అన్వేషించండి

అంతా తూచ్ సరదాగా చేశా - మందుకొడుతూ మరో ట్వీట్ తో షాకిచ్చిన ‘వరుడు’ బ్యూటీ

ఇటీవలే ట్విట్టర్ వేదికగా నటి భాను శ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను అల్లు అర్జున్ ట్విట్టర్ లో బ్లాక్ చేశారని ఆరోపించింది. అంతేకాదు ప్రూఫ్ కోసం స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది.

టాలీవుడ్ హీరోయిన్ భాను శ్రీ మెహ్రా గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. భాను శ్రీ గా కంటే అల్లు అర్జున్ నటించిన ‘వరుడు’ సినిమా హీరోయిన్ అంటే వెంటనే గుర్తొస్తుంది. ‘వరుడు’ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోకపోవడంతో ఆమెకు వెంటనే అవకాశాలు రాలేదు. తర్వాత వచ్చినా అవి ఆమెకు గుర్తింపు తేలేకపోయాయి. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. అయితే ఇటీవలే ట్విట్టర్ వేదికగా భాను శ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను అల్లు అర్జున్ ట్విట్టర్ లో బ్లాక్ చేశారని ఆరోపించింది. అంతేకాదు ప్రూఫ్ కోసం స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది. అయితే ఏం జరిగిందో తెలీదు మళ్లీ కొంత సేపటికి అల్లు అర్జున్ నన్ను అన్ బ్లాక్ చేశారు అంటూ మళ్లీ ఓ ట్వీట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో బన్ని అభిమానులు రకరకాలుగా స్పందించారు. అయితే తాజాగా ఈ బ్యూటీ మరో ట్వీట్ తో ముందుకొచ్చింది. ఇప్పుడా ట్వీట్ వైరల్ అవుతోంది. 

మిమ్మల్ని నొప్పించాలని చేయలేదు : భాను శ్రీ మెహ్రా

ఆమె తాజాగా చేసిన ట్వీట్ లో ఇలా రాసుకొచ్చింది.. ‘‘ఈ రోజంతా ఊహించని విధంగా గడిచింది. నేను నిజంగా అల్లు అర్జున్ అభిమానులను నొప్పించాలని అలా చేయలేదు. నేను కూడా అల్లు అర్జున్ అభిమానినే. నేను నా కెరీర్ కు సంబంధించిన కష్టాలను సరదాగా చెప్పాను. ద్వేషాన్ని కాకుండా నవ్వును, ప్రేమను పంచుదాం.’’ అని పేర్కొంది. దానితో పాటు గ్లాసులో ఏదో తాగుతూ (మందు కొడుతూ ట్వీట్ చేసిందని బన్నీ అభిమానుల ఆరోపణ) వీడియోను కూడా షేర్ చేసింది. అయితే దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘భలే దొంగ దెబ్బ తీశావ్’’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. కొంత మంది ‘‘నీ ఛానల్ కు ఎంత మంది ఫాలోవర్స్ పెరిగారు’’ అని అడుగుతున్నారు. ఇంకొంత మంది వెరైటీగా ‘‘ఏం డ్రింక్ తాగుతున్నావ్’’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే.. 

‘వరుడు’ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసినా భాను శ్రీ మెహ్రాకు సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా పడలేదు. దీంతో పూర్తిగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ఉద్యోగంలో బిజీ అయిపోయింది. అయితే ఇటీవలే భాను ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించింది. ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి అందులో వీడియోలు పోస్ట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఆ లింక్స్ ను అల్లు అర్జున్, ఇతర హీరోలకు ట్యాగ్ చేయడం చేస్తుంది. ప్రతీసారి యూట్యూబ్ లింక్ లను ట్యాగ్ చేయడంతో ఆమెను అల్లు అర్జున్ బ్లాక్ చేశారని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే తర్వాత అల్లు అర్జున్ అన్ బ్లాక్ చేయడంతో ఆ విషయాన్ని ట్వీట్ చేసి చెప్పింది భాను. తనను అన్ బ్లాక్ చేసినందుకు బన్నీ కు థ్యాంక్స్ చెప్పింది. అయితే భాను శ్రీ ముందు బన్నీపై ఆరోపణలు చేయడంతో భానునీ టార్గెట్ చేశారు బన్నీ ఫ్యాన్స్. దీంతో దీనిపై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేసింది. మరి ఇప్పటితో ఈ వివాదం సద్దుమనుగుతుందో లేదో చూడాలి. 

Also Read : టామ్ క్రూజ్ సినిమాతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ?

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today November 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: డబ్బుల కోసం మనోహరి టెన్షన్‌ - ఐడియా ఇచ్చిన చంభా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: డబ్బుల కోసం మనోహరి టెన్షన్‌ - ఐడియా ఇచ్చిన చంభా
Jagadhatri Serial Today Nov 24: కేదార్‌ను వారసుడిగా ప్రకటించిన సుధాకర్‌..తాగిన మత్తులో మాట్లాడాటంటూ అందరికీ చెప్పిన యువరాజు
జగద్ధాత్రి సీరియల్:కేదార్‌ను వారసుడిగా ప్రకటించిన సుధాకర్‌..తాగిన మత్తులో మాట్లాడాటంటూ అందరికీ చెప్పిన యువరాజు
Bigg Boss Season 10 Today Nov 24th Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: 9 విన్నర్ కల్యాణ్‌ పడాలతో త్రిగుణ్‌ గొడవ! గెస్ట్‌ దివ్య మీద నోరు జారిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: 9 విన్నర్ కల్యాణ్‌ పడాలతో త్రిగుణ్‌ గొడవ! గెస్ట్‌ దివ్య మీద నోరు జారిన ముకేశ్!
Chiranjeevi Megaverse : 'మెగావర్స్' కోసం మెగాస్టార్ - చిరు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?... బాస్ అడ్డాలో స్టార్స్
'మెగావర్స్' కోసం మెగాస్టార్ - చిరు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?... బాస్ అడ్డాలో స్టార్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Embed widget