అన్వేషించండి

Varun Tej- Lavanya : మూడు ప్రశ్నలు - ఇద్దరూ ఒకే సమాధానం, పర్ఫెక్ట్ జోడీ అనిపించుకున్న లావణ్య, వరుణ్ జంట

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ వివాహం చేసుకుని హాయిగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ‘సూపర్ సింగర్’ ప్రొగ్రాంలో పాల్గొన్నారు. వారి ఇష్టా ఇష్టాలను అభిమానులతో పంచుకున్నారు.

Varun Tej- Lavanya : మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత ఏడాది మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సుమారు 6 ఏండ్ల పాటు ప్రేమలో కొనసాగిన వీరిద్దరు గత నవంబర్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు హ్యాపీగా టూర్లు వేసిన ఈ జంట, ప్రస్తుతం సినిమాలతో బిజీ అయ్యింది.   

ఇద్దరి సమాధానం ఒక్కటే, వావ్ అంటున్న నెటిజన్లు!

ఇక వరుణ్ తేజ్ తాజా చిత్రం ’ఆపరేషన్ వాలెంటైన్’ విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే వరుణ్- లావణ్య దంపతులు ‘సూపర్ సింగర్ ప్రోగ్రాం’కు గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లావణ్య, వరుణ్ ను వేర్వేరుగా కొన్ని ప్రశ్నలు అడిగారు. వరుణ్.. లావణ్యని మొదటిసారి చూసినప్పుడు ఏం డ్రెస్ వేసుకుంది? వరుణ్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇద్దరు మొదటిసారి కలిసి వెకేషన్ కి ఎక్కడికి వెళ్లారు? సహా పలు ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలన్నింటికీ ఇద్దరు సేమ్ సమాధానం చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఇద్దరు పర్ఫెక్ట్ జోడీ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. లావణ్యను ఫస్ట్ చూసినప్పుడు బ్లూకలర్ డెనీమ్‌లో ఉన్నట్లుందని వరుణ్ అన్నాడు. లావణ్య కూడా అదే చెప్పింది. అలాగే ఇద్దరు కలిసి వెళ్లిన ఫస్ట్ వెకేషన్ థాయ్‌లాండ్ అని లావణ్య చెప్పాగా.. వరుణ్ కూడా అదే చెప్పాడు. 

గత నవంబర్ లో వరుణ్-లావణ్య వివాహం

ఇక వరుణ్ తేజ్- లావణ్య వివాహం గత ఏడాది(2023) నవంబర్ 1న అట్టహాసంగా జరిగింది. మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అది కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు ఒకటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో వీరి పెళ్లి జరిగింది. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు చాలా ఘనంగా జరిగాయి. కాక్ టైల్ పార్టీతో మొదలై హాల్ది, సంగీత వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పెళ్లికి ముందే హైదరాబాదులో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి.

'ఆపరేషన్ వాలెంటైన్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరుణ్

అటు 'గాండీవ దారి అర్జున' వంటి ప్లాప్ తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని ఆధారంగా తీసుకుని వైమానిక దాడి ప్రధాన అంశంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ కు హెడ్ గా కెప్టెన్ రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు.  ఫిబ్రవరి 16న పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. లావణ్య త్రిపాఠి రీసెంట్ గా ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. పెళ్లి త‌ర్వాత ఆమె చేసిన ప్రాజెక్ట్ ఇదే. ఈ సిరీస్‌లో బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజీత్ కీల‌క పాత్ర పోషించాడు.  విశ్వ‌క్ కే ఖండేరావ్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ‘పులి మేక’ త‌ర్వాత తెలుగులో లావ‌ణ్య త్రిపాఠి నటించిన సెకండ్ వెబ్ సిరీస్ ఇది. దీనిని అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై సుప్రియ యార్ల‌గ‌డ్డ నిర్మించారు.  ఈ వెబ్‌ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  

Read Also: రూ. 170 కోట్లకు మించి ఇచ్చినా రాజీపడను, ‘శ్రీమంతుడు’ కేసుపై శరత్ చంద్ర హాట్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Jailer 2 Live Updates: 'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
'జైలర్ 2' లైవ్ అప్డేట్స్... హైదరాబాద్‌లో ఫస్ట్ షో షురూ... రజనీకాంత్ సినిమాలో సీన్ టు సీన్ తెలుసుకోండి
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినిని దూరం పెట్టి త్రిగుణ్‌కి దగ్గరైన రోహిత్! మూడు టీమ్స్‌ మధ్య ఆధిపత్యం పోరు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినిని దూరం పెట్టి త్రిగుణ్‌కి దగ్గరైన రోహిత్! మూడు టీమ్స్‌ మధ్య ఆధిపత్యం పోరు!
Jagadhatri Serial Today October 14: నిషిక కోసం గోడదూకి ఇంట్లోకి వచ్చిన మురళి...కొట్టి చంపేసిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: నిషిక కోసం గోడదూకి ఇంట్లోకి వచ్చిన మురళి...కొట్టి చంపేసిన కౌషికి
Jailer 2 OTT : ఆ ఓటీటీలోకి జైలర్ 2 - రజనీ కాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి జైలర్ 2 - రజనీ కాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget