Upcoming OTT Release: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న ‘ఖుషి‘ - ఓటీటీలో ఏకంగా 22 చిత్రాలు
విజయ్ దేవరకొండ-సమంత నటించి 'ఖుషి' సినిమా ఈ వారంలో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఓటీటీలో మాత్రం ఏకంగా 22 కొత్త మూవీస్ విడుదలకు రెడీ అవుతున్నాయి.
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఓటీటీల్లో ఏకంగా 22 కొత్త సినిమాలు విడుదలకానున్నాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏవీ లేవు. డబ్బింగ్ చిత్రాలు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి 'డీడీ రిటర్న్స్' కామెడీ మూవీ కాగా, మరొకటి 'స్కామ్ 2003' వెబ్ సిరీస్ మాత్రం ఓ మాదిరి ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇక థియేటర్ల విషయానికి వస్తే ‘ఖుషి’ సినిమా మాత్రమే విడుదలకానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
1. ఖుషి-సెప్టెంబర్ 1న విడుదల
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం 'ఖుషి'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో... పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. సినిమా విడుదలకు 15 రోజుల ముందు 'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్' పేరుతో ఆగస్టు 15న హైదరాబాద్‌లో భారీ ఫంక్షన్ నిర్వహించారు. అందులో హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, సమంత చేసిన పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షించింది. సినిమాపై అంచనాలు పెంచింది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు
నెట్‌ఫ్లిక్స్
1. లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ద బ్లూ జోన్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 30న విడుదల
2. మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 30న విడుదల
3. చూజ్ లవ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 31న విడుదల
4. వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 31న విడుదల
5. ఏ డే అండ్ ఏ హాఫ్ (స్వీడిష్ చిత్రం) - సెప్టెంబరు 01న విడుదల
6. డిసెన్‌చాంట్‌మెంట్: పార్ట్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01న విడుదల
7. హ్యాపీ ఎండింగ్ (డచ్ సినిమా) - సెప్టెంబరు 01న విడుదల
8. లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01న విడుదల
9. ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ మూవీ) - సెప్టెంబరు 01న విడుదల
10. ఈజ్ షీ ద ఊల్ఫ్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 03న విడుదల
అమెజాన్ ప్రైమ్
1. ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 01న విడుదల
జీ5
1. బియే బిబ్రాత్ (బెంగాలీ సినిమా) - సెప్టెంబరు 01న విడుదల
2. డీడీ రిటర్న్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - సెప్టెంబరు 01న విడుదల
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
1. ఇండియానా జోన్స్ అండ్ ద డయిల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 29న విడుదల
2. NCT 127: ద లాస్ట్ బాయ్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 30న విడుదల
3. ద ఫ్రీలాన్సర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 01న విడుదల
మోహిత్ రైనా, అనుపమ్ ఖేర్, సుశాంత్ సింగ్ నటించిన ది ఫ్రీలాన్సర్ చిత్రంసెప్టెంబర్ 1 డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌ను నీరజ్ పాండే రూపొందించారు. భారీగా అంచనాలు ఉన్నాయి.
సోనీ లివ్
1. స్కామ్ 2003: ద తెల్గి స్టోరీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 01న విడుదల
Read Also: చిరంజీవి ఎత్తుకున్న ఆ బుల్లి హీరో ఎవరో చెప్పగలరా? అతడు కాబోయే పాన్ ఇండియా స్టార్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial