అన్వేషించండి
Advertisement
Vijay Deverakonda : అభిమానికిచ్చిన మాట నిలబెట్టుకున్న రౌడీ హీరో..
ప్రముఖ సింగింగ్ షో 'ఇండియన్ ఐడల్ సీజన్ 12'లో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ పాల్గొన్న సంగతి తెలిసిందే.
ప్రముఖ సింగింగ్ షో 'ఇండియన్ ఐడల్ సీజన్ 12'లో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆమెకి ఇచ్చిన మాటని రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిలబెట్టుకున్నారు. తను నటిస్తోన్న 'లైగర్' సినిమాలో ఆమెతో ఓ పాట పాడించారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. షణ్ముఖ ప్రియని కలిసి.. ఆమెతో ముచ్చటించిన దృశ్యాల్ని అభిమానులతో పంచుకున్నారు.
''విజయ్ దేవరకొండకి నేను అభిమానిని. అలాంటి ఆయన నా గురించి మాట్లాడతారని.. నాకు సపోర్ట్ చేస్తారని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది నేను నమ్మలేకపోతున్నా'' అంటూ విజయ్ ని కలవకముందు షణ్ముఖప్రియ తన మనసులో మాటని వెల్లడించింది. ఈ విషయాన్నే ఇప్పుడు విజయ్ షేర్ చేసిన వీడియోలో చూపించారు. త్వరలోనే 'లైగర్' సినిమాలో షణ్ముఖప్రియ పాడిన పాటను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Samantha Akkineni Photos: చైతూ లేకుండా సామ్ గోవా టూర్..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్
షణ్ముఖ ప్రియా గానం విజయ్ ని ఆకట్టుకోవడంతో ఇండియన్ ఐడల్ లో నువ్ గెలిచినా.. అధికా హైదరాబాద్ వచ్చాక కలుద్దాం.. నువ్వు నా సినిమాలో పాడతావ్ అంటూ విజయ్ దేవరకొండ గతంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు తను ఇచ్చిన ప్రామిస్ ను నిలబెట్టుకున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్టర్ చేస్తోన్న 'లైగర్' సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
There is no greater happiness than being able to make someone’s dream come true :)
— Vijay Deverakonda (@TheDeverakonda) September 6, 2021
Team #Liger welcomes this little rockstar SMP on board our terrific album! https://t.co/w7GnXd3rrn
#ShanmukhaPriya🎙on Board for a song in #Liger 🔥 - #LigerPromisehttps://t.co/uJNe5XEUpH@karanjohar #PuriJagannadh @Charmmeofficial @DharmaMovies @PuriConnects #VijayDeverakonda pic.twitter.com/D5vMnjXxMQ
— Sathish Kumar M (@sathishmsk) September 6, 2021
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion