![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ennenno Janmala Bandham August 28th: యష్, వేద అంతు చూడటానికి సిద్ధమైన అభి.. బయటపడిన వసంత్ నిజ స్వరూపం?
జైలు నుండి బయటకి వచ్చిన అభి యష్ దంపతులను మళ్లీ టార్గెట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Ennenno Janmala Bandham August 28th: యష్, వేద అంతు చూడటానికి సిద్ధమైన అభి.. బయటపడిన వసంత్ నిజ స్వరూపం? Vasanth True Form Revealed in Ennenno Janmala Bandham August 28th eposide Ennenno Janmala Bandham August 28th: యష్, వేద అంతు చూడటానికి సిద్ధమైన అభి.. బయటపడిన వసంత్ నిజ స్వరూపం?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/28/e1a026f1942a37ad7dea8d05be841bb51693207336916768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ennenno Janmala Bandham August 28th: ఈరోజు ఎపిసోడ్ లో యష్ వేద కోసం పాలు తీసుకుని రాగా నాకు పాలు అంటే ఇష్టం ఉండదు కదా అనగా పిల్లల కోసం కొన్ని పనులు చేయాల్సింది తప్పదు అని వేదకు పాలు తాగమని ఇస్తాడు. బిడ్డ కోసం ఎంతో తాపత్రయపడుతున్నాడు కనీసం ఆయన కోసమైనా నా కడుపులో బిడ్డను ఆరోగ్యంగా ఉంచు దేవుడా అని వేద ఆ పాలు తాగుతూ ఉంటుంది.
అప్పుడు వేద ఈ విషయం మనం అత్తయ్య అమ్మ వాళ్లకు చెబుదాము అనగా ఎందుకు అని యష్ అనడంతో వాళ్లకి చెప్పే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని అంటుంది వేద. చెబుదాము ఇప్పుడు కాదు మంచి సమయం సందర్భం చూసుకొని చెబుదాము అని అంటాడు. కానీ నువ్వు అంతవరకు జాగ్రత్తగా ఉండాలి అని చంటి పాప లాగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు యష్ చేసిన చూసి వేద మురిసిపోతూ ఉంటుంది.
అప్పుడు యష్ పుట్టబోయే తన బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు. మరొకవైపు కైలాష్ రోడ్డు పై నడుచుకుంటూ వెళుతుండగా ఇంతలో అభిరావడంతో ఎప్పుడొచ్చావు బ్రో అనగా మిమ్మల్ని టైం మొత్తం వేస్ట్ చేశాను అని అంటాడు అభి. నాకు అన్నీ తెలుసు నీలాంబరి అని చెప్పింది అని అంటాడు. సరే తన సంగతి పక్కన పెట్టు దెబ్బ తిన్నాను. దెబ్బ కొట్టి తీరాలి సమయం లేదు ముందు వెనుక ఆలోచించను అని అభి కోపంగా మాట్లాడుతాడు. వేరే ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దు టచ్ లో ఉండు అని డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అభి.
మరోవైపు వేద బట్టలు సర్దుతూ ఉండగా ఇంతలో యష్ అక్కడికి వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి పనులు అన్ని చేయవద్దు అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు అని అంటాడు. ఈ పనులన్నీ ఇంట్లో వాళ్ళు చేస్తారు లేకపోతే నేను చేస్తాను కానీ నువ్వు మాత్రం ముట్టుకోవద్దు అని జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. అదేంటండి మినిమమ్ ఎక్సర్సైజ్ చేయాలి కదా అని వేద అనగా కరెక్టే కానీ నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను వేదా? నువ్వు మాత్రం రెస్ట్ తీసుకోవాల్సిందే అని అంటాడు యశ్.
నువ్వు జాగ్రత్తలు తీసుకోకుండా నన్ను భయపెట్టకు ప్లీజ్ వేద అని బ్రతిమలాడుతాడు. సరే అని అంటుంది వేద. ఇప్పుడు వేదాన్ని కూర్చోబెట్టి బట్టలు సర్దుతూ ఉండగా అది చూసే వేద మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు వేద, యష్ ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ సంతోష పడుతూ ఉంటారు. తరువాత వేదని ఫ్రెష్ అయ్యి రమ్మని చెబుతాడు. మరొకవైపు వసంత్, చిట్లకు తెలియకుండా గీతతో సీక్రెట్ గా మాట్లాడుతూ ఉండగా గీత మాత్రం వసంతని రొమాంటిక్ గా మాట్లాడుతూ రెచ్చగొడుతూ ఉంటుంది.
అప్పుడు చిత్ర అక్కడికి వచ్చి వసంత్ మాట్లాడిన మాటలు అన్నీ వింటూ ఉంటుంది. అప్పుడు వసంత్ మొబైల్ చెక్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నన్ను ప్రేమించావు ఇంకా ఎంతమంది అమ్మాయిలు జీవితం నాశనం చేస్తావు అని వసంత్ ను నిలదీస్తుంది చిత్ర. అప్పుడు చిత్ర వసంత్ ని నిలదీయగా వసంత్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని వసంత్ మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిత్ర. మరొకవైపు వేద స్నానం చేసి రాగ వేద కోసం సాంబ్రాణి అన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. అప్పుడు గతంలో జరిగిన విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకొని సంతోష పడుతూ ఉంటుంది వేద.
also read it : Krishna Mukunda Murari August 24th: కూతురి ప్రేమ గురించి శ్రీనివాస్ భవానికి నిజం చెప్పాడా.. ముకుంద, మురారి ఫోటో చూసేసిన నందు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)