే ముప్పు, వైద్య నిపుణుల హెచ్చరికలు

దేశంలో కరోనా ఆర్- ఫ్యాక్టర్ మళ్లీ పెరిగింది. ప్రస్తుతం ఇది 1 చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కరోనా ఇన్ ఫెక్షన్ వ్యాప్తిని తెలియేజేస్తోంది. కేరళలో అత్యధికంగా 1.11గా ఆర్ ఫ్యాక్టర్ ఉంది.

దేశంలో కొవిడ్-19 వ్యాప్తిని తెలియజేసే ఆర్‌-ఫ్యాక్టర్‌ (రీ ప్రొడక్షన్‌ రేట్‌) క్రమేపీ పెరుగుతోంది. ఇది 1కి చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా కేరళతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మెట్రో నగరాలైన పుణె, ఢిల్లీల్లోనూ ఆర్‌-ఫ్యాక్టర్‌ పెరుగుతున్నట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు తెలిపారు.

  1. దేశంలో కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి అత్యంత తీవ్రదశలో ఉన్నప్పుడు (మార్చి 9 - ఏప్రిల్‌ 21 మధ్య) ఆర్‌-ఫ్యాక్టర్‌ 1.37గా ఉండేది.
  2. అనంతరం క్రమేపీ తగ్గుతూ మే 15 - జూన్‌ 26 మధ్య కాలంలో 0.78కి చేరింది. జులై నెలలో మళ్లీ పెరుగుదల మొదలైంది.
  3. జులై 3 - 22 మధ్య కాలంలో ఇది ఏకంగా 0.95కి పెరగడం ఆందోళన పెంచుతోంది.

కొవిడ్‌-19 బారిన పడిన వారి నుంచి ఈ ప్రాణాంతక వైరస్‌ ఇతరులకు సంక్రమించే తీరును ఆర్‌-ఫ్యాక్టర్‌ తెలుపుతుంది. ఉదాహరణకు ఇది 0.95 ఉందంటే.. కొవిడ్‌ సోకిన ప్రతి 100 మంది ద్వారా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ మరో 95 మందికి సోకుతుందని అర్థం. అదే 1 దాటితే పరిస్థితి తీవ్రమవుతుంది.

కేరళలో ఆర్‌-ఫ్యాక్టర్‌ ఏకంగా 1.11కి పెరిగింది. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్‌ మినహా మిగిలిన అన్నిచోట్ల ఇది 1 దాటింది. మణిపూర్‌లో కూడా 1కి చేరువగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో వచ్చే రెండు వారాల్లో కొవిడ్‌ వ్యాప్తి ఈ ప్రాంతాల్లో పెరిగే ప్రమాదం ఉందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ బృందానికి నేతృత్వం వహిస్తున్న సితభ్ర సిన్హా తెలిపారు.

ప్రత్యేక బృందం

దేశంలోని మొత్తం కరోనా యాక్టివ్ కేసుల్లో 37 శాతం (1.54 లక్షలు) ఉన్న కేరళకు కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని పంపుతోంది. వ్యాధుల నియంత్రణ జాతీయ కేంద్రం (ఎన్‌సీడీసీ) డైరెక్టర్‌ ఎస్‌.కె.సింగ్‌ నేతృత్వంలోని ఈ బృందం శుక్రవారం కేరళకు చేరుకొని కోవిడ్19 పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పర్యటిస్తుంది.

వరుసగా మూడో రోజు (గురువారం) కేరళలో 22 వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఏకంగా 13.53 శాతం నమోదైంది. కేరళ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులతో కరోనా థర్డ్ వేవ్ ముప్పు వచ్చే అవకాశాలు సైతం ఉన్నాయని దేశీయ వైద్య నిపుణులు అలర్ట్ చేస్తున్నారు.

డెల్టా వేరియంట్..

దేశంలో కరోనా కేసులు పెరగడానికి డెల్టా వేరియంట్ విజృంభణ కూడా ఓ కారణమని తెలిసిందే. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో చాలా వరకు డెల్టా వేరియంట్ ద్వారా నమోదైనవేనని తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతన్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్19 నిబంధనలు తప్పక పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలను లైట్ తీసుకుంటే మూడో వేవ్ మరింత ప్రమాదకరంగా ఉండొచ్చని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి.

ALSO READ:

Prashant Kishor Congress: 2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు.. పార్టీలోకి ప్రశాంత్ కిషోర్!

టాప్ హెడ్ లైన్స్

Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Watering Tulsi Plant : తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా ఉండాలంటే ఈ నియమాలు పాటించండి.. రోజూ నీరు పోయడం మంచిదేనా?
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Embed widget