అన్వేషించండి

Jai Jai Ganesha Promo: శివాజీ పంచులు, కావ్యా కల్యాణ్ రామ్ టాలెంట్, రష్మీ స్పెషల్ సాంగ్- ఈసారి గణేష్ పండుగంతా ఈటీవీలోనే!

ప్రతి పండుగకు స్పెషల్ షో ప్లాన్ చేసే ఈటీవీ, ఈసారి వినాయక చవితికి ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించబోతోంది. ‘జై జై గణేశా’ పేరుతో రూపొందించిన ఈ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేసింది.

Etv Vinayaka Chavithi Special Event Promo: పండగలు వస్తే చాలు.. బుల్లితెరపై ఓ రేంజిలో సందడి ఉంటుంది. ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు ఆయా చానెళ్లు అదిరిపోయే షోలను ప్లాన్ చేస్తుంటాయి. మిగతా చానెల్స్ ఎలా ఉన్నా, స్పెషల్ షోలను చేయడంలో ఈటీవీ ముందు ఉంటుంది. జబర్దస్త్ కమెడియన్లతో పాటు పలువురు నటీనటులతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. త్వరలో వినాయక చవితి పండుగ వస్తుండటంతో స్పెషల్ షోను ప్లాన్ చేసింది. ‘జై జై గణేశా’ పేరుతో ఈ షోను రూపొందించింది. తాజాగా ఈ స్పెషల్ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది.   

ఆకట్టుకుంటున్న ‘జై జై గణేశా’ ప్రోమో

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ స్పెషల్ షో టెలీకాస్ట్ కానుంది. తాజాగా ప్రోమోలో సీనియర్ హీరోయిన్లు ఇంద్రజ, కుష్బూ సంప్రదాయ దుస్తుల్లో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటిలాగే హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ యాంకర్ గా చేసింది. తన చలాకీ మాటలు, అందచందాలతో ఆకట్టుకుంది. నటుడు శివాజీ, ‘బలగం’ బ్యూటీ కావ్యా కల్యాణ్ రామ్ స్పెషల్ గెస్టులుగా వచ్చారు. కావ్యా కల్యాణ్ రామ్ కీ బోర్డును వాయిస్తూ అందరినీ ఆకట్టుకుంది. తను బాలనటిగా చేసినప్పటి ‘వల్లంగి పిట్ట’ పాటను కీబోర్డు మీద పలికించి అందరి చేత వారెవ్వా అనిపించుకుంది. ఇక జబర్దస్త్ కమెడియన్లు చేసిన కామెడీ, ఒకరిపై మరొకరు వేసుకున్న పంచులు అందరినీ హిలేరియస్ గా నవ్వించాయి. ఈ షోలో భాగంగా నిర్వహించిన ఫన్నీ టాస్కులు కడుపుబ్బా నవ్వించాయి. సరదా సరదాగా సాగిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది.  

ఆకట్టుకుంటున్న రష్మి స్పెషల్ సాంగ్

‘జై జై గణేశా’ ప్రోమోలో స్పెషల్ గా చెప్పుకోవాల్సిన విషయం యాంకర్ రష్మి చేసిన స్పెషల్ సాంగ్. ‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ అనే పాటకు రష్మి అదిరిపోయే డ్యాన్స్ చేసింది. పల్చటి పసుపు రంగు చీర కట్టుకుని మత్తెక్కించే ఎక్స్ ప్రెషన్స్ తో ఆహా అనిపించింది. ఆకుపచ్చని పంట పొలాల నడుమ చిత్రీకరించిన ఈ పాట అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే ఈ పాటలోనూ రష్మి అందాల ఆరబోతతో కుర్రకారును కట్టిపడేసింది. రష్మీ సాంగ్ ‘జై జై గణేశా’ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది.  

రష్మి డ్యాన్స్ కోసమే ‘జబర్దస్త్’ చూస్తున్నానన్న శివాజీ

ఇక ‘జై జై గణేశా’ ప్రోమో చివరల్లో నటుడు శివాజీ రష్మీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ‘జబర్దస్త్’ చూసేదే రష్మి డ్యాన్స్ కోసం అన్నారు. ప్రస్తుతం శివాజీ కామెంట్స్ తో పాటు ‘జై జై గణేశా’ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మొత్తంగా గణేష్ పండగ రోజు ఈటీవీ షో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నట్లు అర్థం అవుతోంది. ఇక ఈ షోకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.  

Read Also: బన్నీపై పవన్‌ అలాంటి కామెంట్స్‌! 'పుష్ప' నిర్మాత స్పందన - బర్త్‌డేకు 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' నుంచి సర్‌ప్రైజ్‌

టాప్ హెడ్ లైన్స్

Maatrubhumi Trailer Review : సల్మాన్ ఖాన్ మాతృభూమి ట్రైలర్ వచ్చేసింది - గల్వాన్ వీరుడి వీరోచిత పోరాటం
సల్మాన్ ఖాన్ మాతృభూమి ట్రైలర్ వచ్చేసింది - గల్వాన్ వీరుడి వీరోచిత పోరాటం
Brahmamudi Serial Today November 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  నందుకు నిజం చెప్పిన వెంకీ – ఇరకాటంలో రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్:  నందుకు నిజం చెప్పిన వెంకీ – ఇరకాటంలో రాజు
Karthika Deepam 2 Serial Today November 11th: కార్తీకదీపం 2 సీరియల్: నిజం బయట పెట్టిన కార్తీక్! ఇన్వెస్టర్ మెడ పట్టుకొని గెంటేసిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: నిజం బయట పెట్టిన కార్తీక్! ఇన్వెస్టర్ మెడ పట్టుకొని గెంటేసిన సూరజ్!
Jagadhatri Serial Today Nov 10:వంశీ వాళ్లను స్టేషన్‌ నుంచి తప్పించేందుకు మీనన్‌ నాటకం..వివేక్‌ ఎత్తులకు పైఎత్తు వేసిన జేడీ
జగద్ధాత్రి సీరియల్:వంశీ వాళ్లను స్టేషన్‌ నుంచి తప్పించేందుకు మీనన్‌ నాటకం..వివేక్‌ ఎత్తులకు పైఎత్తు వేసిన జేడీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురు ప్రయాణికులకు గాయాలు
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురు ప్రయాణికులకు గాయాలు
Sonia Gandhi Book: మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
మోదీతో సిద్ధాంత పరంగానే పోరాటం.. ఇందిరా గాంధీ కోపం చూసి భయపడ్డా - ఆత్మకథలో సోనియా గాంధీ
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
KRMB Letter: శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల అసలు అనుమతుల వివరాలివ్వండి.. తెలంగాణ, ఏపీలకు కేఆర్‌ఎంబీ లేఖ
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
Bigg Boss Season 10 Today November 10th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి 3 ఫ్యామిలీస్! వంశీ కూతురు హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: హోస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి 3 ఫ్యామిలీస్! వంశీ కూతురు హైలెట్!
ఈ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులకు హెచ్చరిక
ఈ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం.. మత్స్యకారులకు హెచ్చరిక
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
Embed widget