అన్వేషించండి

Actress Jayanthi : ప్రముఖ నటి జయంతి కన్నుమూత!

ప్రముఖ నటి జయంతి(76) కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ నటి జయంతి(76) కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బెంగుళూరులోని ప్రైవేటు హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ జ‌యంతి క‌న్నుమూశారు. మూడు ద‌శాబ్దాలుగా జ‌యంతి అస్త‌మాతో బాధ‌ప‌డుతున్నారు.   

జయంతి మరణంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన జయంతి అసలు పేరు కమలకుమారి. 1960లో 'యానై పాగన్‌' అనే తమిళ సినిమాతో ఆమె మొదటిసారి బాలనటిగా వెండితెరకు పరిచయమయ్యారు. కన్నడ దర్శకుడు వై.ఆర్‌.స్వామి జయంతికి హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చారు. ఆయనే ఆమె పేరును జయంతిగా మార్చారు.  1963లో 'జెనుగూడు' అనే కన్నడ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు.   


సౌత్ ఇండియన్ భాషల్లో 500 లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె.. పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1960, 70 దశకాల్లో వెండితెరపై జయంతి హవా నడించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది జయంతి. కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పి ప్రత్యేకత చాటుకుంది జయంతి. 

దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్‌, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. నందమూరి తారకరామారావు, ఎంజీ రామచంద్రన్‌, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌ వంటి అగ్రకథానాయకుల సినిమాల్లో జయంతి కీలకపాత్రలు పోషించారు. 'కొండవీటి సింహం', 'బొబ్బిలి యుద్ధం', 'పెదరాయుడు' వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయంతి.  

వీటితో 'స్వాతికిరణం', 'శాంతి నివాసం', 'జస్టిస్ చౌదరి', 'రాజా విక్రమార్క', 'అల్లూరి సీతారామరాజు', 'దేవదాసు' వంటి అనేక చిత్రాల్లో ఆమె నటించారు. ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటిగా ప్రెసిడెంట్‌ మెడల్‌, రెండు ఫిల్మ్‌ఫేర్‌  అవార్డులను అందుకున్నారు. సినీ పరిశ్రమకు జయంతి చేస్తున్న సేవలను గుర్తించిన కన్నడ చిత్రసీమ ఆమెను ‘అభినయ శారద’ అనే బిరుదుతో సత్కరించింది. 1998 లోక్‌సభ ఎన్నికల్లో లోక్‌శక్తి పార్టీ తరఫున పోటీ చేసి జయంతి ఓటమి పాలయ్యారు. 1999లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పరాజయం పొందారు.

జయంతి హఠాన్మరణంతో కన్నడ నాట విషాద ఛాయలు అలుముకున్నాయి. జయంతి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: నామినేషన్ల రోహిత్ టాపిక్! స్నేహానికే వెన్నుపోటు అంటూ అమన్‌ మీద సుధీర్ ఫైర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: నామినేషన్ల రోహిత్ టాపిక్! స్నేహానికే వెన్నుపోటు అంటూ అమన్‌ మీద సుధీర్ ఫైర్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 2nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలిగా దీక్ష పూర్తి చేసిన మహా.. లక్ష్మీ కోసం విహారి! పద్మాక్షి ఆగ్రహం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలిగా దీక్ష పూర్తి చేసిన మహా.. లక్ష్మీ కోసం విహారి! పద్మాక్షి ఆగ్రహం!
Sai Dharam Tej Wedding : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి? - సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!... ఆ వార్తల్లో నిజమెంతంటే?
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి? - సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!... ఆ వార్తల్లో నిజమెంతంటే?
Bigg Boss Neha Fathima : బిగ్ బాస్ హౌస్‌లో క్యూట్ లవ్ స్టోరీ - పేరెంట్స్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్... అసలేం జరిగిందంటే?
బిగ్ బాస్ హౌస్‌లో క్యూట్ లవ్ స్టోరీ - పేరెంట్స్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్... అసలేం జరిగిందంటే?

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Bodies Polling: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Embed widget