IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Beast Trailer: విజయ్ 'బీస్ట్' ట్రైలర్ చూశారా? యాక్షన్ డోస్ మాములుగా లేదు

విజయ్ నటిస్తోన్న 'బీస్ట్' సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. 

FOLLOW US: 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 2021 సంక్రాంతి కానుకగా.. 'మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ హీరో 'బీస్ట్' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. 'డాక్టర్'తో తెలుగులోనూ మంచి విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. 'అరబిక్ కుతు' సాంగ్ అయితే మిలియన్ల వ్యూస్ ను రాబడుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది. ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. సినిమాలో విజయ్.. వీర అనే క్యారెక్టర్ లో కనిపించనున్నారు. 

చెన్నైలో ఓ ఫేమస్ మాల్ ని టెర్రరిస్ట్ లు హైజాక్ చేస్తారు. అయితే అదే మాల్ లో గవర్నమెంట్ కి చెందిన టాలెంటెడ్ స్పై కూడా ఉంటాడు. అతడే మన హీరో విజయ్. ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమా. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ మాములుగా లేవు. స్టైలిష్ గా ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది.

తెలుగులో కూడా భారీ ఎత్తున్న 'బీస్ట్'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను సుమారు 11 కోట్ల రూపాయలకు ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, 'దిల్' రాజు, ఏషియన్ సునీల్ నారంగ్ సొంతం చేసుకున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ముగ్గురూ సంయుక్తంగా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడైపోయాయని సమాచారం. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. దీనికోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Published at : 02 Apr 2022 06:01 PM (IST) Tags: Pooja hegde Vijay Beast Movie nelson dileep kumar Beast Trailer

సంబంధిత కథనాలు

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Upcoming Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలివే!

Upcoming Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలివే!

Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర

Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి

Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, తెలంగాణలో రెండు స్థానాలకు ఎలక్షన్

Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, తెలంగాణలో రెండు స్థానాలకు ఎలక్షన్

Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్‌కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!

Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్‌కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!