Halamithi Habibo Telugu Song: 'అరబిక్ కుతు' సాంగ్ తెలుగు వెర్షన్ విన్నారా?
హలమతి హబిబో సాంగ్ తెలుగు వెర్షన్ ను దర్శకనిర్మాతలు విడుదల చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'బీస్ట్'. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 'డాక్టర్'తో తెలుగులోనూ మంచి విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 'బీస్ట్' సినిమాలో తొలి పాట 'అరబిక్ కుతు'ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేశారు. ఈ పాట ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిలియన్ల వ్యూస్ రాబట్టింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది సెలబ్రిటీలు ఈ పాటకు రీల్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్ ను విడుదల చేశారు. 'బీస్ట్' సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగా సినిమాలో పాటలను, ట్రైలర్ ను ఒక్కొక్కటిగా తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా 'అరబిక్ కుతు' పాటను విడుదల చేశారు. పాటలో తెలుగు పదాలు పెద్దగా లేనప్పటికీ.. ఆల్రెడీ హిట్ సాంగ్ కాబట్టి ఆడియన్స్ కి తెలుగు వెర్షన్ కూడా బాగానే కనెక్ట్ అవుతుంది.
ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, 'దిల్' రాజు, ఏషియన్ సునీల్ నారంగ్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. దీనికోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: నామినేషన్స్ హీట్ - అజయ్, అషులతో హమీద గొడవ
Also Read: రేవ్ పార్టీపై టాస్క్‌ఫోర్స్ దాడులు - బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్
Here is #HalamithiHabibo lyric video from #Beast
— Sri Venkateswara Creations (@SVC_official) April 4, 2022
▶️ https://t.co/yM4glWeKND@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @jonitamusic @manojdft @Nirmalcuts @KiranDrk @srisaikiran2 @raqueebalam @SVC_official #BeastModeON pic.twitter.com/LVyLY6pAeF
View this post on Instagram