అన్వేషించండి

Varun Sandesh: వరుణ్ సందేశ్ కాలికి తీవ్రగాయం - యాక్షన్ సీన్ షూటింగ్‌లో!

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన హీరోగా ‘ది కానిస్టేబుల్’ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలోని ఒక యాక్షన్ సీన్ చిత్రీకరణలో ప్రమాదవశాత్తూ వరుణ్ సందేశ్ కాలికి తీవ్ర గాయం అయింది. దీంతో వెంటనే వరుణ్ సందేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మాడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చిందని సినిమా డైరెక్టర్ ఎస్.కే.ఆర్యన్ శుభన్ పేర్కొన్నారు. ఒక కానిస్టేబుల్ జీవిత కథ ఇదని, పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో ఈ సినిమా తెరకెక్కనుందని ఆర్యన్ చెప్పారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాత బలగం జగదీష్ తెలిపారు. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

మరోవైపు వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘ఢీ’ షోలో ఒక టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 'హ్యాపీ డేస్' సినిమాతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత 'కొత్త బంగారు లోకం', 'ఏమైంది ఈవేళ', 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' వంటి కొన్ని హిట్ సినిమాలు చేశారు. ఆయనతో సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల, సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల వంటి దర్శకులు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. కనీసం వాళ్ళ సినిమాల్లో మంచి క్యారెక్టర్లు కూడా వరుణ్ సందేశ్ దగ్గరకు రావడం లేదు.

సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మైఖేల్'లో వరుణ్ సందేశ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే అతని కెరీర్ మరో టర్న్ తీసుకునేదేమో! కానీ ఫ్లాప్ కావడంతో ఆ పాత్రను ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం 'ది కానిస్టేబుల్', 'చిత్రం చూడర' అనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వరుణ్ సందేశ్ సినిమాలకు కనీసం సరైన బజ్ రావడం లేదు. ఆయన కంటే ప్రదీప్ మాచిరాజు, 'సుడిగాలి' సుధీర్‌లపై ప్రేక్షకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇంతకు ముందు 'బిగ్ బాస్' రియాలిటీ షోలో కూడా వరుణ్ సందేశ్ పార్టిసిపేట్ చేశారు. అయితే హీరో కనుక ఆయన్ను బిగ్ బాస్ షోలో తీసుకున్నారని ప్రేక్షకులు భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా డ్యాన్స్ రియాలిటీ షోలో గ్రూప్ ప్రతినిధి, డ్యాన్సర్లను పరిచయం చేయడం కోసం వచ్చారనే సరికి ఆయన ఫ్యాన్స్‌తో పాటు కొందరు ఫీలవుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వెండితెరపై ఓ వెలుగు వెలిగిన వరుణ్ సందేశ్ స్థాయి ఇప్పుడు బుల్లితెరకు పడిపోవడం ఆయన్ను అభిమానించిన ప్రేక్షకులను బాధ పెడుతోంది. సరైన ప్లానింగ్ లేకపోవడం, చేసిన సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో వరుణ్ సందేశ్ కెరీర్ అనుకున్న విధంగా సాగలేదు.

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun : పుష్ప ఒక్కరే రాలేదు - కోర్టు ఏం చెప్పిందంటే?
పుష్ప ఒక్కరే రాలేదు - కోర్టు ఏం చెప్పిందంటే?
Shanmukh Jaswanth Marriage : సైలెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్ వివాహం - తిరుమల సన్నిధిలో కొత్త జంట
సైలెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్ వివాహం - తిరుమల సన్నిధిలో కొత్త జంట
Karthika Deepam 2 Serial Today June 22nd: కార్తీకదీపం 2 సీరియల్: ఆ ఫుడ్ తింటే గోల్డ్ కాయిన్ మీ సొంతం! రెస్టారెంట్లకు ఎగబడిన జనం!
కార్తీకదీపం 2 సీరియల్: ఆ ఫుడ్ తింటే గోల్డ్ కాయిన్ మీ సొంతం! రెస్టారెంట్లకు ఎగబడిన జనం!
Samantha : నా బిడ్డే నా సర్వస్వం - సమంత కామెంట్స్ వైరల్
నా బిడ్డే నా సర్వస్వం - సమంత కామెంట్స్ వైరల్

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
SIT on Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
Adilabad Crime News: ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
Sai Durgha Tej : సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
Doctor Vikrant Singh Diet : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
Team India Chances: సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!
సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!
కొత్త లుక్‌లో Aprilia SR 125, SR 175- హైదరాబాద్‌లో మిలిటరీ ఎడిషన్ స్కూటీల ధర, ఫీచర్ల వివరాలు
Aprilia SR 125, SR 175 బుకింగ్స్ ప్రారంభం- హైదరాబాద్‌లో మిలిటరీ ఎడిషన్ స్కూటీల ధరలివే
Embed widget