అన్వేషించండి

Fact Check: రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదని చంద్రబాబు అన్నారా? - ఆ వీడియోలో నిజం ఎంతంటే?

Chandrababu: టీడీపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర జరుగుతోంది అని చంద్రబాబు అన్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతుండగా 'ఫ్యాక్ట్‌లీ' అది ఎడిటెడ్ వీడియో అని నిర్ధారించింది.

Factly Clarity Chandrababu Video On Reservations: 'టీడీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర జరుగుతుంది' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ‘ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అందించినా ఏం లాభం జరిగింది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవితాలు మారాయా?’ అని చంద్రబాబు అన్నట్లు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే, 'ఫ్యాక్ట్‌లీ' ఈ వీడియోకు సంబంధించి స్పష్టత ఇచ్చింది.
Fact Check: రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదని చంద్రబాబు అన్నారా? - ఆ వీడియోలో నిజం ఎంతంటే?

క్లెయిమ్: ఇన్నేళ్లుగా రిజర్వేషన్లు ఇచ్చి సాధించింది ఏంటి.?. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదు – చంద్రబాబు నాయుడు

ఫాక్ట్(నిజం): ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది. 'రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలి, వాటిని విస్మరించలేము. కానీ రిజర్వేషన్లకు మించి ఏదైనా చేయాలి, అప్పుడే సాధికారత సాధించవచ్చు’ అని చంద్రబాబు అన్న వీడియోను ఎడిట్ చేసి అయన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు చిత్రీకరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుగా 'ఫ్యాక్ట్‌లీ' నిర్ధారించింది.
Fact Check: రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదని చంద్రబాబు అన్నారా? - ఆ వీడియోలో నిజం ఎంతంటే?

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ANIతో వివిధ అంశాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో క్లిప్ ఈ ఇంటర్వ్యూ నుంచి సేకరించిందే అని 'ఫ్యాక్ట్‌లీ' తెలిపింది. అయితే, ఈ ఇంటర్వ్యూలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు ఎక్కడా అనలేదు.  ఆయన రిజర్వేషన్లు గురించి మాట్లాడుతూ.. ‘7 దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు అందిస్తూ వచ్చాము. వాళ్ల జీవితాలు ఏమన్నా మారాయా? అందుకే రిజర్వేషన్లకు మించి చేయాల్సి ఉంది. రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలి, వాటిని విస్మరించలేము, కానీ జర్వేషన్లు ఒక్కటే పరిష్కారం కాదు, అంతకు మించి ఏదైనా చేయాలి, అప్పుడే సాధికారత సాధించవచ్చు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను డిజిటల్‌గా ఎడిట్ చేసి చంద్రబాబు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చంద్రబాబు సైతం ఈ వీడియో ఫేక్ అని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను రిజర్వేషన్లపై షేర్ చేసిన అసలు వ్యాఖ్యలను షేర్ చేశారు.

This story was originally published by Factly as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget