అన్వేషించండి

Fact Check సీఎం జగన్ ఆ ఇంగ్లీష్ ప్రశ్న అర్థం కాక సమాధానం దాటేశారా? - అసలు నిజం ఏంటంటే?

False Video On Cm Jagan: సీఎం జగన్ ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లిష్ ప్రశ్న అర్థం కాక దాటవేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతుండగా 'ఫ్యాక్ట్ లీ చెక్' దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇది ఎడిటెట్ వీడియో అని స్పష్టం చేసింది.

Factly Check Clarity On False Video Sharing On Cm Jagan: ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఇంగ్లీష్ లో అడిగిన ప్రశ్న అర్థం కాక ఏపీ సీఎం వైఎస్ జగన్ సమాధానం చెప్పకుండా దాటేశారంటూ ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ క్వశ్చన్ (It's a very lenghty question)' అని సీఎం ఆ ప్రశ్నను దాటేశారనే ఆ వీడియోలో ఉంది. అయితే, ఇది పూర్తిగా ఎడిటెట్ వీడియో అని సీఎం జగన్ ఎక్కడా అలా అనలేదని 'ఫ్యాక్ట్ లీ చెక్' స్పష్టం చేసింది. ఇటీవల ఏప్రిల్ 30, 2024న ప్రసారం అయిన 'ఇండియాటుడే' ఇంటర్వ్యూలోని వీడియో క్లిప్పింగ్ కు, మే 2022లో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జగన్ మాట్లాడిన ఆడియోను చేర్చి ఎడిట్ చేస్తూ.. ఈ వీడియోను రూపొందించినట్లు నిర్ధారించింది.
Fact Check సీఎం జగన్ ఆ ఇంగ్లీష్ ప్రశ్న అర్థం కాక సమాధానం దాటేశారా? - అసలు నిజం ఏంటంటే?

ఇదీ అసలు ఫ్యాక్ట్
Fact Check సీఎం జగన్ ఆ ఇంగ్లీష్ ప్రశ్న అర్థం కాక సమాధానం దాటేశారా? - అసలు నిజం ఏంటంటే?

సీఎం జగన్ ఇంటర్వ్యూకు సంబంధించి పూర్తి వీడియోను 'ఇండియాటుడే' 2024, ఏప్రిల్ 30న తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. 'Election Unlocked: Andhra Pradesh CM Jagan Mohan Reddy Exclusive/ India Today' అనే శీర్షికతో లైవ్ టెలికాస్ట్ చేసినట్లు తేలింది. ఈ వీడియోను పూర్తిగా పరిశీలిస్తే.. వైరల్ వీడియోలోని క్లిప్పింగ్ దృశ్యాలు టైంస్టాంప్ 10:47 వద్ద మొదలై, 11:03 వద్ద ముగుస్తుందని తెలిసింది. వాస్తవంగా, ఈ ఇంటర్వ్యూలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను మార్చడంపై రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం ఇచ్చారు. 'తమ వ్యూహంలో భాగంగా.. తన మీద తనకున్న నమ్మకంతో మార్చాను' అని ఆయన చెప్పారు. ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఎక్కడా వైరల్ వీడియోలో చూపించినట్లుగా 'ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ క్వశ్చన్' అంటూ ఆ ప్రశ్నలను దాటవేయలేదు.

ఆ రెండు ఎడిట్ చేశారు
Fact Check సీఎం జగన్ ఆ ఇంగ్లీష్ ప్రశ్న అర్థం కాక సమాధానం దాటేశారా? - అసలు నిజం ఏంటంటే?

2022, మే 23న 'సాక్షి టీవీ (Sakshi Tv)' తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో 'Cm Ys Jagan Superb Answers At World Economic Forum In Dawos / Sakshi Tv' అనే శీర్షికతో ఓ వీడియో లైవ్ టెలికాస్ట్ చేసింది. ఇది మే, 2022లో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం జగన్ మాట్లాడిన వీడియో. ఈ క్లిప్పింగ్ లోని టైం 02:33 వద్ద మొదలై, 02:35 వద్ద ముగుస్తుంది అని తెలిపింది. ఈ సదస్సులో అడిగిన ఓ సుదీర్ఘ ప్రశ్నకు సమాధానం చెప్తూ సీఎం జగన్.. 'ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ క్వశ్చన్ (It's A Very Lengthy Question)' అని అన్నారు. దీని ప్రకారం ఈ ఆడియోను.. 'ఇండియాటుడే' ఇంటర్వ్యూలోని వీడియోను ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారని 'ఫ్యాక్ట్ లీ' చెక్ నిర్ధారించింది. సీఎం జగన్ ఎక్కడా అలా ప్రశ్నలు దాటవేయలేదని స్పష్టం చేసింది.

This story was originally published by factly.in as part of the Shakti Collective. This story has been edited by ABPDesam staff.

Also Read: Fact Check: 'కన్నడ సెక్స్ స్కాంలో నారా లోకేశ్' అంటూ పేపర్ క్లిప్పింగ్ - అసలు నిజం ఏంటంటే?

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget