Covid 19 India: దేశంలో మళ్లీ పంజా విసురుతున్న కరోనా.. రెండు రోజులుగా పెరుగుతున్న కేసుల సంఖ్య
దేశంలో తగ్గినట్టే తగ్గి కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొత్తగా పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
LIVE
Background
దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటికి మొన్న నలభై వేల లోపు రిజిస్టరైన పాజిటివ్ కేసులు ఇప్పుడు మళ్లీ ఎగబాకుతున్నాయి. గత 24 గంటల్లో 41 వేల 195 కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి. 490 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో చెప్పింది. కొత్త వెలుగు చూసిన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3, 20, 77, 706కి పెరిగింది.
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలివే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 1,859 కరోనా కేసులు నమోదవ్వగా 13 మంది మరణించారు. కరోనా నుంచి 1,575 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 18,688 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 70,757 మందికి కరోనా పరీక్షలు చేశారు
కేంద్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) August 12, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/mv7iMRjVyo pic.twitter.com/S5tqb6HxlB
అత్యధికం కేరళలోనే..
కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం కేరళలో ఉన్నాయి. కేరళలో 23,500, మహారాష్ట్రలో 5,560, ఆంధ్రప్రదేశ్‌లో 1869, తమిళనాడులో 1964, కర్ణాటకలో 1826, పశ్చిమబెంగాల్‌లో 639 కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 48.73 కోట్లకు పైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
దేశంలో 41,195 కోవిడ్ కేసులు
దేశంలో కోవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 41,195 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ బారిన పడిన వారిలో 490 మంది మరణించారని తెలిపింది. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 4,29,669కి పెరిగింది. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి (రికవరీ) రేటు 97.45 శాతంగా ఉందని తెలిపింది.