News
News
X

Veera Simha Reddy OTT: ‘వీరసింహారెడ్డి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..

బాలకృష్ణ తాజా మూవీ ‘వీరసింహారెడ్డి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇకపై డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోనూ సందడి చేయబోతోంది.

FOLLOW US: 
Share:

Veera Simha Reddy OTT Release Date: నందమూరి నటసింహం బాలయ్య హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంతో తెరకెక్కిన తాజా సినిమా ‘వీరసింహారెడ్డి’.  వ‌హించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా విడుదల అయ్యింది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఫ్యాక్ష‌నిజం, యాక్ష‌న్ ను జత చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. వీర‌సింహారెడ్డి అనే రాయ‌ల‌సీమ నాయకుడిగా, జై అనే యువ‌కుడిగా నటించి మెప్పించారు. వెండి తెరపై దుమ్మురేపిన ఈ సినిమా ఇకపై ఓటీటీలోనూ సందడి చేయబోతున్నది.

ఫిబ్రవరి 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 

ఈ సినిమా ఫిబ్రవరి 23 సాయంత్రం 6 గంటల నుంచి ఓటీటీలో స్ట్రీమ్ కాబోతున్నది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ. 15 కోట్లకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన 40 రోజుల తర్వాత డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి ‘వీరసింహారెడ్డి’ మూవీ అడుగు పెట్టబోతున్నది.  

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 130 కోట్లకు పైగా వసూళు చేసింది. బాల‌య్య కెరీర్ లోనే అత్యధిక వసూళు చేసిన సినిమాగా నిలిచింది.  బాలకృష్ణ కెరీర్ లో 107వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హనీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు సహా పలువురు ఈ సినిమాలో నటించారు.  వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌ కుమార్ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ లో కనిపించింది.  

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

వీరసింహారెడ్డి’ సినిమాతో సరికొత్త పద్దతికి తెర తీసిన మల్టీ ప్లెక్స్‌లు

ఇక ఈ సినిమా కొత్త పద్దతికి తెర తీసింది.  హైదరాబాద్‌లోని మల్టీ ప్లెక్స్‌లు కూడా తొలిసారి ఉదయం 4.30 గంటలకు షోలు వేశాయి. ఇప్పటి వరకూ కేవలం సింగిల్‌ స్క్రీన్లు మాత్రమే ఇలాంటగి బెనిఫిట్‌ షోలు వేసేవి. తొలిసారి మల్టీప్లెక్స్‌ లు కూడా ‘వీరసింహారెడ్డి’తో ఈ కొత్త సంప్రదాయం మొదలు పెట్టాయి. ఇక ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘NBK 108’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే అఫీషియల్ గా బయటకు రానున్నాయి.    

Read Also: వివేక్ అగ్నిహోత్రి vs ప్రకాష్ రాజ్ - ‘కశ్మీర్ ఫైల్స్’పై మాటల యుద్ధం, ఆగని ‘ఆస్కార్’ చిచ్చు!

Published at : 12 Feb 2023 12:34 PM (IST) Tags: Disney Plus Hotstar Veera Simha Reddy Movie Veera Simha Reddy OTT Release Date

సంబంధిత కథనాలు

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం