(Source: ECI/ABP News/ABP Majha)
Waltair Veerayya OTT Release : 'వాల్తేరు వీరయ్య' ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya Movie). ఇందులో మాస్ మహారాజా రవితేజ ప్రత్యేక పాత్ర చేశారు. సంక్రాంతి కానుకగా ఈ రోజు థియేటర్లలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ఏ ఓటీటీ వేదిక సొంతం చేసుకుందో తెలుసా?
నెట్‌ఫ్లిక్స్‌లో 'వాల్తేరు వీరయ్య'
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో 'వాల్తేరు వీరయ్య' స్ట్రీమింగ్ కానుంది. నేడు థియేటర్లలో ఆ విషయాన్ని వెల్లడించారు. డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ నెట్‌ఫ్లిక్స్ అని టైటిల్ కార్డ్స్‌లో వేశారు. అయితే... ఎప్పుడు ఓటీటీలో సినిమా విడుదల అవుతుంది? అనేది మాత్రం అనౌన్స్ చేయలేదు. బహుశా... ఆరేడు వారాల తర్వాత డిజిటల్ స్క్రీన్ మీదకు సినిమా వచ్చే అవకాశం ఉంది.
'గాడ్ ఫాదర్' తర్వాత మరోసారి
చిరంజీవి లాస్ట్ సినిమా 'గాడ్ ఫాదర్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సైతం నెట్‌ఫ్లిక్స్ దగ్గరే ఉన్నాయి. గత ఏడాది విడుదలైన ఆ సినిమా నవంబర్ 9న ఓటీటీలో విడుదల అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ రెండు చిరంజీవి సినిమాలను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
యాక్షన్ & సెంటిమెంట్...
యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో బ్రదర్ సెంటిమెంట్‌తో 'వాల్తేరు వీరయ్య'ను కొల్లి బాబీ (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కించారు. వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్ తెరకెక్కించారు. మెగా అభిమానులు మెచ్చేలా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని విమర్శకులు చెప్పే మాట. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే... మౌత్ టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతి సెలవులు ఉండటంతో ఫ్యామిలీలతో కలిసి ప్రజలు థియేటర్లకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో, కలెక్షన్లకు ఢోకా ఉండకపోవచ్చు.
Also Read : పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?
చిరంజీవి సరసన శ్రుతీ హాసన్, రవితేజకు జోడీగా కేథరిన్ నటించిన 'వాల్తేరు వీరయ్య'లో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'బాస్ పార్టీ...'లో ఆమె తళుక్కున మెరిశారు. ప్రకాష్ రాజ్, బాబీ సింహా విలన్ రోల్స్ చేశారు. వాళ్ళిద్దరూ డ్రగ్ డీలర్లుగా కనిపించారు. హీరో తండ్రి పాత్రలో సత్యరాజ్, ఆయన వెంట ఉండే బ్యాచులో శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, 'షకలక' శంకర్, ప్రదీప్ రావత్ కనిపించారు. బావ బామ్మర్ది పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, 'వెన్నెల' కిషోర్ నటించారు.
Also Read : 'వాల్తేరు వీరయ్య' రివ్యూ : మెగాభిమానులకు పూనకాలు గ్యారెంటీనా? మెగాస్టార్ మాస్ మూవీ ఎలా ఉందంటే?
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 'ఖైదీ నంబర్ 150' తర్వాత మరోసారి చిరంజీవి సినిమాకు ఆయన వర్క్ చేశారు. పాటలు స్క్రీన్ మీద బావున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగుకు టైటిల్ సాంగ్ యూజ్ చేయడం బావుందని అందరూ చెబుతున్నారు.
ఈ చిత్రానికి దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందించారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.