అన్వేషించండి

Balakrishna - Unstoppable Anthem : బాలయ్య ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట! - రెండోసారి హిస్టరీ రిపీట్ చేసేలా 'అన్‌స్టాప‌బుల్‌ 2'

'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే' సీజన్ 2కు నట సింహం నందమూరి బాలకృష్ణ రెడీ అయ్యారు. ఈ రోజు 'అన్‌స్టాప‌బుల్‌ యాంథమ్' విడుదల చేశారు.

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) లో చిలిపితనాన్ని, ఆయన ఎంత సరదాగా ఉంటారు? అనే విషయాన్నీ ప్రేక్షకులకు తెలిసేలా చేసింది 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే' (Unstoppable With NBK). 'ఆహా' ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అయ్యింది. ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఎన్‌బీకే107 సినిమా షూటింగ్ చేస్తున్న బాలకృష్ణ, తిరిగొచ్చిన వెంటనే... 'అన్‌స్టాప‌బుల్‌ 2' (Unstoppable 2) స్టార్ట్ చేయనున్నారు. 

నందమూరి అభిమానులకు... బాలయ్య భక్తులకు... శుభవార్త ఏంటంటే? ఈ రోజు 'అన్‌స్టాప‌బుల్‌ యాంథమ్' విడుదల చేశారు. 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2' టైటిల్ సాంగ్‌కు యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ బాణీ అందించారు. యువ గాయకుడు, ర్యాపర్ రోల్ రైడ సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. 

'తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా...
డైలాగు వదిలితే మోగిపోద్ది బాడీ అంతా!
మాటలు తప్పుకొని వెళ్ళలేవు రాంగ్ వే...' అంటూ రోల్ రైడ ర్యాప్ స్టైల్‌లో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.     

ఈ పాట గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ''రోల్ రైడ, మహతి స్వర సాగర్ చేసిన యాంథమ్ నాకు ఎంతోగానో నచ్చింది. నా అభిమానులతో పాటు 'ఆహా' వీక్షకులు, ప్రేక్షకులు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని పేర్కొన్నారు. అక్టోబర్‌లో 'అన్‌స్టాప‌బుల్‌ 2' స్టార్ట్ కానున్నట్లు ఆహా ప్రతినిథులు పేర్కొన్నారు. 

దసరాకు సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్!?
విజయ దశమి సందర్భంగా 'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2' (Unstoppable With NBK Season 2) ప్రారంభం కానుందని ఆ మధ్య వినిపించింది. అయితే... ప్రస్తుతం బాలకృష్ణ టర్కీలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఎపిసోడ్స్ షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఒక్కసారి వస్తే... షూటింగ్, ఎడిటింగ్ చేయడం పెద్ద పని ఏమీ కాదు. ఒక్క రోజులో రెండు మూడు ఎపిసోడ్స్ రెడీ చేయవచ్చు. 

Also Read : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత

'అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2'లో ఎవరెవరు సందడి చేయనున్నారు? అనే ఆసక్తి వీక్షకులలో ఉంది. అంత కంటే ముందు... ఎవరితో స్టార్ట్ కానుంది? అనే విషయం కూడా క్యూరియాసిటీ కలిగిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... తొలి ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారట. ఆయన మాత్రమే కాదు... చిరు సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరో ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారట.   

మహేష్, బన్నీ... రెండోసారి?
తొలి సీజన్‌లో సందడి చేసిన మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు రెండో సీజన్‌లో కూడా సందడి చేయనున్నారని టాక్. ఫస్ట్ సీజన్ సాధించిన విజయం కారణంగా రెండో సీజన్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. అందువల్ల, ఈసారి మరింత వినోదాత్మకంగా, కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

Also Read : గజగజ వణికించే గజరాజడిగోరో - మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today July 31th: శైలుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన కేశవ్‌...కేశవ్‌ బాధ్యతను మెచ్చుకున్న మహాలక్ష్మీ
పొదరిల్లు: శైలుని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన కేశవ్‌...కేశవ్‌ బాధ్యతను మెచ్చుకున్న మహాలక్ష్మీ
Brahmamudi Serial Today July 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను నిలదీసిన భ్రమరాంబ – అయోమయంలో ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను నిలదీసిన భ్రమరాంబ – అయోమయంలో ఇందు
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Embed widget