అన్వేషించండి

Trinayani Serial Today May 13th: 'త్రినయని' సీరియల్ : రివేంజ్ ప్లాన్ చేసిన అత్తాకోడళ్లు.. విశాలాక్షి, గాయత్రీ పాప చుట్టూ మంటలు!

Trinayani Serial Today Episode : తమను తేనెటీగలతో కుట్టించిన విశాలాక్షి అంతు చూడాలని తిలోత్తమ, వల్లభ, సుమన విశాలాక్షి ముఖం కాల్చేయాలని ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode తిలోత్తమ, సుమన, వల్లభలు బంగారు కొబ్బరి కాయ పగలగొట్టడంతో తేనెటీగలు వచ్చి ముగ్గురిని కుట్టేస్తాయి. ఇక సుమన కోసం గంజి పట్టుకొని నయని వస్తుంది. సుమన ముఖానికి రాస్తుంది.  

సుమన: ఇక చాల్లే ఆపు అక్క నిన్ను చూసుకొని మా ఆయన దెప్పిపొడుపు ఎక్కువ అయిపోయింది. వెళ్లు అక్క.

తిలోత్తమ, వల్లభలు కూడా ఇబ్బంది పడతారు. తిలోత్తమ తడిగుడ్డ వేసుకుంటే వల్లభ చిన్న ఫ్యాన్ పెట్టుకుంటాడు. ఇక హాసిని వచ్చి కూలింగ్ పౌడర్ తీసుకొచ్చానని రాస్తే ఉపశమనం ఉంటుందని చెప్తుంది. ఇద్దరిని కళ్లు మూసుకోమని చెప్పి వారి ముఖాన పౌడర్ విసిరి పెయింట్ బ్రష్‌తో ముఖానికి రుద్దేస్తుంది. హాసిని చేష్టలకు తిలోత్తమ తిట్టి పంపేస్తుంది. 

మరోవైపు విశాలాక్షి ధ్యానంలో ఉంటుంది. వల్లభ, తిలోత్తమలు చూస్తారు. విశాలాక్షి గారడి వల్లే ముగ్గురికి తేనెటీగలు కుట్టాయని, ముగ్గరు విశాలాక్షిని చూసి తిట్టుకుంటారు. అందరూ తమని చూసి నవ్వుకున్నారని. బదులు తీర్చుకోవాలి అని అనుకుంటారు.

సుమన: తేనెటీగలు కుట్టిన మన ముఖం చూసి నవ్వుకున్న అందరూ ఇప్పుడు ఆ విశాలాక్షి ముఖం చూసి నవ్వుకోవాలి.    

తిలోత్తమ: అసలు ఆ ముఖమే చూడకండా చేస్తే..

సుమన: ఎలా అత్తయ్య.

తిలోత్తమ: ఇలా.. అంటూ ఓ బాటిల్ చూపిస్తుంది. సెంటులా కనిపించే అది ఒంటికి వేస్తే పక్క నుంచి నిప్పు తగిలితే మండి పోతుందని అంటుంది. 

ఇక సుమన ఆ సెంటుని విశాలాక్షి ముఖం మీద కొట్టాలని వెళ్తుంది. అప్పుడే అక్కడికి గాయత్రీ పాప వస్తుంది. అది చూసిన సుమన ఈ పిల్ల చెప్తుందా అనుకుంటుంది. అయినా అది ఎవరికీ చెప్పలేదు అనుకొని విశాలాక్షి ముఖానికి, ఒళ్లంతా పూసేస్తుంది. తిలోత్తమ, వల్లభలు కూడా ఏం చేస్తుంది అని షాక్ అయిపోతారు.

తిలోత్తమ: అదేంటి సుమన అలా కొట్టేశావు.

సుమన: కాలితే కాలిందిలే అత్తయ్య మళ్లీ జన్మలో మన జోలికి రాదు. 

వల్లభ: మరీ అంత కొట్టేశావు దూరంగా ఉండి హారతి ఇవ్వు.

సుమన: నా జాగ్రత్తలో నేను ఉంటాను.

ఇక అందరూ అక్కడికి వస్తారు. అందరూ హాల్‌లో మంచి సువాసన వస్తుందని అనుకుంటారు. 

తిలోత్తమ: అలా అనిపిస్తుందా సుమన పూజ గదిలో విశేష పూజ చేసుకుంటుంది. దాని ప్రభావం అని మాకు అనిపిస్తుంది. 

వల్లభ: ఈరోజు ఏదో విశేష దినం అని చెప్పింది నాకు అర్థం కాలేదు.

దురంధర: విక్కీకి చెప్పకుండా నీకు బాగానే చెప్పింది వల్లభ.

ఇంతలో సుమన పూజ పూర్తి అయిందని చెప్పి హారతి పట్టుకొని వస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. సుమన పూజ చేయడం వింతగా ఉందని అంటారు. సుమన కవర్ చేస్తూ అందరికీ హారతి ఇస్తుంది. ఇక విశాలాక్షికి హారతి ఇచ్చే టైంకి గాయత్రీ పాప విశాలాక్షి ఒడిలో కూర్చొంటుంది. దీంతో సుమన షాక్ అయిపోతుంది. వల్లభ విశాలాక్షికి హారతి ఇవ్వొద్దని అంటాడు. ఎందుకు అలా అని విశాల్ అడుగుతాడు. పర్వాలేదు అని హారతి ఇవ్వమని విశాలాక్షి అంటుంది. ఇక సుమన విశాలాక్షికి హారతిని కొంచెం దూరం నిల్చొని ఇస్తుంది. 

విశాలాక్షి కాస్త దగ్గరకు వచ్చి హారతి ఇవ్వమని అంటుంది. సుమన కంగారుగా వెళ్తుంది. దగ్గరకు రమ్మన్న కొద్ది సుమన భయపడుతుంది. తిలోత్తమ కవర్ చేస్తుంది. సుమనకు సపోర్ట్ చేస్తుంది. సుమన విశాలాక్షి దగ్గరకు వెళ్తూ కంగారులో పళ్లెం పడేస్తుంది. దీంతో విశాలాక్షి, గాయత్రీ పాప చుట్టూ అగ్గి అంటుకుంటుంది. దీంతో అందరూ హడావుడి చేస్తారు. దాంతో విశాలాక్షి తమకు ఏమీ కాదు అని కంగారు పడొద్దని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: లక్కీ ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరీ - సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget