Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో విక్రమ్ టీమ్, సల్మాన్ ఖాన్ కూడా
హంగూ, ఆర్భాటం లేకుండా విడుదలై పెద్ద హిట్ కొట్టింది విక్రమ్.

విక్రమ్ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీలో లేటెస్ట్ హిట్. చాలా రోజుల తరువాత కమల్ హాసన్ నటించిన సినిమా. చాలా ఏళ్ల తరువాత ఆయన అందుకున్న హిట్ కూడా ఇదే. తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్లిపోతోంది. తెలుగులో ఈ సినిమాను నిర్మాత సుధాకరరెడ్డి, హీరో నితిన్ కలిసి విడుదల చేశారు. తెలుగులో కూడా భారీ వసూళ్లను సాధిస్తోంది విక్రమ్ మూవీ. ఇందులో కమల్ హాసన్ తో పాటూ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్ నటులు ఉన్నారు. అలాగే చివర్లో మెరుపులా మెరిశాడు హీరో సూర్య.
సినిమా హిట్ కొట్టడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కమల్ హాసన్ హైదరాబాద్ వచ్చారు. ఆయనతో పాటూ సల్మాన్ ఖాన్
కూడా హాజరయ్యారు. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా వచ్చారు. వీరు ముగురినీ తన ఇంటికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. లోక నాయకుడు కమల్ హాసన్ ను శాలువాతో సత్కరించారు. ఈ విందుకు నితిన్ కూడా హాజరయ్యారు.
ఈ విషయాన్ని చిరు స్వయంగా తన ఇన్ స్టా ఖాతాలో రాసుకొచ్చారు. ‘నా ప్రియమైన పాత స్నేహితుడిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విక్రమ్ హిట్ అయిన సందర్భంగా ఆయనతో పాటూ సల్మాన్ ఖాన్, లోకేష్ లను కూడా కలవడం సంతోషంగా ఉంది. నిన్న రాత్రి మా ఇంట్లో విందు ఏర్పాటు చేశాను. అభినందనలు మిత్రమా... నీకు మరింత శక్తి రావాలి’ అంటూ రాసుకొచ్చారు. కమల్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. చిరు అభిమానులు కూడా విక్రమ్ మూవీని తెగ పొగిడేస్తున్నారు.
View this post on Instagram
Also read: శరీరంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో లేకపోతే ఏమవుతుందో తెలుసా? జరిగేది ఇదే
Also read: తరచూ గుండె వేగంగా కొట్టుకుంటోందా? ఇవే కారణాలు కావచ్చు
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















